రంగుకాగితాల విషపునవ్వు
బూడిదకుప్పల వేదనలమీద
జ్వాలలై చేస్తున్న కరాళనృత్యం.
నలుగుతున్న నుసిని
బీరువాల్నిండా దాస్తున్న పిచ్చోళ్ళు.
మనిషిలాగా మనసులాగా
పైపులకీ అన్నీ లీకులే..
ఆలోచనల్లా, ఆచరణల్లా
వున్న గొట్టంనిండా తుప్పుమరకలే
భూమిగుండెలపై
తొక్కుకుంటూ చేస్తున్నవత్తిడి.
ఉస్సురంటూ ఉసుర్లతీస్తోందొక్కోసారి.
కొండచివర కాచుకుని
డొర్లిపడేందుకు సిద్దంగా వున్న బండలెన్నో
ఇక్కడ మనమేమో లెక్కేసుకుంటూ కూర్చుంటాం.
ఉడుకుతున్న మాంసం వాసన
కనీసం నెత్తుటిని వేడెక్కించదా?
పిట్టనుసైతం ఎగరీయని
మృత్యుకెరటపు వీచిక
ఝల్లుమని వణికీంచడం లేదా?
ఓ చుక్క వెచ్చగా
గుండెల్లోకి జారిపడటంలేదా?
అయితే మన మసలు మనుషులం కాదేమో?
► 28-06-2014
కవిసంగమంలో
బూడిదకుప్పల వేదనలమీద
జ్వాలలై చేస్తున్న కరాళనృత్యం.
నలుగుతున్న నుసిని
బీరువాల్నిండా దాస్తున్న పిచ్చోళ్ళు.
మనిషిలాగా మనసులాగా
పైపులకీ అన్నీ లీకులే..
ఆలోచనల్లా, ఆచరణల్లా
వున్న గొట్టంనిండా తుప్పుమరకలే
భూమిగుండెలపై
తొక్కుకుంటూ చేస్తున్నవత్తిడి.
ఉస్సురంటూ ఉసుర్లతీస్తోందొక్కోసారి.
కొండచివర కాచుకుని
డొర్లిపడేందుకు సిద్దంగా వున్న బండలెన్నో
ఇక్కడ మనమేమో లెక్కేసుకుంటూ కూర్చుంటాం.
ఉడుకుతున్న మాంసం వాసన
కనీసం నెత్తుటిని వేడెక్కించదా?
పిట్టనుసైతం ఎగరీయని
మృత్యుకెరటపు వీచిక
ఝల్లుమని వణికీంచడం లేదా?
ఓ చుక్క వెచ్చగా
గుండెల్లోకి జారిపడటంలేదా?
అయితే మన మసలు మనుషులం కాదేమో?
► 28-06-2014
కవిసంగమంలో
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి