గోడమీది తల్లి ప్రేమ

దేవుడా..
పర్లేదనుకుంటే నిన్నివ్వాళ ఒక కోరిక కోరదామనుంది...
ప్లీజ్... ప్లీజ్..
నీతో సమానంగా...
నువ్వేమనుకోనంటే
లేదా అనుకున్నా పర్లేదులే అనుకుంటూ
నీకంటే కుంచెం ఎక్కువగా ప్రేమించే
మా అమ్మల్ని...
ప్లీజ్ ప్లీజ్
దయచేసి
ఫార్మాలిటీ ప్రేముల్లో పడిపోకుండా చూడవా...
ఫ్యాషన్ వేడికి ఆ కొంచెం గుండెల్లో తడి ఆరిపోకుండా చూడవా..
ప్రదర్శనకీ, ప్రకటితానికి మధ్య సన్నని గీతల్ని కనిపించేలా మార్చవా
ఒక్కరోజు ఉబికే చుక్కను నిరంతర వార్షిక ఊటగా మార్చవా..
పెదాలతో ఉచ్చరించకపోయినా ప్రేమ ప్రవహిస్తూనే వుండే దారి కనిపించేలా చేయవా.
పీకి చెవిపక్కన పెట్టకపోయినా గుండెచప్పుడు వినిపిస్తున్నంత సహజంగా వుంచవా.
ప్లీజ్ ప్లీజ్ దేవుడా
నీవు కొంచెం బిజీగా వుంటే మా అమ్మ వాల్ మీదనయినా ఈ ముక్కనొకసారి రీపోస్టు చేయ్యవా.
10-05-2015 (మదర్స్ డే సందర్భంగా)

కామెంట్‌లు