వినిర్మాణం

నువ్వూ... నేనూ...
ఒకేలా కట్టు కూలీలమే.

మాటల పోటుకు
పెచ్చులూడిన బయటిగోడకు
మలాం చేస్తూ నువ్యు...

జ్ఞాపకాలను స్రవించే
గుండెకు మైనం రాస్తూ నేను.
నిరంతరం నిర్మాణ కార్మికులమే.


►28-12-2014
కవిసంగమంలో ప్రచురితం

కామెంట్‌లు