ఒకరోజు
పాఠం నడుస్తోంది...
ఇంతదాకా పీల్చిన శ్వాస
నిశ్వాసించే లోగానే గతమైపోతుందనీ
వెయ్యబోయే ప్రతి అడుగూ
భూమిని చేరుతుందో లేదో చెప్పాల్సింది భవిష్యత్తేననీ.
ఇంతదాకా పీల్చిన శ్వాస
నిశ్వాసించే లోగానే గతమైపోతుందనీ
వెయ్యబోయే ప్రతి అడుగూ
భూమిని చేరుతుందో లేదో చెప్పాల్సింది భవిష్యత్తేననీ.
నీవున్న ఈ క్షణమే నీది.
నీవంటేనే నీవున్న ఈ క్షణం
కాకుంటే
గతపు రంగుల్ని, భవిత హంగుల్నీ
అద్దుకుంటూ ఉబ్బిపోతుంటుంది ఆ క్షణం అంటూ
తన్మయంగా పాఠం చెపుతూ గురువు.
నీవంటేనే నీవున్న ఈ క్షణం
కాకుంటే
గతపు రంగుల్ని, భవిత హంగుల్నీ
అద్దుకుంటూ ఉబ్బిపోతుంటుంది ఆ క్షణం అంటూ
తన్మయంగా పాఠం చెపుతూ గురువు.
ఎగురుతున్న సీతాకోక రంగుల చప్పుళ్ళనీ,
దారిపక్క బిచ్చగత్తె పాటలోని వర్ణాలనీ,
పరుగులెత్తే పిల్లవాళ్ళ జీవనోత్సాహాన్నీ
విభ్రమంగా గమనిస్తూ శిష్యుడు.
దారిపక్క బిచ్చగత్తె పాటలోని వర్ణాలనీ,
పరుగులెత్తే పిల్లవాళ్ళ జీవనోత్సాహాన్నీ
విభ్రమంగా గమనిస్తూ శిష్యుడు.
నిర్లక్ష్యపు శిష్యరికంపై
నిరంకుశంగా గురుత్వపు మొట్టికాయలు ఎప్పట్లానే పడ్డాయి.
నిరంకుశంగా గురుత్వపు మొట్టికాయలు ఎప్పట్లానే పడ్డాయి.
మరోరోజు
బరువు బాధల బస్తాలు మోస్తూ
జీవితాన్ని చతికిల పరచుకుంటావెందుకు?
ఆనంమయకోశాన్ని నింపుకో
ఆరోగ్యైశ్వర్యాలను ఒంపుకో
అభివృద్ధిని పెంచుకో
తరాల తరబడి తడబడకుండా నేర్పే పాఠాన్ని
మేరునగగంభీరుడై వల్లెవేయించేలా వెల్లవేస్తున్న గురువు.
గుట్టుగా గిలిగింతలు పెట్టుకుంటూ
పాఠాన్ని వదిలేస్తున్న శిష్యులు.
జీవితాన్ని చతికిల పరచుకుంటావెందుకు?
ఆనంమయకోశాన్ని నింపుకో
ఆరోగ్యైశ్వర్యాలను ఒంపుకో
అభివృద్ధిని పెంచుకో
తరాల తరబడి తడబడకుండా నేర్పే పాఠాన్ని
మేరునగగంభీరుడై వల్లెవేయించేలా వెల్లవేస్తున్న గురువు.
గుట్టుగా గిలిగింతలు పెట్టుకుంటూ
పాఠాన్ని వదిలేస్తున్న శిష్యులు.
కాళ్ళులేని భార్యను అతడు మోస్తుంటే
కళ్ళులేని తనకి దారిచూపిస్తున్నదామె అంబారిపై కూర్చున్నట్లు,
తరగతిగది పక్కగానే పాడుకుంటూ వెళ్తున్నారు.
కళ్ళులేని తనకి దారిచూపిస్తున్నదామె అంబారిపై కూర్చున్నట్లు,
తరగతిగది పక్కగానే పాడుకుంటూ వెళ్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి