1942 లో దీనబంధు సినిమా కోసం శ్రీ శంకరంబాడి సుందరాచారి గారు తేటగీతిలో రచించిన మా తెలుగు తల్లికీ గీతంలో తెలుగునాట ప్రముఖమైన నదులను, సంస్కృతి, సాహిత్యాలను, చరిత్రలో ప్రసిద్ధ వ్యక్తులను రచయిత సంస్మరించారు. ఈ పాటలో ఉన్న సాహిత్యపు విలువలు, భాషావిలువలు, దేశభక్తి విలు వను గ్రహించిన నిర్మాత యుగళ గీతంగా చిత్రీకరించేందుకు అంగీకరించలేదు. తరు వాత రోజుల్లో ఆ చిత్రంలో నటిస్తున్న టంగుటూరి సూర్య కుమారితో ప్రైవేటు రికార్డుగా హెచ్.యం.వి. సంస్థ ద్వారా విడుదల చేసారు. ఆ పాటే ఆంధ్ర ప్రదేశ్ యొక్క రాష్ట్ర గీతమ యింది. అదే ‘మా తెలుగు తల్లికి మల్లెపూ దండ’ గీతం. ఈ గీత రచయిత శంకరం బాడి సుందరా చారి. ‘దీనబంధు’ సినిమా కు శంకరంబాడి మాటలు-పాటలు రచ యితగా ఉన్నారు. ఆనాటి యుగళగీతం ఈ నాటి రాష్ట్ర గీతం యొక్క గీత చరిత్ర.
శ్రీ శంకరంబాడి సుందరాచారి |
ఆంద్రప్రదేశ్ లో ప్రముఖంగా ప్రవహిస్తున్న
గోదావరి, కృష్ణా నదులు
అమరావతి లోని శిల్పసంపద
త్యాగరాజు గానం, తిక్కన్న రచనలూ
కాకతీయ రాణి రుద్రమ దేవి భుజబలశక్తి
మహా మాత్యుడు తిమ్మరుసు మంత్రి గారి తెలివి తేటలూ,
కృష్ణ దేవరాయల వారి కీర్తి ప్రతిష్టలూ పేర్కొంటూ అందులోనే
మల్లమ్మ పతి భక్తి అన్నారు ? ఈ మల్లమ్మ ఎవరు ? ఆ పతి భక్తి కథ ఏమిటి ?
మా తెలుగు తల్లికి మల్లెపూ దండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపు లో బంగారు కనుచూపు లో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి !
గల గలా గోదారి కదలిపోతుంటేను
బిరా బిరా కృష్ణమ్మా పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలే దొరలుతాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచివుండే దాక
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి క్రిష్ణరాయుని కీర్తి
మా చెవులు రివ్వుమని మారుమ్రోగే దాకా
నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
.......................................
బొబ్బిలి పరాసు ప్రభువుల (ఫ్రెంచి) పాలనలో ఒక సంస్థానంగా వుంటూ పొరుగు రాజ్యం విజయనగరం తో శతృత్వం ఉండేది
హైదరాబాదు నిజాం సలాబత్ జంగ్ బుస్సీని ఉద్యోగం నుండి తొలగించిన తర్వాత విజయనగరం రాజులు తప్ప ఉత్తర కోస్తా జమిందారులు ఎవరు ఫ్రెంచి వారికి శిస్తులు చెల్లించలేదు. అందుచేత బుస్సీ సర్కారు ఈ శిస్తుల వసూలు కోసం జిల్లాల పర్యటనకు వచ్చాడు.
ఈ అవకాశాన్ని వినియోగించుకొని విజయనగరం జమిందారు బొబ్బిలిపై ఎప్పటినుంచో వున్న కక్ష సాధించాలనుకుని విజయరామరాజు కూడా వంత పలకడం ద్వారా ఫ్రెంచి వారచే బొబ్బిలిని ముట్టడింపజేసాడు. వారికి విజయనగరం, పెద్దాపురం సైన్యాలు కూడా తోడ్పడినాయి.
బొబ్బిలి స్థూపం |
క్రీ.శ. 1757 జనవరి 24 తేదీన జరిగిన బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి జమిందారైన రంగారావు/ రంగరాయుడు చంపబడ్డాడు. బొబ్బిలి కోట పతనమైనది. మల్లమ్మ మాత్రమే కాదు బొబ్బిలి పురుషులు వీరమరణం చెందగా, అనేక మంది స్త్రీలు ఆత్మ త్యాగం చేసారు.
తాండ్ర పాపారాయుడు |
బొబ్బిలి రాజు బావమరిది యైన తాండ్ర పాపారాయుడు దీనికి ప్రతీకారంగా జనవరి 24, 1757లో ప్రతి దాడి చేసాడు. . యుద్ధం ముగిసాక, వీజయరామరాజు ను, తాండ్ర పాపారాయుడు హతమార్చి తనవారిపై జరిగిన ఊచకోతకు ప్రతీకారం తీర్చుకున్నాడు.
బొబ్బిలి యుద్ధం పూర్తి సినిమా
ఇది మరొక సినిమా మల్లమ్మ కథ పేరుతో
.......................
షోడశగౌరీ వ్రతంలో చెప్పే ఒక మల్లమాంబ కథ ఇలా వుంటుంది. ( బహుశా శంకరంబాడిగారి ఉద్దేశ్యంలోని మల్లమ్మ ఈమె కాకపోవచ్చు)కలియుగంలో మానవులు తరించడానికి అనేకానేక వ్రతకథలు తెలియజేస్తున్న సూతులవారు ఒకసారి శైనకాది మునీంద్రులతో ఇలా చెప్పసాగాడు.
పూర్వం ధర్మశాస్త్రాలు చక్కగా తెలిసిన ధర్మవర్తి అనే రాజుండెను. అతనికి చల్లమాంబ, మల్లమాంబ అనే అందమైన కుమ్తాలుండిరి. వారు పూర్ణచంద్రుని కళలతో సర్వాంగసుందరంగా యుక్తవయస్కులైనారు. వారికి రూపగుణ, శౌర్యసంపన్నులైన మగధరాజుతో మల్లమాంబకు, పాండ్యరాజుతో చల్లమాంబకు వివాహమైంది. మల్లమాంబ తనకున్న సంపదసౌందర్యంతో మిక్కిలి గర్వంగా ఉండేది. ఎప్పుడూ వ్రత దూషణలు చేస్తుండేది. ఫలితంగా పశుసంపదను క్రూరమృగాలు నశింపజేశాయి. ధనధాన్యాలు అగ్నికి ఆహుతైనాయి. రాజ్యాన్ని శత్రువులు వశం చేసుకున్నారు. భర్తను శత్రువులు బంధించారు. బంధువులంతా శత్రువులైనారు. మల్లబాంబ అవమానంతో అన్నవస్త్రాలు లేక అడవిలో తిరుగసాగింది దుఃఖిస్తూ తన దుస్థితికి బాధపడుతున్న మల్లమాంబకు ఆ అరణ్యంలో ఎండకుకాలుతున్న పెద్ద పాషాణం,
చెట్టునిండా పండ్లున్నా, ఒక్క పక్షి కూడా వాలని మామిడిచెట్టు,
పుష్పవిహీనమైన మాధవీలత,
పొదుగునిండా పాలుండి కారిపోతున్నా దూడ తాగని ఒక బర్రె (గేదె) కనిపించాయి.
ఇంకా ముందుకు నడవగా
ఓండ్ర పెడుతూ తిరుగుతున్న గాడిద,
పచ్చిగడ్డితో నిండిన ఊసరక్షేవూతంలో తిరుగుతున్న గడ్డి తినలేని ఒక ఎద్దు కనిపించాయి.
అన్నపానీయాలు లేక తిరుగుతున్న మల్లమాంబ ఆకలి శోషతో ‘హే జగదంబే! కరుణామయి నన్ను క్షమించు’ అని మొక్కుతూ మూర్ఛిల్లింది. ఆ రోజు భాద్రపద శుక్ల తదియ. ఉపవాసంతో ‘హే గౌరీ’! అంటూ పడి ఉన్న మల్లమాంబపై జగదాంబకు దయ కలిగింది. దేవి ఆమె ముందు ప్రత్యొక్షమైంది. మల్లమాంబ కనులు తెరిచి, చేతులు జోడించి అమ్మా! కరుణాసాగరి నన్ను క్షమించు. నా అపరాధాన్ని మన్నించుమని కాళ్లమీద పడి ఏడ్వసాగింది. గౌరీ సంతుష్టిపొంది, నీవు ధనగర్వంతో షోడశగౌరీ వ్రతం చేయుట మానేశావు. మరలా ఆ వ్రతం చేసుకుంటే పుత్ర పౌత్రాదులు, సుఖసంతోషాలతో ఉంటావని తెలిపింది. పితృగృహంలో తానున్నప్పుడు నోచిన విధంగా అడవిపూలు, పత్రితో అమ్మవారిని శ్రద్ధగా పూజించింది. దొరికిన పండ్లను నైవేద్యం పెట్టి నమస్కరించింది. ‘హే జననీ! మార్గమధ్యంలో నేననేక చిత్రవిచివూతాలన్నీ అడవిలో చూశాను. వాటి గురించి తెలుసుకోవాలి’ అన్నది. అందుకు గౌరీదేవి మల్లమాంబతో
‘‘భర్తరాకముందే భుజించి, పెద్దలను గౌరవించని స్త్రీ అలా పాషాణంగా మారింది.
ధనధాన్యాపూన్ని ఉన్నా దానధర్మాలు చేయనివాడు మామిడిచెట్టుగా మారాడు.
ఎలాంటి వరుడిని తీసుకొచ్చినా వంకలుపెట్టి పెళ్లికంగీకరించని కన్య పుష్పించని మాధవీలతగా మారింది.
తానే విద్యావంతుడిని, కీర్తిమంతుడుని అని గర్వంతో తన దగ్గరకు విద్యార్జనకు వచ్చినవారికి విద్య చెప్పక పంపిన పండితుడు ఓండ్రపెడుతున్న గాడిదగా తిరుగుతున్నాడు.
తన పిల్లకలు పాలివ్వని తల్లి పొదుగునిండా పాలున్నా, దూడకివ్వలేని స్థితిలో బర్రెగా తిరుగుతున్నది. వ్యవసాయానికి పనికిరాని బంజరుభూమిని దానం చేసిన రాజు ఊసరక్షేవూతంలో ఎద్దుగా తిరుగుతున్నాడు.
ఎవరు చేసిన కర్మ వారనుభవిస్తున్నారని దేవి తెలియజేసి, దీవెనలందించి అదృశ్యమైంది. అంతలో మల్లమాంబను అడవిలో వెతుకుతూ చతురంగ బలాలతో ఆమె భర్త మగధ రాజువచ్చాడు. క్షేమంగా నగరం చేరిన ఆమెను బంధుమిత్రులతో సంతోషంగా జీవించింది.
అంటూ వ్రతమహత్మ్య విశేషాల కోసం ఈ కథను చెపుతుంటారు.
..................
దాక్షాయని మల్లమ్మ కథ పేరుతో శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహా రావు గారు రాసిన పుస్తకం
ఆధార సూచికలు
1) 23 జనవరి, 1757 న బొబ్బిలి కోటలో ఏం జరిగింది?
2) శ్రీపాదవారి మల్లమ్మ–మీనాక్షి
3) A history of the military transactions of the British Nation in ..., Volume 1
By Robert Orme
Good post.Thanks for sharing.
రిప్లయితొలగించండిShe is certainly bobbili mallamma,the another mallamma in second story is not about fidelity but about Gouri vratham and according to story magadha and Pandya are not Telugu kingdoms.bobbli mallamma set fire herself when she heard about husband's death related to pathibhakthi and bobbili is Telugu kingdom which has historical proofes.
రిప్లయితొలగించండిఇందులో అసలు విషయాన్ని సరిగ్గా వివరించలేదు సార్. బొబ్బిలి రంగారావుగారు చంపబడ్డారు అని చెప్పి, వెంటనే మల్లమ్మ ఆత్మత్యాగం గురించి చెప్పారు. ఈమె ఫలానా వారికి భార్య అని స్పష్టంగా వ్రాయలేదు సార్.... దయచేసి క్లారిటీ ఇవ్వండి సార్
రిప్లయితొలగించండిFake story by some kamma lanjakodaku..... Actually మల్లమ్మ of in this poem is hemareddy mallamma..శ్రీశైలం
రిప్లయితొలగించండిYes
రిప్లయితొలగించండి