అడుగడుగునా భయపెట్టే ల్యాండ్ మైన్స్ లో గొప్పేముంది
అడక్కుండానే నిన్ను పట్టేసే కామినిలా కెమెరాలు చుట్టూ అల్లుకుంటున్నప్పుడు.
హస్తభూషణమై సర్పనేత్రం బుసకొడుతూ తిరుగుతోంది.
ఎక్కడెక్కడో ఆడవాళ్ళ అందాల్ని అడ్డంగా జుర్రేసుకుని
నీలిరంగు తెరలపై వాంతిచేసుకునే అదనపు కళ్ళ ఆకళ్ళు కొన్ని,
ఎక్కడో తొంగిచూసే వొంపుసొంపుల్ని 4x, 8x కొలతలతో ఇరగదీసి పట్టుకుంటూ
అంతర్జాల ప్రపంచంలో పరుస్తున్న దొంగకళ్ళ జూమ్ లు మరికొన్ని.
మొత్తం నాగరికత నిండా నల్లటి చీకట్లాంటి బురఖాలేమైనా తొడిగెయ్యండ్రా సామీ
గుండెల్నిండా గాలిపీల్చుకుని తిరగడానికి అమ్మలైనా, అమ్మమ్మలైనా భయపడి చస్తన్నారు.
అవినీతి లోతుల్లోని బురదను బజార్లో కడిగేసేందుకూ
అన్యాయం చీకటి గొంతుని వెలుతురుతో నొక్కేసేందుకు వాడొచ్చుకదరా
ఇలా బజార్నపడి గుచ్చిగుచ్చి భయపెట్టేబదులు
అహల్యను కామించిన ఇంద్రుడికి వెయ్యికళ్ళంట
అసహ్యంగా కాపేస్తున్న అడ్డగోలుతనాలకీరోజు అడుగడుగునా కళ్ళే..
చేదుజ్ఞాపకాలనైనా చిప్ ముక్కలో దాచిపెట్టి నలుగురికీ చేర్చే ఆయుధాలొచ్చాక
అభిమానభంగానికి అర్ధంతో పాటు, గాయపు లోతూ కూడా ఇన్ఫెక్షనంత పెరిగింది.
కిలోల దేహాన్ని కొలిచే కిలోబైట్ల వ్యవహారం టెర్రర్ టెరాబైట్లలోకి మారుతున్నా
కళ్ళప్పగించి ఆ కళ్ళ ఆకలికి మరింత ఆజ్యం పోస్తునే వున్నాం.
కత్తిని తిడితే ఏమొస్తుంది డాక్టర్లా వాడలేకున్నా సరే
హంతకులు అడ్డంగా కొనివాడేస్తుంటే.
ప్రగతిని తిడితే ఏమోస్తుంది.
ఫలసాయం కోసంకాకుండా బులపాటంకోసం వాడేస్తున్నప్పుడు.
రండి మనమంతా కలిసి సెల్పీస్ తీసుకుందాం.
రండి మరోసారి ఆటో ఫోకస్ చేసుకుందాం.
అవీ ఇవీ అన్నికళ్ళూ కడుక్కునేందుకు మరికొన్ని స్వచ్చమైన కన్నీళ్ళను వెతుక్కుందాం.

28-06-2015
కవిసంగమంలో
కవిసంగమంలో
very nice kavita
రిప్లయితొలగించండి