బక్రీద్ కు ఆ పేరెలా వచ్చింది?

ఇస్లాం మతస్తులు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనవి రెండు. అవి 1. ఈదుల్ ఫితర్ , 2. ఈదుల్ జుహా. 
ఈదుల్ ఫితర్ ముస్లింలకు అతి పవిత్రమైన పండుగ. దీని అర్థం ఉపవాస దీక్ష తరువాత జరుపుకునే సంబరం అని. ఈ పండుగను ముస్లిం క్యాలండర్ ప్రకారం తొమ్మిదవ నెలలో జరుపుకుంటారు. 

ఈదుల్ ఫితర్ తరువాత రెండునెలలకు ఈదుల్ జుహా వస్తుంది. ఈదుల్ జుహా మనిషి యొక్క త్యాగ నిరతిని గురించి తెలియజేసే పండుగ. అందుకే దీనిని ’త్యాగాల పండుగ’ అనికూడా అంటారు. ఈదుల్..అజహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్‌హేజ్‌ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు.

బక్రీద్ కు ఆ పేరెలా వచ్చింది?

దీనికి ఆ పేరు రావడం గురించి ఒక కథ చెబుతారు. 5 వేల ఏళ్ల క్రితం నాటి ఇరాక్ లో జరిగిందని చెపుక్కునే ఒక మహత్తు పూర్వకమైన సంఘటన ఆధారంగా ఈ పద్దతి ఏర్పడింది అని భావిస్తారు. ఇరాక సామ్రాజ్యంలో దైవ వాక్కులను ప్రజలకు అందిస్తూ.. న్యాయం, ధర్మ సూత్రాలు వల్లె వేస్తూ.. మూఢ నమ్మకా లపై, అజ్ఞాన ఆచారాలపై చైతన్య పరుస్తున్న హజ్రత్‌ ఇబ్రహీం అనే భక్తిపరుడు వుండేవాడు. అతను దేవుడు ఒక్కడేనని... ఆతన్ని నమ్ముకున్న వారికి ఎలాంటి హానీ కలగదని ప్రచా రం చేస్తు.. జనాన్ని ఆకట్టుకుంటాడు.  ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న నమ్రూద్‌ నిరంకుశుడు. దైవం ఒక్కడే అంటూ ఇబ్రహీం చేస్తున్న ప్రచారం సమ్రూద్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.. తక్షణం తన సామ్రాజ్యాన్ని వీడి వెళ్లి పోవాలంటూ హజ్రత్‌కు రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తాడు.

ఇరాక నుండి బైటకు వచ్చిన హజ్రత్‌కి మార్గంలో అనేక మంది అనేక దేవతల్ని పూజించడం కనిపిస్తుంది. తానే ఇన్నాళ్లు పొరపాటు పడ్డానే వెూ అని భావించిన ఆయన మదిలో నిజంగా దైవం అనేది ఉందా ఉంటే వీళ్లంతా పూజిస్తున్నట్లు అనేక రూపాలలో ఉందా ఇంత మంది దేవుళ్లు ఉన్నారా అన్న ప్రశ్న మదిని దొలిచి ఆ దిశగా దైవం ఎక్కడ అనే సత్యాన్వేషణ ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో ఓ రోజు ఆతనికి కలలో అల్లా కనిపించి "నీ కుమారుని నాకు బలి ఇవ్వమ"ని కోరాడట. నిద్రనుండి మేలొన్న ఇబ్రహీం తన కుమారుడైన ఇస్మాయిల్ కు ఈ సంగతి తెలియజేశాడు. దైవ భక్తుడైన ఇస్మాయిల్ అందుకు ’సరే’ నన్నాడు. ఇక బలి ఇవ్వబోయే ముందు దేవుడు అతని త్యాగనిరతికి సంతోషించి, ఆయన స్థానంలో ఒక గొర్రెను సృష్టించాడు. ఆనాడు ఇబ్రహీం దేవునికి గొర్రెను సమర్పించినందుకు గుర్తుగా ఈ పండుగను బక్రీద్ అని పిలవటం జరిగింది. (బక్రా అనగా గొర్రె)

విందు పద్దతి

హలాల్‌ చేసిన వీటి మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, ఫకీర్లకు దానం చేసి, రెండో భాగాన్ని ఇరుగు పొరుగువారికి పంచి పడతారు. మూడోభాగాన్ని ఆయా కుటుంబాలు వండు కుని బంధు మిత్రులతో కల్సి విందు చేసుకుంటారు.
బక్రీద్‌ రోజు ఈద్దాలో ముస్లిం సోదరులతో సామూహిక ప్రార్ధనలు చేసిన అనంతరం మాత్రమే ఖుర్భానీ చేసిన జంతు మాంసాన్ని భుజించాలన్న నియమంతో పాటు ఆ జంతు చర్మాన్ని ఇతరులకు దానం చేయాలన్న నియమం కూడా ఖచ్చితంగా పాటిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం గోవధపై నిషేధం నేపధ్యంలో ఆవులను, ఆవు దూడలను కబేళాలకు అమ్మడాన్ని, కొనుగోలు చేయడాన్ని నిషేదించారు

హదీష్ షరీఫ్‌లో ఖుర్బానీ విశిష్టతను చాలా ఘనంగా ప్రశంసించారు. దివ్య ఖురాన్‌లో కూడా ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి గురించి పొగడ్త ఉంది. ఖుర్బానీ జంతువు రక్తపు బిందువు భూమిపై పడక ముందే ఖుర్బానీ చేసే వ్యక్తి పాపాలన్నీ నశించిపోతాయి. ఖుర్బానీ జంతువు ఒక్కో రోమంలో ఒక్కో పుణ్యం లభిస్తుందని ముస్లింలు విశ్వసిస్తారు. ఈ పండగ రోజు ప్రత్యేక నమాజ్ త్వరగా అంటే పది గంటల లోపే చదువుతారు. సాధ్యమైనంత వరకు ఏం తినకుండా ప్రార్థనకు వెళతారు.

పండుగ ఆంతర్యం ఏమిటి?

భగవంతుని కావాల్సిం ది సిరి సంపదలు కాదని... మనిషిలోని సంకల్స శుద్ది ఎంత గొప్పదో తెలుసుకు నేందుకు దైవం పెట్టే పరీక్షలు మనిషికి కష్టమే అయినా... ఓర్పితో వాటిని భరించాలి. దైవ ప్రసన్నతే ధ్యేయంగా జీవనాన్ని కొన సాగిస్తూ మనోవాంఛలని త్యాగం చేయాలన్నది అల్లా ఆదేశాలను తాను అమలు చేసానని ఇబ్రహీం పేర్కొన్నాడని... ఆతని బాటలో ముస్లింలం తా నడవాలన్నదే ఈ పండగ ాశయంగా ముస్లిం పెద్దలు చెప్తారు.


బక్రీద్ రోజుకు ముందురోజున చనిపోయినటువంటివారి గోరీలవద్ద వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలు, వస్తువులను ఉంచుతారు. వారు స్వర్గంనుండి వచ్చి వాటిని భుజిస్తారని, స్వీకరిస్తారని, స్వీకరించి తమను ఆశీర్వదిస్తారని నమ్ముతారు. ఈ పండుగ సందర్భంగా ధనికులు పొట్టేలు మాంసాన్ని పేదలందరికీ ’కుర్బానీ’ అనే పేరుతో పంచటం ఆనవాయితీ. మరీ ధనవంతులు బక్రీద్ సందర్భంగా ముస్లింలకు అతి పవిత్రమైన మక్కాను సందర్శిస్తారు. ఈ యాత్రనే హజ్ యాత్ర అని అంటారు. హజ్ యాత్రకొరకు సౌదీ అరేబియా‌లోని మక్కా నగరానికి చేరుకుని మస్జిద్..ఉల్..హరామ్‌లోవున్న కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి మసీదులో ప్రార్థనలు చేస్తారు. ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజు (ప్రార్థనలు) చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు.


హజ్ తీర్థయాత్రకు వెళ్ళినవారు మక్కానుండి మదీనా (ముహమ్మద్ ప్రవక్త గోరీ ఉన్ననగరం)ను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం  తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమైన భక్తిపూర్వక సందర్భాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.

ఖుద్బా , ఖుర్బానీ లు కథ

రంజాన్‌లాగే బక్రీద్ పండుగను కూడా ఖుద్బా (ధార్మిక ప్రసంగం)తో ఈద్గా‌లో సామూహిక ప్రార్థనలు జరుపుతారు. ఆతర్వాత వారు నెమరు వేసే జంతువులను (ఒంటె, మేక, గొర్రె, ఎద్దు) మాత్రమే ఖుర్బానీ (బలి) ఇస్తారు. బలి ఇచ్చిన తర్వాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. 

ఈ ఖుర్బాని చనిపోయిన తర్వాత సిరాత్ వంతెన దాటడానికి ఉపయోగపడుతుందని ఇస్లాం హదీసుల ద్వారా తెలుస్తుంది. ఈ హదీసులు అంటే మహమ్మదు ప్రవక్త యొక్క ప్రవచనాలు , కార్యాచరణాల గురించి మౌఖిక సాంప్రదాయక ఉల్లేఖనాలు. ఈ హదీసులు, సున్నహ్ మరియు ముస్లింల జీవన మార్గమునకు అతి ముఖ్యమైన పరికరాలుగా భావిస్తారు.

సనద్ మరియు మతన్ లు హదీసులకు మూలాలు. సనద్ అనగా మూలసాక్ష్యం. మతన్ అనగా ఉల్లేఖనం.

కామెంట్‌లు