అపహాస్యం పాలవుతున్న హాస్యం

నవరసాలలో ఒకరకంగా ప్రధానమైనదీ ఆరోగ్యానికి కారణమయ్యేదీ కూడా హాస్యమే.
మిగిలిన ఏ పరిశోదనాంశాలకూ తగ్గనంత విశ్లేషణలూ, సిద్దాంతీకరణలూ, ప్రతిపాదనలూ హాస్యం విషయంలోనూ జరిగాయి. కానీ అవేమీ పట్టించుకోని ఇవ్వాల్టి రేటింగుల వేట ప్రోగ్రాములు (పైగా వాటిలో పెద్దస్థాయి వ్యక్తులూ, మహిళా నేతలు సైతం కూర్చునే వుంటారు) తోచి ఒక్క బాణీలోనే పోతున్నాయి.

హాస్యాన్ని ఉత్ప్రిరితం చేసేందుకు :: ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, అసంబద్ధత (ఫార్స్), , సందర్భం మార్పు (reframing),సమయస్ఫూర్తి, శ్లేష, లాంటి వాటిని రాజకీయకోణంలోనూ సామాజిక స్థితిగతులలోనూ, పారడికల్ సిట్యుయేషన్స్ గా మలచటం ద్వారా ఇలా ఎన్నో పద్దతుల హాస్యాన్ని పుట్టించ వచ్చనేది ఇప్పటికే సిద్దాంతీకరించి వున్నా ఎవ్వడూ పట్టించుకునేలా లేరు నిజానికి ఇదో విషాద హాస్యం

హాస్యానికి అసంబద్ధత (Incongruity Theory) కారణం అని కాంట్ అంటే, ఒక నిశ్చితమైన ఫలితం లేని పరిస్థితి హాస్యం అవుతుందని హెన్రీ బెర్గ్‌సన్ మరింత విపులీకరించాడు. మోరియల్ అనే విశ్లేషకుడు "ఏకకాలపు కలగాపులగం" (simultaneous juxtapositions) అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చాడు. లాట్టా (Latta) అనే శాస్త్రజ్ఞుడు మాత్రం ఒక పరిస్థితిలో ఒక పజిల్‌కు సమాధానం లభించినపుడు కలిగే దృక్పథపు మార్పు హాస్యానికి ప్రధానమైన అంశం అన్నాడు. ఇంకా ఇలాంటి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి.

ఎలాగూ నవ్వించే విధి నిర్వహించటం వల్ల నాలుగు ముద్దలు నోట్లోకి వెడుతున్నాయి కాబట్టి, కనీసం దానికి గౌరవం ఇచ్చేందుకైనా కొంచెం అధ్యయనం చేయటం పాపమా? నేరమా ?


ఈ మధ్య కామెడీ అంటే మగవాళ్ళకి చీరకట్టెసి,గొంతు కీచు పెట్టి తన్నటమో తన్నించుకోవటమో చేస్తే చాలనే ఫార్ములాని వెగటు మితిమీరి విసుగొచ్చిన దాకా వాడుతున్నారు. పైగా అదే ఆడియో రిలీజుల్లో కూడా. చీర బ్యాచ్ ల పేరుతో కొందరు ట్రేడ్ మార్క్ చేసేసుకున్నారు.

అసలే సాంప్రదాయ వస్త్రాలపై చిన్నచూపు పెరుగుతుందేమో అనుకునే రోజుల్లో,
ఇప్పుడు మరింతగా దానిపై వ్యంగపు మరకలు.
గట్టిగా అవమానపరచే తిట్టు ఏర్పడాలంటే ‘ఆమె’ వుండాల్సిందే (స్వంతానికి ఎలాగూ సిగ్గులేదు కాబట్టి), ఇక పిచ్చి హాస్యానికి కూడా ‘ఆమే’ సమిధనా?
నడపండ్రా నాయినా నడపండి జనాలకి ‘చీరా’కొచ్చేదాకా నడపండి.
మీరు మారర్రోయ్.. మీ రేటింగ్ ఫార్ములాలని తగ.....

ఫేస్ బుక్ వాల్ పై జరుగుతున్న చర్చలో కుదిరితే మీరు పాలుపంచుకోండి.
ఏమో ఈ నిరసన ఒక్క కార్యక్రమంలో మార్పుకు కారణమయినా మంచిదే కదా?



కామెంట్‌లు