జీవితమంటే ?

తినడం, త్రాగటం
వాటిని సంపాదించడం ద్యారా  బ్రతకటమనే ప్రక్రియకు
పక్కనే వుంటుంది.
బ్రతికినంత దూరం జీవితం వుండదు.
జీవించినంత దూరం మాత్రమే దాని జాడలుంటాయి.
జీవిస్తున్న ప్రతివాళ్లు బ్రతికున్నంత మాత్రాన
బ్రతికున్న ప్రతివాళ్లూ జీవించే వున్నట్లు కాదు.

జీవితం అర్ధం కావడం అంటే ఒక ప్రశ్నకు జవాబు తెలియటం కాదు.
ఒక సినిమా రివ్యూ చూడటం అంతకన్నాకాదు.
అది భాషతో తెలిసిన దానికన్నా
మనసుకి తెలియాల్సింది ఎక్కువ

కొంచెం కష్టమయినంత మాత్రానే వదిలేయలేం
తేలికగా వుండేదనే తొడుక్కోలేం
ఒక్కోసారి జీవితం
అర్ధం కానంత కష్టం
ఒక్కో సారి జీవితం
మోయ లేనంత భారం

కానీ అదే
ఒడుపు పట్టుకుంటే
మననే పైకెత్తేంత ఉన్నతం
మనసే నిలబెట్టేంత ఉత్తమం

కామెంట్‌లు