ఉక్కుగోళ్ళ లోహపు పక్షి ఒకటి
ముక్కుతో పొడుస్తూ
తెగతిడుతోంది.
సజీవ శిలాజంలా
మిగిలున్న ఓ పిచ్చిపిట్టని
వెధవపక్షీ
ఎప్పుడూ ఎందుకిలా
మొత్తగా వుంటావంటూ
లేబుల్ సీసాలోని నీళ్ళు
ఎగిరెగిరి మిడిసిపడుతూ
మూగనదిని ఆడిపోసుకుంటున్నాయి.
పిచ్చిమొహమా
కొంచెం నాగరికత నేర్వరాదేఅంటూ
వెనకగదిలోని
అమ్మకాలం నాటి నిశ్చలత్వంలాగానే
అవి మౌనాన్నే సమాధానమిస్తున్నాయి.
ముక్కుతో పొడుస్తూ
తెగతిడుతోంది.
సజీవ శిలాజంలా
మిగిలున్న ఓ పిచ్చిపిట్టని
వెధవపక్షీ
ఎప్పుడూ ఎందుకిలా
మొత్తగా వుంటావంటూ
లేబుల్ సీసాలోని నీళ్ళు
ఎగిరెగిరి మిడిసిపడుతూ
మూగనదిని ఆడిపోసుకుంటున్నాయి.
పిచ్చిమొహమా
కొంచెం నాగరికత నేర్వరాదేఅంటూ
వెనకగదిలోని
అమ్మకాలం నాటి నిశ్చలత్వంలాగానే
అవి మౌనాన్నే సమాధానమిస్తున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి