ఒక పెద్దవ్యాసాన్ని మించిన చర్చ, మాట్లాడకుండా వుండేందుకు మనసొప్పని స్థితిలోకి ఆకర్షించిన సిరా గారికి కోపం కలసిన ధన్యవాదాలు చెపుతూ..
అనుకోకుండా ఇది చదువుతూ వుంటే గతంలో కవిసంగమం సమావేశానికి వచ్చినపుడు ‘సుబోధ్ సర్కార్’ తన పత్రికా ఇంటర్వూలో ఒక స్రశ్నకు సమాధానం గా అన్న మాటలు గుర్తొచ్చాయి.
.
‘‘ కవిత్వాన్ని నిర్వచించేంత మూర్ఖుడిని కాదు ’’ అని,
కవిత్వాన్ని నిర్వచించాలనుకోవడం మూర్ఖత్వం, భాషకందని అనుభూతిఅంటే ఏమిటో భాషని వాడుకుంటూ చెప్పాలనుకునేంత బుద్దితక్కువ పనే అని ఒప్పుకుంటూనే.....
ఒక్కోసారి అదేమిటో తెలియాలంటే అవికానివి కనీసం కత్తిరించుకుంటూ నైనా పోవాలనేది ఒక సూత్రాన్ని మాత్రం మర్చిపోకుండా ఇక్కడ వాడుకుంటాను. (నేతినేతి వాదం = న ఇతి న ఇతి = ఇది కాదు ఇది కాదు )
మనం సాహిత్వంలో కవిత్వమనో, వ్యాసమనో, కథ లేదా మరో పేరుతో పిలిచేవన్నీ బావప్రాసార మాధ్యమాలే, అంటే భాష వ్యక్తికరణ, గ్రహణ ద్వారా ‘ ప్రసరణ’ అనే పని ఏదైతే చేస్తోందో ఇవ్వన్నీ కూడా భాషలోని అంతర్భాగాలుగా అదే పనిచేస్తున్నాయి. కానీ వాటికున్న ప్రత్యేకతల రీత్యా వాటిని వేరు వేరు పేర్లతో పిలుస్తున్నాము.
........................ అదంటే ఏమిటో తెలుసుకోవడానికున్న పద్దతి ఏది?
వాటిది మాత్రమే అయిన ఆ ప్రత్యేక ధర్మం లేదా గుణం ఏదో (అసాధారణ ధర్మం) ఖచ్చితంగా పట్టుకోగలిగితే అదేమిటో తెలుసుకున్నట్లు అవుతుంది.
...................... మరి కవిత్వం అంటే ఏమిటో చూద్దాం అయితే...............
(పైన అనుకున్నట్లే ఇది కాదు ఇది కాదు అనేది కూడా చూసుకుంటూ)
► వరుసలు విరగ్గొడితే కవిత్వం అవుతుందా?
= కాదు
► లయాత్మకమైన ప్రతిదీ కవిత్వమేనా ?
= కవిత్వంలో లయ వుంటుంది కానీ లయ వున్న ప్రతిదీ కవిత్వం కానక్కరలేదు.
► శబ్దాలంకారాలూ, అర్ధాలంకారాలూ వుంటే కవిత్వమేనా?
= అసలు అలంకారాలు లేకున్నా కవిత్వం వుంటుంది. అలంకారాలు కవిత్వానికి అదనపు సొగసు మాత్రమే
► కర్త కర్మ క్రియ (Subject, object, Verb) లను మామూలుకంటే భిన్నమైన స్థానాల్లో రాసేస్తే కవిత్వమేనా?
= ఇది మరీ కవిత్వ గుణాన్ని అవమానించడమే, ఆ పనే అయితే ఇప్పుడు గూగుల్ ట్రాన్స్ లేషన్ కూడా ఇలా గజిబిజి చేసేయగలదు.
►ఛందస్సు, అక్షర నియమాలూ, లైన్లు ఎన్నివుండాలి లాంటివి పాటిస్తే కవిత్వం అవుతుందా?
=మహా అయితే భాషమీద పట్టువస్తుందేమో,కానీ చందస్సులో రాసినంతనే కవిత్వం కానట్లే అక్షరనియమాలేవీ కవిత్వాన్ని పుట్టించలేవు. బావాన్ని బయటపెట్టడంలో కొంత సంయమనాన్ని నేర్పిస్తాయి. వినడంలో కొంత అందాన్ని చూపిస్తాయి అంతమాత్రమే.
► చెప్పాల్సింది సాంతం చెప్పకుండా కొంత మిగిల్చి ఊహించుకో అని వదిలేస్తే (విప్పి చెపితే వచనం కప్పి చెపితే కవిత్వం) అప్పుడు దాన్ని కవిత్వం అనొచ్చా
= సగం సగం చెప్పడమే కవిత్వం కాదు. ఒక్కోసారి కవిత్వానికి అనివార్యంగా కొంత పాఠకుడి ఊహాప్రపంచానికి పనిపెట్టే మిగులు స్థలం వుంటుంది.అంత మాత్రాన అసంపూర్ణ భావమే కవిత్వమనీ అవి మాత్రమే కవిత్వం అనబడతాయనీ చెప్పలేం.
......................................................
మరేదో చెప్పకుండా ఇలా కాదన్న వాటితో ఎంతసేపు????
నా మట్టుకు నాకేమనిపిస్తుందంటే భాష వచనంగా ఒక బావాన్ని అచ్చంగా అందించే విషయంలో ఎక్కడ విఫలం అవుతుందో అక్కడ అనుభూతిని పునర్నిర్మించేందుకు కవిత్వమే సాదనంగా కావాలి.
అంటే ‘ఎ’ అనే వాడి మదిలోని లేదా జీవితంలోని ఒక భావాన్ని మరొకరికి చేరవేసే క్రమంలో భాష పనిచేయనప్పుడు అంటే పదాల, వాక్యాల యధాతధ అర్ధాల సముచ్చయం ఆ దృశ్యాన్ని బొమ్మ కట్టించలేనపుడు, చదువరి మనసులోని ఇమేజరీల సహాయంతో ఈ దృశ్యాన్ని చేర్చగలగాలి. దీన్ని చేర్చగలిగే పని కవిత్వం చేయాలి.
అంటే వచనం కంటే మరికొంచెం భిన్నమైన మరొరకంగా పెద్దపనినే కవిత్వం చేయగలగటం దాని ఆత్మ అయితే, ఇక అది అందంగా వుండేదుకు వేసే తొడుగులు లాంటివే అలంకారాలూ, శిల్పం, నిర్మాణం, శైలి లాంటివి.
...................
అంటే నిజానికి మనం అనుకుంటున్న ఈ ప్రక్రియలన్నీ భాషలే,
వాటిని ఎన్నకోవలసింది మనం కాకుండా విషయమూ, సందర్భమూ ఆ ప్రక్రియను ఎన్నుకుంటాయనే మాటే నిజమేమో అనిపిస్తుంటుంది. నాకు మనం చేయాల్సిందల్లా సమర్ధవంతంగా చెప్దామనుకుంటున్న / చెప్పాల్సిన భావాన్ని ఎలా చేరవేయాలా అని నిజాయితీగా ఆలోచించడమే.
ఇంత సంఖ్యలో రాయాల్సిందే, ఇంత వ్యవధిలో రాయాల్సిందే అని పెట్టుకునేవి కాదేమో.
.......................
మీ ప్రశ్నకు సూటిగా నయితే నావరకు నాకు విషయం ముందు తలుపు తడుతుంది. దాన్ని మనసులోకి రానిచ్చి అచ్చంగా ఆకళింపు అవుతుందేమో పరిశీలించుకుని శక్తిమేరకు అరిగించుకోవడం.
ఆ తర్వాత ఎవరితో మాట్లాడుదామనుకుంటున్నాను. ఎంత మేరకు చెపుతున్నాను. అని చూస్తూ రాసుకెళ్తాను. రాసిన ఇన్నాళ్ళకు కూడా అవి కవితలో కాదో నేనయితే నిర్ధారించుకోలేను. కానీ నేననుకున్నదే పాఠకులకు తెలిసింది అని తెలియడం మాత్రం సంతోషాన్ని ఇస్తుంది.
ఈ చర్చ ఎందుకు పెట్టారు. బహుశా చర్చ చర్చకోసమో కాలక్షేపం కోసమో కాదు. నిజాయితీగా మీలో తొలుస్తున్న ఒక సంవాదపు సవ్వడి మిగిలిన మనసుల్లో ఎలా వుందో బేరీజు వేసుకునేందుకే అనిపించడం వల్ల ఒక్కరికి చేరినా మంచిదే అన్న వుద్దేశ్యంతోనే నా లోపలి మాటలు ఇలా పంచుకుంటున్నాను.
సరిచూడండి మీ లోపలి అనుభవాలతో పోలివుండకపోతే, కదిపి చూడండి పొరబడి వుంటే మిత్రులు సరిచేసేందుకు ప్రయత్నించండి.
ధన్యవాదాలతో

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి