తన
పొరల పొరల దు:ఖాన్ని
ముక్కలుగా కోస్తూ
కంటతడిపెడుతుంది.
పచ్చగానే కనిపిస్తున్న
ఓ జీవితపు మిరప
హంత కారమైనందుకు
హాచ్చర్యపోతూనే వుంటుంది.
పళ్ళెలలో వడ్డింపబడుతున్న
ప్రతిసారీ
మనసుని తేలిక చేసుకుంటూ
మరింతగా కరిగుతూనే వుంటుంది.
ఆమె
మా అమ్మకావచ్చు
నా బిడ్డకి అమ్మకావచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి