నువ్వూ,నేనూ లేదా నేనూ నువ్వూ
మళ్ళీ మళ్లీ ‘పలుకు’ రాళ్ళతో రాక్కున్న గీతలు,
రెండుగుండెల మధ్య పచ్చిపుండు ఛారికలు కట్టాయి.
ఇంకా ఇంకా గిల్లుకుంటూ రేపుకున్నగాయాలు
నాకిక్కడ కరెంటు లేక, నీకక్కడ కూచునే చోటులేక
ఉక్కబోతకు మరీమరీ రెచ్చుతున్నాయి.
ఒక్క కడుపున పుట్టినవాళ్ళం
ఒకేఅన్నంముద్దను పంచుకున్నవాళ్ళం
ఆత్మీయఆలింగనాలని ఈ పలచటి గోడ ఆపుతుందా?
దీన్లోనే ఓ దర్వాజా పెడదాం రారా బ్రదరుసోదరా.
శాంతివచనం వికటిస్తున్నవేళలో
నాగొంతులోపలి మాటలు గొణుక్కుంటున్నాను
నీ మనసులోపల ప్రతిధ్వనిస్తాయన్న నమ్మకంతోనే.
రెండుముక్కలయిన దేహం
వాడిపోని రెండు మొక్కలవ్వాలంటే
మండించే వేడికాలపు మొదట్లోనయినా కాస్త తడితగలాలి.

► 25-08-2014
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి