సిద్దమయ్యారా

కవిగా మారాలంటే భాషని అలంకారాలనీ ఛందోబద్దమైన సంస్కారాలనూ నేర్చుకోవటం కాదు. అంతకంటే వేరుగా మరోటేదో వుందంటున్నాడు ఈ కవి. పకృతిని చూడటమే కాదు, చూస్తూ కావలసిన స్పందనను వెలిగించుకోవటం చేతనవునా అనిప్రశ్నిస్తూ, అన్యాపదేశంగా అటువంటి స్థితి వుంటేనే నీవు కవివి అనిపించుకోగలవని నర్మగర్భమైన గడుసుదనాన్ని చూపిస్తున్న ఈ కవితను రాసిన Ro Hith  ఇటువంటి పదునైన కవిత్వాన్ని రాయడంలో దిట్ట.



వర్షాన్ని చూస్తూ మీరు అదృశ్యంగా రక్తసిక్తం కాగలరా?

అవుతుంటాను.

మీలోపలి అరణ్యాలను ఆకలిగా మింగేసే తుఫానులనాహ్వానించగలరా?
వీస్తూనే వుంటాయి.

నిశ్శబ్దాన్ని పాడుతూ, చీకటిని నర్తించగలరా?
అవునపును ఎన్నోసార్లు

పగటి అంతిమఘడియల్లోని కాంతిలో మునుగీతలేస్తారా? మత్తుగా కలల రాత్రిలో మైమరచిపోతారా?
అనేకసార్లు అలాగే అవుతుంటాను.

కళ్ళుతెరచుకుని ఇసుక తుఫానుల్లోకి చొచ్చుకుపోతుంటారా?
అవును అచ్చంగా వెళ్తుంటాను.

రాలిపడే ఆకుల భాష మీకర్ధం అవుతుందా?
అవునవి నాతో మాట్లాడుతుంటాయి.

అర్రే
అయితే మీరిక సిద్ధమయినట్లే, ఒక పద్యంగా మారేందుకు.

తెలుగులో : కట్టా శ్రీనివాస్





ఆంగ్ల మూలం : రోహిత్



Can you bleed invisibly watching rain?
- Yes

Can you let a wind devour the jungle inside you?
- Yes

Can you sing silence and act darkness?
-I think, Yes

Can you swim in the light of dying day?
Or sink in the swamp of dreamy night?

- Yes Yes

Can you open your eyes and walk into a sand storm?
- O Yes

Can you understand the language of falling leaves?
- Yes, o yes

You are ready then, to become a poem


కవిసంగమంలో 

  • Vijay Lenka Abstract!
    13 hrs · Unlike · 2
  • ఇట్లు మీ శతఘ్ని ఆంగ్లములోనిది "బ్యూటిఫుల్" ... అచ్చ తెలుగులో అయ్యిందది "బ్యూటీ -ఫుల్" . ఇద్దరికీ నా ........../\..........
    13 hrs · Unlike · 2
  • Nvmvarma Kalidindi S iam ready to bocome a poem Thank you Ro Hith n agarajaa Katta Srinivas
    13 hrs · Edited · Unlike · 3
  • Srinivas Vasudev "వర్షాన్ని చూస్తూ మీరు అదృశ్యంగా రక్తసిక్తం కాగలరా?" ంఏంటీదీ?
    13 hrs · Edited · Unlike · 2
  • Katta Srinivas వర్షాన్ని చూస్తూ ఆంతరిక సీమల్లో రక్తసిక్తం కాగలగటాన్ని అర్ధం చేసుకోగలరా మీరు?
    లేక ఏంటీదీ? అని అడుగుతారా?  
    మరికొంచెం స్పష్టంగా మీ ప్రశ్నను విపులీకరించగలరా దయచేసి? ఏదైనా పొరపాటును పట్టుకున్నారా? అనువాద దోషాన్ని సరిచేయబోతున్నారా? శనివారం శీర్షిక మాస్టారూ
    13 hrs · Edited · Like · 1
  • Srinivas Vasudev వర్షాన్నీ, రక్తాన్నీ కలపలెని అసహయాతలోనే నా ఈ ప్రశ్న ఉందన్న విషయం మీకూ అర్ధమై ఉండాలె ఈ పాటికి
    13 hrs · Unlike · 3
  • Srinivas Vasudev i read Ro Hith 's poem here...and the first line doesn't match the one posted here
    13 hrs · Unlike · 1
  • Katta Srinivas కవి భావన ఏమయి వుంటుందో కానీ, గాయాన్ని గేయంగా పాడేవాళ్ళు కొందరైతే,
    గేయంలోనూ గాయాల చారికలను తడుముకునే స్పృహ మరికొందరిది.
    నేను అంతమేరకు మాత్రం ఆలోచించగలిగానండీ. ఏమో Ro Hith మరికొంచెం లోతుగా మరేదయినా అనుకుని వుండొచ్చు
    13 hrs · Like · 3
  • Srinivas Vasudev Katta Srinivas నాకు శనివారపు మాష్టారని ఓ బిరుదిచ్చేసి కూర్చుంటే ఎలా? నా ఫీలింగ్ ని నెను చెప్పాను..అలాగే మన రోహిత్ కూడా తన వాదనని వినిపించొచ్చు
    12 hrs · Unlike · 2
  • Katta Srinivas తనని పోయెం రాసుకుంటూ పోయినప్పుడు అక్షరాలుగా మారటమే చూస్తున్నాను. ఇలా పొడవుగా నలగ్గొట్టబడే వివరణ వాక్యాల్లోకి పరచుకోవడం తనకి నచ్చదేమో. నేను అనువదించిన పాపానికిలా కామెంట్ల బోనులోకి పిలవొద్దేమో అనుకుంటున్నాను. ఇప్పటికే పైకామెంటులో ఓ లంకేసి లాగానుకూడా.
    తనక
    ి నచ్చినట్లే ఉండనిద్దాం.
    పదానికి పక్షాలిచ్చి ఎగరేసే మీరు నిర్వహిస్తున్న శీర్షికమీద అభిమానంతోనే అన్నాను. 
    ఇక పోతే మీరన్న odd ని మరికొంచెం స్పష్టంగా చెప్పినా అర్ధం చేసుకుంటాను
    12 hrs · Edited · Like · 2
  • 12 hrs · Unlike · 2
  • Indus Martin Good work sir!
    11 hrs · Unlike · 2
  • Sri Modugu మనం చదివేటప్పుడు భావాలు అదే భాషలో అలానే చదివితే వచ్చే ఒక లోతైన భావన అనువాదాల్లో ఎప్పటికీ రాదు అది బహిరంగ రహస్యం అది ఇంగ్లీష్ నుంచి తెలుగు కావొచ్చు తెలుగు నుంచి ఇంగ్లీష్ కావొచ్చు , కాని కొన్నిసార్లు ఒక కవి చదివినప్పుడు ఆ భావన విపరీతంగా నచ్చి తనదైన శైలి లో , తన గ్రహింపు లోనుంచి అనువదించడం మాములే, కాని ఒరిజినల్ నచ్చినంతగా అనువాదాలు నచ్చడం మాత్రం కొంచం తక్కువే .. ...
    11 hrs · Edited · Unlike · 4
  • Sri Modugu It`s all figurative speech ……The meaning…… If we speak literally it never change ,but metaphorically it changes according to your perception … Sorry for interrupting
    the KS Admins conversation .. 
    10 hrs · Edited · Unlike · 2
  • Goutham TheDictator కురిసే వర్షాన్ని చూస్తూ నువు కరిగిపోగలవా..? Very nice Rohit.
    10 hrs · Unlike · 3
  • Rajarshi Rajasekhar Reddy ఆంగ్ల మూలానికి అదే వరుస లో అచ్చంగా అలానే అనువదించి అదే భావాన్నితీసుకు రావడం దాదాపు వీలుకాని విషయం . దాని అర్థాన్నిమన శైలి లో చెబితే కొంత రమ్యత తీసుకు రావొచ్చేమో . ఇంత మంచి కవిత ను శ్రీనివాస్ గారు అనువదించి అందించకుంటే మనం చదవగలిగే వాళ్ళం కాదేమో . అందుకు వారికి ధన్యవాదాలు. రోహిత్ గారికి అభినందనలు .
    10 hrs · Unlike · 2
  • Ravinder Verelly beautiful!
    4 hrs · Unlike · 2
  • Ravinder Verelly రోహిత్ పోయెట్రీ అంటే నాక్కూడా చాలా ఇష్టం! అనువాదం చక్కగా ఉంది. ముఖ్యంగా ఆ 'అర్రే' అనడం భలే ఉంది!
    4 hrs · Unlike · 3
  • Rama Krishna Perugu Nice translation Srinivas...Rohith is a genius poet
    4 hrs · Unlike · 2
  • Oddula Ravisekhar versatile poetry of rohith and good translation from you sir.
    4 hrs · Unlike · 2
  • Katta Srinivas Vasudev గారూ రక్తసిక్తం పదంలో వున్న కరకుదనం నాక్కూడా ఏదోలా అనిపించింది. కొంచెం మార్చాను పర్లేదంటారా? Sri గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలతో....
    1 hr · Like · 1
  • Nauduri Murty original and translation are very nice
    58 mins · Unlike · 2
  • Katta Srinivas Nauduri Murty సర్ ఇలాంటప్పుడే ఇష్టంగా మీరెంత కష్టపడుతున్నారో తెలిసివస్తోంది. థాంక్యూ వెరీమచ్ సర్
    53 mins · Like · 1
  • Ro Hith I think it's time to break silence and speak something- George Eliot once said - "all meanings we know depend on the key of interpretation" and Yevtushenko nailed the whole argument about translations saying - " "Translation is like a woman. If it is beautiful, it is not faithful. If it is faithful, it is most certainly not beautiful."
    50 mins · Unlike · 2
  • Ro Hith I guess the very act of translating is much difficult than creating a poem, and I am satisfied with Katta Srinivas gaaru's translation. I suppose it is because the translator experienced the same kind of silence as the poet -
    46 mins · Unlike · 2
  • Nauduri Murty రో హిత్ 
    మీరు ఉదహరించినదాంట్లో George Eliot చెప్పింది ఒక రకంగా కవిత్వాన్ని ఆధునిక దృష్టితో చూడడంగా చెప్పుకోవచ్చు. (రెండవది నిర్వచనం కంటే ఒక సరసమైన వ్యాఖ్యగా తీసుకొండి). పూర్వం కవి రాయడం పూర్తవడంతోటే కవిత్వ ప్రక్రియ పూర్తయేది. దాన్ని అర్థం చేసుకోవడం పాఠకుడివంతుగా implicitగా భావింపబడేది. అప్పుడు రాసేవాళ్ళూ తక్కువ. వాళ్లకి వాళ్ళు పెట్టుకున కొన్ని నియమాలూ జటిలమైనవి. ఆ నియమాల్ని పాటించడంలో ఉన్న కష్టాన్ని అనుసరించి చాలా మంది ఆ జోలికి పోయేవారు కాదు. కవిత్వం రాయడం, అక్షరాస్యత, వాడుకభాష, దాని సరళీ కరణ ... రాయగలవాళ్ళనీ, వస్తు విస్తృతినీ ఎక్కువచేశాయి. అందువల్ల ఇప్పుడు కవితా ప్రక్రియ కవితో ప్రారంభమై, పాథకుడితో ముగుస్తుంది. పూర్వం కవి ఏది రాస్తే అది కవిత్వంగా చలామణీ అయే దశనుండి, ఇప్పుడు పాథకుడు ఏది చదివి, అర్థం చేసుకుని, స్పందిస్తే అదే కవిత్వంగా మిగులుతోంది. అంటే, పాథకుడికి ఏది కావాలో అదే కవిత్వం. ఏది అర్థం చేసుకోగలడో అదే కవిత్వం. కొంచెం కటువుగా ఉన్నప్పటికీ ఇదే నిజం. దీన్ని పాత తరాలకు కూడ మనం తెలిసో తెలియకో వర్తింపజేస్తున్నాం. అందుకే వెయ్యేళ్ళ తెలుగు కవిత్వంలోనూ, కొద్దిమందే ప్రజల నాలుకలమీద నిలబడగలుగుతున్నారు. అంటే, వాళ్ళు రాసినదాంట్లో కాలాన్ని (అంటె కొన్ని తరాల అభిరుచిల్ని) అధిగమించి నిలబడగలదేదో ఉందన్నమాట. ఒక రకంగా పాఠకుడికి కవితాప్రక్రియలో సమభాగం ఇవ్వడం.
    అనువాదకుడుకూడా ఒక పాఠకుడే. కాని అనువాదాన్ని చదివే పాఠకుడికి అతడు సృష్టికర్త. కనుక అనువాదకుడుకూడా, అతని పాఠకుడికి తల ఒగ్గి ఉండవలసిందే. పాఠకుడు కవితనీ, అనువాదాన్నీ ఎలా interpret చేస్తే అదే సబబు.( ఆ పాఠకుడికి సంబంధించినంతవరకు).
    7 mins · Unlike · 1

కామెంట్‌లు