నిత్య సంచారి

బయటి ప్రయాణం సాగుతుండగానే
లోపటి ప్రయాణం ప్రశ్నిస్తుంటుంది.
తమ్ముడూ నావైపొకసారన్నా చూస్తున్నావా అంటూ....


బయటి ప్రయాణం సాగుతూనే వుంటుంది.
లోపట ప్రయత్నం చతికిల పడుతుండగానే
బయటి ప్రయాణం సాగుతూనే వుంటుంది.
లోపట ప్రమాదం పొంచి ఉండగానే


గుట్టలూ,పుట్టలూ, వాడలూ మేడలూ
దాటటం సాగుతూనే వుంటుంది.
లోపలేదో దాటలేని కొండ పెరుగుతుండగానే


మిత్రుడా అంగలేసుకుంటూ వెళ్తాంసరే
అంగలార్చుకునే దశదాటేస్తామా సరి
మిత్రుడా గొప్పగా గెలుస్తున్నామా ?
కొత్త మత్తులో మునుగుతున్నామా?


తెరచాప ఎత్తేసాం సరే
గాలివాటంలో తలెత్తుకునే వున్నామా?
తలసాంతం ముంచేసాం మరి
సాంత్వనం సాధిస్తున్నామా?


పరుగే కాదు బెదరూ ప్రగతీ కావాలి.
ప్రతిదీ కాదు వినరా మనదే వెతకాలి.
అడుగు అచ్చై నిలబడాలి.
నడకతో నలిగిన దారి నడిపించేదవ్వాలి.



కామెంట్‌లు