సైకలాజికల్ థ్రిల్లర్ లను ఇష్టపడేవాళ్ళు చూడొచ్చు ‘‘ నేనొక్కడినే ’’

వన్ నేనొక్కడినే సినిమా చూసాను. పండగకు సినిమాకు వెళ్ళాలన్న దానికన్నా రివ్యూలలో రెండు స్థాయిల ఎక్స్ ట్రీమ్ లు ఎందుకొచ్చాయి బావుందంటే చాలా బావుందనీ, బాలేదంటే అస్సలు బాగాలేదనీ ఎందుకంటున్నారనే ఉత్సుకత కొద్ది మరీ సినిమా చూసాను. జండూబామ్ తీసుకెళ్ళండని భయపెట్టేంత బోరు వుండటం అబద్దమని చెప్పేందుకు రెండు ముక్కలు రాద్దామనిపించింది.

నడుస్తున్న కథనాన్ని నా ఇంట్రర్ప్రిటేషన్లూ, ఎక్స్ పెక్టేషన్లూ లేకుండా చూసుకుంటూ వెళ్ళాను. కొన్ని వాస్తవానికి సరిపోతున్నాయా లేదా అనే లాజిక్ ఒక్కటి వదిలేస్తే సినిమా నాకు నచ్చింది. మూసకి నిజంగా భిన్నంగా వుంది. జీవితమంత సాధారణంగానే కథకూడా నడుస్తుంది.

రాక్ స్టార్ గా మహేష్ బాబు, జర్నలిస్టు సనమ్ గా కృతిసనన్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ట ఈ రొటీనంతా చెప్పను కానీ మహేష్ బాబు దక్షిణాది హృతిక్ లా కొత్తగా వున్నాడనే ముక్క మాత్రం చెప్పాలి.

1) తమపై జరిగిన దాడినుంచీ తప్పించుకునేందుకు కార్ పార్కింగ్ లోని చాలా కార్ల తాళం చేతుల్ని గుప్పెట నిండా తీసుకుని ఒక్కొక్కటీ పారేసుకుంటూ వస్తాడు. నాకర్ధం కాలేదు ముందు తర్వాత తనకి దగ్గరలో బజర్ ఏది రింగయితే ఆ కారు వాడుకునేందుకు చేసిన ప్లాన్ అని ఇలాంటి కథనంతో పాటు వచ్చే మైండ్ గేమ్స్, లాజికల్ సీక్వెన్సెస్ బావున్నాయి.
ఫోటో సీక్వెన్స్ ల నుంచి నంబరు తీయటం. రూబిక్స్ కి బ్యాంక్ లోగో నంబరు కలపటం ( తండ్రి ఎలాగూ శాస్త్రవేత్త కదా),

2) రత్నవేలు కెమెరా పనితనం మొదటి షాట్ లో లైటింగ్ లో నీళ్ళమధ్యనుంచి కనిపించే రాళ్ళను చూపించటం దగ్గరనుంచి ఛేజింగ్ షాట్ల వరకూ అన్నీ బాగా నడిచాయి.

3) ముఖ్యంగా పీటర్‌ హేన్స్‌ హాలీవుడ్ సినిమాను మరిపించేలా స్టంట్ సీక్వెన్స్ లను అల్లాడు. రోడ్ బైక్ కార్ చేజింగ్ లు, మిడ్ సీ యాక్షన్ సీన్ లు గుర్తుండి పోయేలా తీసారు. అడ్డంగా వదిలిన బైక్ వల్ల పైకి లేచి తనమీదుగా వెళుతుండటాన్ని హీరో గమనించటం ఒకటి స్లోమోషన్ లో తీసిన సీన్ కథ ప్రకారం ఊహే కానీ ఒన్నాఫ్ ది హైలెట్. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో వుందనే విషయాన్ని విమర్శకులు కూడా కాదనటం లేదనుకుంటాను.

4) విలనెవరో తెలిసి పోరాడటం చూస్తూనే వున్నాం నిజంగా వున్నాడా లేడో తెలియదు. తనది బ్రమో నిజమో తెలియదు. బయటి వాళ్ళతోనే కాదు మనతో మనకీ పోరాటమే మధ్యలో వదిలేస్తే గోల్డెన్ రైస్ లాంటి నిధే కాదు. అంతకంటే విలువైన జ్ఞాపకాల ఆల్పం సైతం దొరకదు. ఇంటర్వెల్ కిముందే ఒక విలన్ ని చాలా కూల్ కామిక్ సిట్యుయేషన్ లో చంపేయటం రెగ్యులర్ హై వెయిట్ రివేంజ్ సీక్వెన్స్ లకు చాలా భిన్నంగా కొత్తగా ఊహించారు.

5) అనవసరమైన రొటీన్ కామెడీ లేదు కానీ కథానుగుణంగా వచ్చే సన్నివేశాలు ఆ కొరతను కొంతమేరకు తీర్చాయి.

6) దేవిశ్రీప్రసాద్ పాటల్లో హూ ఆర్ యూ కథకు బాగా అతికింది. మిగిలినవి స్పీడ్ గా అయితే వున్నాయి.

లండన్ టాక్సీ డ్రైవర్ గా పోసాని, ముఖ్యమైన కొన్ని పాత్రల్లో నాజర్ నాజర్, ప్రదీప్ రావత్, కెల్లీ దోర్జి, షాయాజి షిండే, ఆనంద్, లు చేసారు.సినిమా చూసిన తర్వాత కథ రచయిత పేరుకోసం వెతుక్కున్నాను జక్కా హరిప్రసాద్ అట. విజువల్ మీడియం కొసం కంటే నవలలా మరింత బాగా పనికొచ్చెలా తయారు చేసినట్లున్నారు.

కామెంట్‌లు

  1. ఇదసలు సైకలాజికల్ ధ్రిల్లర్ కాదని పనిలేక బ్లాగరు డాక్టరుగారు వ్రాసారు చూసారా?

    రిప్లయితొలగించండి
  2. నేను చూసిన తర్వాత ప్రేక్షకుడిగా ఇది నా అభిప్రాయం. ‘పనిలేక’ బ్లాగు కూడా చూసానండీ అక్కడున్న కామెంట్లు కూడా, అది సైకలాజికల్ థ్రిల్లర్ కాదని డాక్టరు రమణగారు అనలేదనుకుంటానండీ. అందులో పేర్కొన్న జబ్బు పేరు సరైంది కాదు, అటువంటి పేరుతో సైకలాజికల్ జబ్బులేవీ లేవని అన్నట్లున్నారు. మిగిలినదేదైనా అది వారి అభిప్రాయం అంతేకదా. సినిమాని సరాసరి చూసే అవకాశం వున్నప్పుడు మనకేమనిపించింది అనేది చూసుకుంటే చాలనుకుంటానండీ. టికెట్ కొనుక్కుని ధియెటర్ కు వెళ్ళేది అందుకే కదా

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి