చెప్పుకొనేందుకేమున్నది

ఎవరువీళ్ళు?
మారాజుల్లా కనకపు సింహాసనాన్ని కరచిపట్టుకుంటారు.
రేరాజుల్లా పేర్లని పిలిచిపెట్టుకున్నారు.
ఏంటి వీళ్ళు
ఇంకా చిగురించని రేపటికలల్ని
ఇంతముందస్తుగానే దొంగిలిస్తున్నారు.
ఎవరెహే ఈల్లు?
బుద్దితక్కువ చీకట్లలో దిక్కుతోచక
దేశపు ఈగో దేహాలను వెలిగించాలను చూస్తున్నారు.
చెప్పు చెప్పూ అంటే ఏముంటుంది.
నడిచేందుకే కాదు నడతమార్చేందుకూ
సిద్దంగానే వుంటుంది.
కుక్కకాట్లకు మందుమాటగా కూడా.
కాలిక్రిందదేలే అని చులకనవుతున్న ‘‘ చెప్పు’’.
10-06-2015

కామెంట్‌లు