అదేమిటో
బంధాలనూ,స్నేహాన్ని,వృత్తిని
భాద్యతగా కాకుండా ప్రాణంగా చూసుకునేవాళ్ళెవరు కనిపించినా
అదికూడా అమ్మే అనిపిస్తుంది.
జండర్ తో సైతం సంభందంలేకుండా.
వాళ్ళంత ఎదగాలనేది నిరంతరం ప్రయాసే కానీ ఫలితంలా కనిపించకపోవడమే
విషాదసంతోషం
అదేమిటో మరేమిటో
తనకంటే తనుఅదేదానికంటే
మరోదాన్ని బరువేలేకుండా మోయటం
ఇప్పటివరకూ ప్రపంచంలో ఒక్కరికే సాధ్యమనేది
ఆశ్చర్యకరనిర్ధారితం.
అప్పుడప్పుడూ ఒక్కళ్ళెవరో కనిపిస్తుంటారు.
అహం పెంకుని బద్దలుకొట్టుకుంటూ ఆప్యాయంగా అల్లుకుంటూ పోవడం తెలిసినవారు.
వెన్నెముకే లేదనిపిస్తుందా? వెనకనిన్నే పెట్టుకోవడం వచ్చినవాళ్ళను చూస్తే.
అప్పుడప్పుడూ మెరుస్తుంటారు.
చీకటిలో కళ్ళుచికిలిస్తూ కూర్చున్నప్పుడు
కొంతసేపు మనసు మూగపోతుంది.
నిశ్శబ్దంలో వేళ్ళుపాతుకుంటూ వుండేందుకు.
అదేమిటో మరేమిటో
>>29-03-2015

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి