కత్తిలాంటి సమాజం తేనెరాసుకొస్తుంది

తేనె కురిపించే మాటలతో
ప్రేమ కనిపించే పనులతో
స్నేహపు వలలు అల్లుతున్నప్పుడు
అంతా సుందరంగానే వుంటుంది.
గురికోసం బరిలో దింపిన రోజున
గుర్తొస్తుంది గుదిబండ బంధాల గోల.
పులి కడియాన్ని ఎరగా ఊపితే
పరిగెత్తని మగాడెవ్వరు ?.
గాలానికి వేళ్ళాడే అందానికి
లొంగకనే నిలబడేదెవ్వరు ?.
నా లకుముకి పిట్టా గడబిడ పడకు
కనిపించేవన్నీ నిజాలనే గాటన పడకు.
లోతేమిటో ఎరగకనే
దిగేయాలని ఆత్రుత పడకు.
► పురాస్మృతి కోడిపందేలపై సుప్రీంకోర్టు తీర్పు నేపద్యంలో
13-01-2015

కామెంట్‌లు