కోటిలింగాలో పురావస్తుశాఖ తవ్వకాలు పూర్తయ్యేదెన్నడో ?

ఒక ప్రాంత చరిత్రకు సమాధి కడితేనే తమ ప్రాంత చరిత్ర యావత్ జాతి చరిత్రగా మారుతుందనే పాలకుల ధోరణికి సజీవ సాక్ష్యం కోటిలింగాలలో చరిత్రను వెలికితీయడంలో నిర్లక్ష్యం. అక్కడి తవ్వకాల తీరుతెన్నులను వివరిస్తున్నారు సంకేపల్లి నాగేంద్రశర్మ

తెలంగాణ జిల్లాలలోని మూల చారిత్రిక, సాంస్కృతిక వారసత్వా నికి పెద్దన్నగా నిలిచిన కరీంనగర్ జిల్లాలో ఎన్నెన్నో చారిత్రక సంపద, పర్యాటక, ధార్మిక విశేషాలు, విశేషణాలు కానవస్తాయి. సుప్రసిద్ధ చారి త్రక పరిశోధకులైన డా.నేలటూరి వెంకటరమణయ్య, డా.బిఎన్. శాస్త్రి, డా.వివి.కృష్ణశాస్త్రి, డా.పివి.పరబ్రహ్మశాస్త్రి, ఠాకూర్ రాజారాం సింగ్, సంగనభట్ల నరహరిశాస్త్రితో సహా డా.బిరుదురాజు రామరాజు మొద లగు ఉద్దండులు ఈ జిల్లాలోని శాసనాలపై ఎన్నెన్నో పరిశోధనలు చేసి, అనేక విషయాలను గ్రంథస్తం చేశారు. జగిత్యాల వాస్తవ్యుడైన సుప్రసిద్ధ చరిత్రకారుడైన డా.జైశెట్టి రమణయ్య జిల్లా చరిత్ర, సంస్కృతి పై విశేషంగా 1936 మధ్యకాలంలో పరిశోధించి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్రశాఖ నుండి పిహెచ్.డి పట్టా పొంది, సుమారు 600పేజీల పుస్తకాన్ని తెలుగు, ఆంగ్లంలో విపులంగా ప్రచు రించారు. జిల్లాకేంద్రానికి యాభైకిలోమీటర్ల దూరంలో కరీంనగర్ లక్షెట్టిపేట మార్గంలో గోదావరి, పెద్దవాగు సంగమ తీరంలో వున్న కోటిలింగాలలో జరిగిన పురావస్తు తవ్వకాలలో శాత వాహనుల కోట, నాలుగు బురుజులు, పొలాలలో స్నానవాటికలు, బావులు, గృహ ఆవా సాల ఆనవాళ్లు, ఆభరణాలు, టెర్రకోట వస్తువులు, పూసలు, రాగి నాణాలు, పంచ్‌మార్క్‌డ్ నాణాలు, లఘు శాసనాలు బయటపడి శాత వాహనుల చరిత్ర గతులనే మార్చివేసింది. గుంటూరు జిల్లా అమరా వతి ధాన్యకటకం కేంద్రంగా శాతవాహనులు పాలించారన్న చరిత్ర కారుల తొలి అంచనాలు తారుమారయ్యాయి. 1973 మధ్య జరి గిన పురావస్తు తవ్వకాలలో ఇక్కడ శాతవాహనులు, పూర్వశాతవాహను లకు చెందిన నాణాలు, బౌద్ధస్థూపాలు, పురావస్తు అవశేషాలు ఎన్నో బయటపడ్డాయి.
బౌద్దజాతక కథల్లో చెప్పబడినట్లుగా ఒకనాటి భూగర్భంలో కలిసి పోయిన ఆంధ్రమహానగరం కోటిలింగాలేనని చరిత్రకారులు భావిస్తు న్నారు. తెలివాహ నది ఇక్కడి గోదావరి నదేనని పరిశోధనల్లో స్పష్టమైం ది. ఇక్కడ పూర్వ శాతవాహనులు, శాతవాహనులకు చెందిన భూగర్భ నగరం అంటే మట్టికింద మహానగరం ఏడు పొరల్లో బయటపడింది. కరీంనగర్ పురవాస్తుశాఖ సహాయ సంచాలకులుగా పనిచేసిన ఎం. ఎస్. రామచంద్రమూర్తి తొలినాళ్ళలో ఇక్కడే మకాం వేసి, కోటి లింగాల తవ్వకాలను పర్యవేక్షించారు. ఈ జిల్లాలో తదుపరి ధూళికట్ట బౌద్ధ స్థూపం, కోటిలింగాల, వడకాపురములలోని శాతవాహనుల కోటలు, పెద్దపల్లికి సమీపంలో పెద్దబొంకూర్ శాతవాహన గ్రామీణ స్థావరం, పలుచోట్ల బృహత్ సమాధులు బయటపడ్డాయి. చరిత్రపరంగా పరిశీ లిస్తే, ఈ జిల్లాను పూర్వశాతవాహన, శాతవాహన రాజులతో పాటు, విష్ణుకుండినులు, వేములవాడ, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, పొలాసరాజులు, విజయనగరరాజులు, మొగలాయిలు, కుతబ్‌షాహీలు, నైజాం పరిపాలకులు పాలించారు. 193 తర్వాత, 20102011 లలో కోటిలింగాలలో తవ్వకాలు జరిగాయి. ఇవి అసంపూర్తిగా, పాక్షి కంగా జరిగాయి. కోటిలింగాలలో ఆగిపోయిన తవ్వకాలను చేబట్టాలని కోరుతూ తెలంగాణావాదులు ఆందోళన ప్రారంభించడం వల్ల తిరిగి 201011లలో తవ్వకాలు పాక్షికంగా కొనసాగించారు. తెలంగాణ మేధావులు, కవులు, రచయితలు, చరిత్రకారులు, విశ్వవిద్యాలయ ఆచా ర్యులు, తెలంగాణా ఉద్యమకారుల ఒత్తిడితో పరిమితంగా తవ్వకాలు జరిపినా, ఏ కారణం వల్లనో అర్థాంతరంగా వదిలివేశారు.
తెలంగాణా సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్, తెలంగాణ పొలిటి కల్ జాక్ అధ్యక్షులు కోదండరాం, తె.విద్యావంతుల నాయకులు పిట్టల రవీందర్, తెలంగాణా సాంస్కృతిక సిద్ధాంతకర్త ఆచార్య జయధీర్ తిరుమలరావు, జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, తెరవే నాయకులు జూ కంటి జగన్నాథం, జూలూరి గౌరీశంకర్, డా.మలయశ్రీ, వారాల ఆనంద్, మల్లయ్య, సంకేపల్లి నాగేంద్రశర్మ, డా.జైకిషన్, సంగనభట్ల నర్సయ్య, ఎం.వేదకుమార్, పరవస్తు లోకేశ్వర్, టి.జితేంద్రబాబు, డా. డెమోరాజిరెడ్డి, తెలంగాణ జాగృతి కన్వీనర్ కవిత తదితరులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి, ఛలో కోటిలింగాల పేరిట హైదరాబాద్ నుండి బస్‌లపై ఊరేగింగా విచ్చేసి, ఇక్కడ పురావస్తు తవ్వకాలను పునరుద్దరిం చాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేసినా, రాష్ర్ట పురావస్తు శాఖ వారు తూతూ మంత్రంగా సుమారు రూ.ఐదు లక్షల అంచనా వ్యయంతో పాక్షికగా తవ్వకాలు జరిపి చేతులెత్తేశారు. తెలంగాణ ప్రాంతం వెనుకబడి పోవ డం, చరిత్రపట్ల మన రాజకీయనాయకుల నిర్లక్ష వైఖరితోపాటు, వలస పాలకుల విద్వేషం వల్ల శాతవాహనుల స్థావరంపై తవ్వకాలు పాతాళం లోకి జారిపోయినట్లయింది. శాతవాహనుల వంశస్థాపకుడైన శ్రీముఖు డి (చిముకచక్రవర్తి) నాణాలు, పూర్వశాతవాహన రాజులైన శృంగ, కణ్వ, మౌర్యులకు చెందిన నాణేలు ధర్మపురి వాస్తవ్యుడైన తపాల
ఉద్యోగి సంగనభట్ల నరహరిశాస్త్రి 197లో సేకరించి, పురావస్తు శాఖకు అందజేయడంతో కోటిలింగాలపై పురవాస్తుశాఖ కన్నుపడింది. ఇక్కడ పురవాస్తుశాఖ ఆధ్వర్యంలో త్వకాలు నాలుగుసార్లు జరిగాయి. ఆంధ్రుల తొలికాలపుచరిత్రకు కోటిలింగాల ముఖద్వారమని చరిత్రకారులు భావి స్తున్నారు. ఇక్కడే క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుండి క్రీ.శ. 3వ శతాబ్దం వరకు సుమారు నాలుగు వందల ఏళ్ళు పరిపాలించిన వాతవాహనులు తదుపరి గుంటూరు జిల్లా అమరావతికి (ధాన్య కటకం), తదుపరి మహారాష్ర్టలోని ప్రతిష్ఠాన పురానికి తరలి వెళ్ళారని, తదుపరి గోదావరి, కృష్ణా పరివాహకప్రాంతాల మీదుగా దక్షిణాది నుండి ఉత్తర హిందు స్థానం లోని పాటలీపుత్రం వరకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించి, సు పరిపాలన చేశారని చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. అసంపూర్తి పరి శోధనలు, పాక్షికంగా తవ్వకాలు జరిపి 27 ఏళ్ళ వరకు తమకు పట్ట నట్లుగా రాష్ర్ట పురావస్తు శాఖ వదిలేసింది.
జలయజ్ఞంలో భాగంగా శ్రీపాదసాగర్ ప్రాజెక్టు భారీ నిర్మాణం రావడంతో చరిత్రకారులలో కోటిలింగాల చారిత్రిక స్థల పరిరక్షణపై ఆందోళన మొదలైంది. మరో మొహంజాదారోహరప్పాగా వాసి గాం చిన కోటలింగాలలోని పంటపొలాలుగా వున్న 110 ఎకరాల పురావస్తు స్థావరం పరిరక్షణ సమస్యగా మిగిలిపోయింది. త్వరలో పూర్తిగానున్న శ్రీపాదసాగర్‌లో మునిగిపోనున్నందున తెలంగాణా చరిత్రకారులతో పా టు, జాతీయ చరిత్రకారుల నుండి ఆందోళన మొదలైంది. ప్రస్తుతం శ్రీపాదసాగర్ అసంపూర్తి ఆనకట్ట నిర్మాణం వద్దకు జూన్ మొదటి, రెండవవారంలో కురిసిన వర్షాలకు ఎగువన వున్న ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్టు నుండి వెల్లువెత్తిన వరద నీరు పుష్కలంగా వచ్చి చేరింది. నీళ్ళు రావడంతో డ్యావ్‌ుకు గేట్లు బిగించే పని ఆగిపోయింది. జల యజ్ఞంలో భాగంగా రూ.700 కోట్ల అంచనా వ్యయంతో శ్రీపాదసాగర్ ప్రాజెక్టును రామగుండం మండలం ఎల్లంపల్లి వద్ద ప్రారంభించారు. ప్రాజెక్టు పనులు మూడు పాళ్ళు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రాజె క్టు కింద ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన 20 గ్రామాలు ముంపునకు గురవుతుండగా, వీటిలో చాలా గ్రామాలకు భారీ నీటిపారు దల శాఖ నష్టపరిహారాలు చెల్లించినట్లు సమాచారం. తొలుత రూ.700 కోట్లతో ప్రారంభించిన ఎల్లంపల్లి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయక పోవడంతో మరో రూ.400 కోట్లను పెంచుతూ ప్రభుత్వం ఇటీవల అంచనాలను సవరించింది.
2011లో అప్పటి రాష్ర్ట పురావస్తుశాఖ సంచాలకులు డా. పెద్దా రపు చెన్నారెడ్డి రెండు మార్లు కోటిలింగాలను సందర్శించి, ఇక్కడి శాత వాహనుల స్థావరమైన 110 ఎకరాల పంటపొలాలను కొనుగోలు చేయ నున్నట్లు ప్రకటించారు. ఈ ప్రయివేట్ స్థలాన్ని రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి, ఆగిపోయిన పురావస్తు తవ్వకాలను త్వరలో పునరుద్ధరి స్తామని హామీ ఇచ్చారు. రాష్ర్ట పురావస్తు సీనియర్ అధికారి పి.బ్రహ్మ చారి ఆధ్వర్యంలో ఇక్కడ రెండుసార్లు తవ్వకాలు జరిగాయి. దీని నివేదికను రాష్ర్ట పురావస్తుశాఖ బయటపెట్టాల్సి ఉంది. రెండోసారి జరిగిన తవ్వకాలలో త్రిరత్న సంకేతాలతో బుద్దుని పాదముద్రికలు, సమీపంలోని ధూళికట్ట బౌద్ధస్థూపం వద్ద బయల్పడిన రీతిగా బౌద్ధ చైత్యాలయం, పలిగిన ముచికుంద నాగశిల్పం, ఇటుక గచ్చు వాకిలి లతోపాటు, ఇనుముతో తయారు చేసిన రకరకాల వస్తువులు, గుండు మొలలు, గోళాకారపు మట్టికాగులు, యు ఆకారపు వంట పొయ్యిలు, ప్రమిదలు, కుండపెంకులు, పంచ్‌మార్క్‌డ్ నాణాలు, పూసలు, క్రిస్టల్స్ బయటపడ్డాయి.
వీటన్నింటిపైన పురావస్తు నిపుణులచేత పరిశోధనలు జరిగి నివేది కలు రావాల్సి వుంది. కోటిలింగాల తవ్వకాలు 1973 కాలంలో జరిగాయి.ఈ తవ్వకాలను పరిశీలించిన అప్పటి పురావస్తు అధికారి డా.ఎం.ఎస్. రామచంద్రమూర్తి వెలువరించిన నివేదిక వివాదాలమ యమై పోయింది. ఈ నివేదికను రాష్ర్ట పురావస్తుశాఖ ప్రచురించింది. కోటిలింగాల పరిశోధనలపై 27 సంవత్సరాల తర్వాత వెలువరించిన నివేదికలో చారిత్రిక అంశాలు, ఏకపక్షంగా, పాక్షికంగా, అనేక తప్పుడు తడకలు ఉన్నాయని, వీటిని పరిశీలించి నిపుణులచే సవరించాలని ఆచార్య జయధీర్‌తిరుమలరావు, డా.డెమోరాజిరెడ్డిలు కోటిలింగాలను సందర్శించిన సందర్భంలో డిమాండ్ చేశారు. అప్పటి పురావస్తుశాఖ డైరెక్టర్ డా.చెన్నారెడ్డి హామీ ఇచ్చి రెండేళ్ళు గడిచినా పైసా బడ్జెట్ కూడా పెట్టకుండా, చాలా వరకు నిధుల్ని రాయలసీమ, కోస్తాజిల్లాలకు మం జూరు చేసి తన డెప్యూటేషన్ పదవీకాలం పూర్తవడంతో చేతులు దులుపుకున్నారు. ఆయన తిరిగి తెలుగుయూనివర్సిటీకి వెళ్ళిపోయారు.
12, 13వ ఆర్థిక సంఘం నిధుల కిందగాని, భారీ నీటిపారుదల శాఖ నిధుల ద్వారా గాని ఇక్కడ అసంపూర్తిగా నిలిచిపోయిన పురావస్తు శాఖ తవ్వకాలను సుమారు రూ.12 కోట్ల బడ్జెట్‌తో కొనసాగించడం, 110 ఎకరాల ప్రయివేట్ స్థలాన్ని కొనుగోలు చేయడం, కోటిలింగాలకు సమీపంలో వున్న పాశాయిగాం బౌద్ధస్థూపం గుట్టతో సహా, మొక్కట్ రావుపేట లోని మునులగుట్టను, ప్రాచీన ధూళికట్ట బౌద్దస్థూపాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడం, ఈ ప్రాంతం చుట్టూ వున్న గుట్టలను గ్రానైట్, క్వారీ మాఫియా కిందకు రాకుండా పరిరక్షిం చడం, కోటిలింగాలలో దొరికిన వస్తువులతో సైట్ మ్యూజియం ఏర్పా టు చేయడం, రాష్ర్ట పురావస్తుశాఖలోగాని, కరీంనగర్ శాత వాహన విశ్వవిద్యాలంలోగాని శాతవాహనుల చరిత్రపై పరిశోధన అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణా మేధావులు, చరిత్రకారులు డిమాండ్ చేస్తున్నారు.
నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి భారీ ప్రాజెక్టు నిర్మాణాలు చేబట్టి నప్పుడు, అక్కడి పురావస్తు అవశేషాలను వెలికితీసి భద్రపరచి అలం పురం, నాగార్జున కొండ వంటి సైట్ మ్యూజియాలను ఏర్పాటు చేశా రని, ఇందుకు భారీ నీటిపారుదలశాఖ వారే నిధులు కేటాయించారని పురవాస్తుశాఖ చెబుతోంది. రూ.7కోట్లను ముంపుగ్రామమైన కోటి లింగాల లోని ఇళ్ళకు నష్టపరిహారంగా చెల్లించారని, మండల కేంద్రమై న వెల్గటూర్ వద్ద పునరావాసం కల్పిస్తున్నారని, కోటిలింగాల పంట పొలాల స్థావరం మునిగిపోక ముందే పురావస్తు పరిశోధనలు జరపాల ని చరిత్రకారులు కోరుతున్నారు.
2006లో గుంటూరు జిల్లా అమరావతిలో జరిగిన కాలచక్ర బౌద్ద ఉత్సవాలకు రూ.యాభై కోట్లు కేటాయించిన రాష్ర్టప్రభుత్వం కోటి లింగాలపట్ల చిన్నచూపు చూడడాన్ని తెలంగాణా ప్రాంత చరిత్రకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో తెలంగాణవాదులు, నాయకులు చొరవచూపాలని, ఈ నిర్లక్ష్యానికి తెరవేయాలని వారు కోరుతున్నారు.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి