ఖాళీలను పూరించొద్దు

మంచి జీర్ణానికైతే
పదార్ధమూ, ద్రవమూ కాకుండా సంచిలో

కొంత ఖాళీ వుంచాలి.
...
...

మంచి జీవితానికేమో
పని, విశ్రాంతే కాకుండా మదిలో

కొంత ఖాళీ వుండాలి.

...
...
...

మంచి వ్యక్తీకరణకూ అంతే
అక్షరమూ,పదమే కాకుండా

సరైనా ఖాళీ వుంటుండాలి.

బంధానికీ ఎదుగుదలదగ్గరా,
స్నేహానికీ మలుపున్న తోవన
వ్యసనానికీ గతితప్పే తావున
అందానికీ విలువందని చోటున,
విలువకూ బ్రతుకెళ్ళని మూలన,
సంఘర్షణలో రాపడి క్షయంచేయనంత దూరంగా
ఆనంతానందంలో .........................
.
.
.

అవసరమైన చోట   ఖా   ళీ   లు     ఉంటుండాలి.


కవిసంగమంలో

కామెంట్‌లు