తడైనా నడుస్తూ వెళితే మది కడిగేసుకున్నట్లే
కానీ
నీళ్ళూరని కళ్ళవేడి లోపటే దహిస్తుంది.
కానీ
నీళ్ళూరని కళ్ళవేడి లోపటే దహిస్తుంది.
నీళ్ళూరని బండబావి పౌరుష చిహ్నమేం కాదు
వర్షంలా ప్రేమను మొలకెత్తించే
చినుకులు లేని తనం ఏమిస్తుంది?
సెగలు కక్కే ఎడారులని తప్ప.
వర్షంలా ప్రేమను మొలకెత్తించే
చినుకులు లేని తనం ఏమిస్తుంది?
సెగలు కక్కే ఎడారులని తప్ప.
బయటినుంచే నిప్పంటుకుంటుంది చాలాసార్లు...
లోపలే డ్రాగన్ జ్వాలలూదు తుంది మరికొన్ని సార్లు...
బీటలవుతున్న నేలల్లో తడి కందెనే దొరకక పోవటం
ఎంత నిర్భాగ్యత !
లోపలే డ్రాగన్ జ్వాలలూదు తుంది మరికొన్ని సార్లు...
బీటలవుతున్న నేలల్లో తడి కందెనే దొరకక పోవటం
ఎంత నిర్భాగ్యత !
కత్తిమెరుపులోది రక్తం చిందిచగల పదును మాత్రమే కానీ
ఇంకుతూ చొచ్చుకుపోయి ఇంకోతనంలా కలిసిపోయే
తడి తనం ఎందుకుంటుంది?
ఇంకుతూ చొచ్చుకుపోయి ఇంకోతనంలా కలిసిపోయే
తడి తనం ఎందుకుంటుంది?
రా నేస్తం.........
ఈ నిర్ధయాపూరిత ప్రయాణంలో
కన్నీటి అడుగులని వేసేందుకు ధైర్యం తెచ్చుకుందాం.
ఆ సారంలో నైనా మనిషితనాన్ని పంటలా పెంచుకుందాం.
ఈ నిర్ధయాపూరిత ప్రయాణంలో
కన్నీటి అడుగులని వేసేందుకు ధైర్యం తెచ్చుకుందాం.
ఆ సారంలో నైనా మనిషితనాన్ని పంటలా పెంచుకుందాం.
► 15-07-2014
https://www.facebook.com/groups/kavisangamam/permalink/789829621069792/
Post by Katta Srinivas.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి