పగుళ్ళు

నోటిమాటలే మనసుకి అద్దంకాదు
చేతలే నిజాన్ని చెపుతాయి
సంవత్సరానికోసారయినా  మనసు పేజీ చదవనపుడు
నీ పైపై మాటలన్నీ బూటకమేగా?
సారీలూ, థాంక్యులూ, లవ్వూలూ కేవలం పదాలైనవేళ
లోపటి పరదాలనుంచి చీకటి కనిపించదంటావు.
మనిషంటే మాటలే కాదు,
పనిలా తను జనంలోకి ప్రవహిస్తూనేవుంటాడు.

అశ్వధ్దమ హత:
విని జనం మూర్చిల్లటం లేదు.
నీ కుత్తుకలో కుంజరం చచ్చిపోకముందే
శిఖండి చాటున మిత్రరూప హంతకుడిని పోల్చుకోవచ్చు

వేల వెన్న మాటలు పూసిన ఓటు కత్తితో వచ్చే నేతపదునుకు
తుప్పొదిలించే రోజు ఒక లోచూపుతోనే సాధ్యం

పులినని డబ్బాలుకోట్టే మేకకంటే
మేకలా ముసుగేసుకొచ్చే పులే ప్రమాదం.
గాడిదలు గుంభనంగా వుంటే ఏమీ కాదు
డ్రాక్యులాలు చొచ్చుకొస్తేనే ప్రాణాంతకం

నిజం నిప్పులాంటిదంటే అర్ధం అయ్యేది కాదు
ముసుగేసుకొచ్చిన పరదాలే ఆహారంగా పైకొస్తుందని
నిజం నిప్పులాంటిదంటే పోల్చుకోలేకపోయాను
తనెక్కడున్నా సాక్ష్యుపు పొగతో సూచిస్తుందని,



► 05-02-2014

కామెంట్‌లు

  1. మనుగడ నుండి మనిషిని బైటl లాగే సవాళ్ళు ఇవి,
    అద్భుతమైన రచన బాగుంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మేరాజ్ మేడమ్ నమస్తే బావున్నారా?
      కవిత నచ్చినందుకు ధన్యవాదాలు

      తొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి