నిజాం రాజ నర్తకీమణులు |
నిజాం నవాబుల కాలంలో ప్రముఖ ఉర్దూ కవయిత్రి మహలఖబాయి. ఆమెను ‘చందాబీబి’ అని కూడా పిలిచేవారు.
భారతదేశంలోనే తొలి ఉర్దూ కవయిత్రిగా ఆమెకు పేరుంది.
నిజాం నవాబుల రాజనర్తకి, గాయని, కవయిత్రి మహాలఖా బాయి చాందా (మాహ్ అంటె చంద్రుడు, లఖా అంటె వదన = చంద్రవదన).
ఆమె వంశీయులు గుజరాత్‌కు చెందినవారు. 1వ శతాబ్దంలో హైదరాబాద్‌కు వలస వచ్చారు. మాహ్‌లఖా బాయి చందా తల్లి రాజ్ కన్వర్ బాయి. ఆమె హిందువు. ఆమె అన్న నైజాం సైన్యంలో ఉన్నతాధికారిగా పని చేసేవాడు. నృత్యం ఆమెకు ఆరో ప్రాణం. ఆస్థాన నర్తకిగా వున్నా వివాహం చేసుకుంది. భర్త తాజ్ అలీ షా. విభిన్న రంగాలలో ప్రతిభాశాలి. చిత్రకారుడే కాదు, చరిత్రకారుడు కూడా. వారి ఏకైక సంతానమే మాహ్‌లఖా బాయి. తల్లి నుండి నృత్యాన్ని, అందాన్ని తండ్రి నుండి కళాత్మక హృదయాన్ని, చరిత్ర గ్రంథాల యెడల మమకారాన్నే గాక మేన మామ నుండి ధైర్యాన్ని, వీరత్వాన్ని వారసత్వంగా పుణికి పుచ్చుకుంది.
క్రీ.శ. 1764 ఏప్రిల్ 4న మహాలఖా బాయి హైదరాబాద్ నగరంలో జన్మించింది
. మాహ్‌లఖా బాయి జననమే ఒక వింత కథ. ఆమె తల్లి ఆర్నెల్ల గర్భవతిగా ఉన్నప్పుడు మౌలాలీ గుట్ట మీద ఉన్న ఒక సూఫీ సాధువు దర్గా సందర్శనకు పోయింది. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ కష్టం భరించలేక గర్భవిచ్చిత్తి జరిగే సూచనలు కనిపించినై. భర్త తాజ్ అలీ షా ఒక్కడే పరిగెత్తి పైకి పోయి అక్కడి ప్రసాదాన్ని తెచ్చి ఆమెకు తినిపించగానే ప్రమాదం తప్పిపోయింది. తొమ్మిది నెలలు నిండిన తర్వాత పండంటి బిడ్డ ‘మాహ్‌లఖా బాయి’ని కన్నది. ఆమె అసలు పేరు ‘చాందా బీబీ’. మహాలఖా బాయి ప్రతిభను గుర్తించిన అప్పటి నిజాం ప్రధాని అరిస్తు జాహ్ రెండవ నిజాంకు ఆమెను పరిచయం చేసారు. దీంతో నిజాం ఆమెను రాజనర్తకిగా నియమించారు. అనతికాలంలోనే నిజాంకు నమ్మకస్తురాలైన సలహాదారుగా మారింది. ఆమె విశ్వసనీయతకు మెచ్చి నిజాం అపార భూములను మహాలఖా బాయికి కానుకగా ఇచ్చారు. అందులో నేడు నగరంలో ఉన్న పురానా హవేలీ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కార్యాలయ ప్రదేశాలు ఒకప్పటి మహాలఖా బాయి ఎస్టేట్లే. అంతేకాదు, నిజాం ఆమెకు అనేక సౌకర్యాలు కల్పించారు.ఆమె తన జీవితకాలంలో మౌలాలీ గుట్టపై ‘ఉర్సులను’ ప్రతి యేటా ఘనంగా జరిపించేది. గుట్ట కింద ఒక పెద్ద పూలతోటను నిర్మించింది. అందులో తన తల్లిని సమాధి చేసింది.

రాజనర్తకీమణుల నాట్యవిన్యాసాలు |
చందా 1824 లో సుమారు 55 సంవత్సరాల వయస్సులో మరణానంతరం మౌలాలీ కొండపైన ఆమె జ్ఞాపకార్థం నిర్మించిందే మక్‌బారా. ఆమె బతికున్న సమయంలో ఇక్కడ ముషాయిరా నిర్వహించేదట. అందుకే, ఇక్కడే ఆమె సమాధి నిర్మించారు.
మౌలాలీ గుట్టపై వున్న మహాలకా చందా సమాధి |
మౌలాలీ, అధికమెట్ట (అడిక్‌మెట్) నేటి ఉస్మానియా యూనివర్శిటీ, సీఫెల్ నుండి బాగులింగంపల్లి వరకూ ఈమె జాగీరులోని ఇలాఖాలు. చదువుల తల్లి ఉస్మానియా యూనివర్శిటీ, వివిధ విదేశ భాషలను అభ్యసించే ‘సీఫెల్’(ఇప్లూ), ఆంధ్ర మహిళా కళాశాలతో పాటు బాగులింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మొదలగు విద్యాకేంద్రాలన్నీ మాహ్‌లఖా బాయి చందా భిక్ష పెట్టిన స్థలాలే.
మహాలక చందమెట్ల బావి ఉస్మానియా యూనివర్సిటీలోని ఇప్లూ వద్ద ఉంది. చుట్టూ ఉండే భవనం మధ్యలో బావి ఆకారంలో ఉండడంతో దీనిని ‘మహాలక బావి’ అనేవారు.
ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణ సమయంలోనే దీనిని నిజాం కట్టించినట్లు చెబుతారు.

మహాలక చందమెట్ల బావి |
మహ్ లకా భాయి పద్యాలున్న పేజీ |
Ratika Sant Keswani enacts the role of Mah Laqa Bai Chanda Show at Taramati Baradari |
‘చందా’ అనే కలం పేరుతో దక్కనీ ఉర్దూలో ఆమె అనేక పద్యాలు, గజల్స్ రాశారు. ఆమె స్వయంగా గజల్స్ రాసిపాడేది. చందా అన్న తఖల్లూస్‌తో (కలంపేరు) ఆనాటి దక్కన్‌లోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ‘తవాయఫ్’ (కళావంతురాలు) ఆమె. ఇట్లా, తన ఆటపాటలతో నిజాం నవాబులను అలరించిన మహాలఖా బాయి చివరికి 124లో తుదిశ్వాస విడిచింది. మహాలఖా బాయి మరణం తర్వాత ఆమె రచనలు ‘గుల్జారీ-ఇ-మహాలఖా’ పేరుతో అచ్చయినవి. ఆమె సమాధి నగరంలోని మౌలాలీలో ఉంది.
ఆమె గజల్స్ 39 వ దివాన్ సంకలనంలోని ఒక గజల్ ‘‘ మొగ్గవికసించాలనే ఆశ’’ "Hoping to blossom (one day) into a flower" కు ఆంగ్లాను వాదం
Hoping to blossom (one day) into a flower,Every bud sits, holding its soul in its fist.
Between the fear of the fowler and (approaching) autumn,
The bulbul’s life hangs by a thread.
Thy sly glance is more murderous than arrow or sword;
It has shed the blood of many lover.
How can I liken a candle to thy (glowing) cheek?
The candle is blind with the fat in its eyes.
How can Chanda be dry lipped. O Saqi of the heavenly wine!
She has drained the cup of thy love.
ఆమె సమాధిమందిరం టేకు తలుపుపై చెక్కన పద్యం అనువాదం ఇలావుంటుంది.
an ardent inamorata of Hydar and suppliant of Panjtan.
When the tidings of the advent of death arrived from God,
she accepted it with her heart, and heaven became her home.
The voice of the invisible speaker called for her chronogram,
Alas! Mah Laqa of the Deccan departed for heaven 1240 A.H.
- హైదరాబాద్ చరిత్ర ఫేస్ బుక్ గ్రూప్
- http://fountainink.in/?p=3554&all=1
- http://en.wikipedia.org/wiki/Mah_Laqa_Bai
- http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/glimpse-into-mah-laqas-life/article4631904.ece (Picture)
- http://kamalp.blogspot.in/2010/12/mahlaqa-bai-chanda.html
- Hayat-i-Mahlaqa – Gohar , Ghulam Samdani Khan . Hyderabad 1906 .
- Gulzar-e-Mahlaqa - by Gohar , Ghulam Samdani Khan
- Divan-i-Mahlaqa Bai Chanda – Shafqat Rizvi .
- Mahlaqa Bai Chanda – An article by Tamkeen Kazmi
1824 లో చనియినది కదా ou university కి భూములను ఏలా ిచినది
రిప్లయితొలగించండి