ఈ మధ్యకాలంలో బాహుబలి సినిమాకోసం రగిలినంత మానియా
మరే అంశంలోనూ లేదేమో. నిజమే చందమామ కథనే కళ్ళముందు కట్టినంత దృశ్యసంభ్రమాలు
(విజువల్ గ్రాఫిక్స్), ఆకట్టుకునే కట్టుబొట్టు తీరులు, కట్టిపడేసేలాంటి
కొన్నిచోట్ల ఎమోషన్స్ రాజమౌళిగారే చెప్పినట్లు బిగ్గర్ దాన్ ది లైప్ డ్రీమ్
ప్రాజెక్టు గురించి. రాజుగారి వస్త్రాలు బాగున్నాయి బాగున్నాయి ముచ్చట్లకేం గానీ
చాలా ముఖ్యమైన సందర్బాల్లో మిస్ ఫైర్ అయిన లాజిక్స్ కొంచెం పలుకురాళ్ళలాగానే
తగులుతున్నాయి. ఇది సినిమా చూసిన తర్వాత నావరకూ నాకనిపించిన అంశాలు మాత్రమే.
అస్కార్ అంత ఎత్తులో ఎదురుచూడటం వల్ల కొంచెం ఉస్సూరనిపించడమే కానీ కొన్ని ఐస్
క్రీమ్ లు, బ్లడ్డు హిస్టరీలూ రెండుమూడుసార్లు కొనుక్కుని ఝడుసుకోవడం కంటే
పోల్చలేనంత మెరుగనేదీ నిజమే.
1) గరిభనాభి, అభిఘాతబలం గుణించకుండా మోసేయడమే?
ఈ సినిమా పోస్టర్లలో ప్రధానంగా కనిపించే చిత్రం
బాహుబలి శివలింగాన్ని మోస్తుండటం. నిలువెత్తు నల్లరాతి శిలావిగ్రహాన్ని చివరి అంచు
భుజానికి తాకేలా పెట్టుకుంటే భుజం కండరాలు కట్టుకావా అని అడిగితే చిన్న ప్రశ్నే, తనకు
మించిన బరువుని భుజానికి ఎత్తుకుని అంగలేయడం, ఆపై పూర్తిగా నీళ్ళలో ధభేలున దూకడం
వామ్మో ఏంది సామీ ఇది. ఇన్ని విభాగాలున్న మీకు కూసింత సలహాలిచ్చే ఫిజియోథెరపిస్టో,
ఫిజిసిస్టో దొరకలేదా? పోనీ సూపర్ హీరో అనుకుందామంటే అలాక్కాందంటిరాయే... పాత
సినిమా అయినా భూకైలాస్ లో సీనియర్ యన్టీయార్ శివలింగాన్నెత్తడం ఇంతకంటే పద్దతిగా
ఉందండోయ్..
2) గాలిపీల్చకుండానే తెల్లార్లూ బ్రతికేస్తారా??
ఇక పోతే రెండో ప్రధాన అంశం ఒక్క
చేతితో బాహుబలిని వాళ్ళ నాయనమ్మ రాజమాత శివగామిని దేవి కాపాడటం ఇది కూడా
పోస్టర్లలో సైతం ప్రధానంగా కనిపించేదే. రాత్రెప్పుడో ఆవిడగారు ఒకచేత్తో
కర్రపట్టుకుని ప్రవాహానికి కొట్టుకుపోకుండా మునిగిసైతం ఆగిపోయి(తలతోపాటు
ముక్కుకూడా మునిగిపోయింది) చేతిని పైకెత్తి బిడ్డని నిళ్ళలోమునగకుండా ఆపుతుంది.
ఉదయాన్నే కొండతెగవచ్చి బిడ్డని కాపాడిన తర్వాత నీళ్ళలోపటున్న ఆవిడ చనిపోలేదన్నట్లు
ఆ చేయ్యి కొండమీదకు చూపిస్తుంది. బిడ్డని
కాపాడిన వాడు కంగారులో పెద్దప్రాణం ఒకటుందని చేయిపట్టుకుని కాపాడలేదు
మర్చిపోయాడనుకుందాం. కానీ గాలి ఆడకపోయినా తెల్లార్లూ బ్రతికే వుంటారా లేదా అనే
విషయాన్ని స్క్రిప్టులో ఎలా మర్చిపోయారో? అదేదో సినిమాలో చూపించినట్లు ఏదన్నా
తామరతూడు ముక్కుకి పెట్టుకుని పైకి వదిలే ఏర్పాటులాంటి ఆలోచించినా బావుండేది.
3) వందడుగుల ఎత్తునుంచి వందలసార్లు పడ్డావిరగని ఎముకలంటే గ్రేటే కదా మరి !!!
బాహుబలి భూమ్మీద ఇప్పటివరకూ లేనటువంటి విశాలమైన
ఎత్తైన జలపాతం మీదకు పదే పదే ఎక్కటం, మారియో గేమ్స్ లో సెకండ్, థర్డ్ లైఫ్ లు
వుంటాయి లే అన్నట్లు మనం గ్రాఫిక్ బుడ్డోడిని దూకించినట్లు పుసిక్కిన ఉన్నపళంగా
దూరం దూకడం (హీరో కదా ఊపు కోసం మైనా వెనకదాక ఉరికెళ్ళిరావలసిన పనిలేదు.
ఉన్నచోటునుంచే దూకితే దూరంగా వెళ్లే ఊసు దానంతట అదే వచ్చేస్తుంది మరి) సర్లేండి
ఎంతయినా సినిమా కదా.
4) నీళ్లలో రాసే రంగా, పచ్చబొట్టా?
అవంతిక
చేతిమీద నీళ్ళలో వుండి బాహుబలి పాటప్రకారమైతే పచ్చబొట్టు, చూపించిన ప్రకారమైతే
కుంచెతో వేసిన రంగు. కానీ నీళ్ళలో వుండి వేసేలా వుండే ఆ రంగేమిటో,
వాళ్ళనాయనమ్మలాగానే మొత్తం బొమ్మ అయిన దాకా హీరోగారు కూడా వేరేసాధనాలేమీ లేకుండానే
గాలిపీల్చుకోకుండా వుండేస్తారు. అంతకు తగ్గట్లు పుల్ హాండ్స్ ధరించే సహచరి
వైశాలిని అవంతిక తన స్లీవ్ లెస్ మోడల్ చొక్కావేసి నీళ్ళదగ్గర అగంతకుడికోసం
కాపుకాద్దామనుకున్నప్పుడు పైన చెట్టెక్కి బాణం పట్టుకు కూర్చుంటే నీళ్ళలోకంటా
కనిపిస్తుందని ప్రేక్షకులు అర్ధంచేసుకోవాలన్నమాట. సర్లేండి లింకు పెద్దగా అవసరం
లేకుండానే దొంగలదీవిలో సురాహుషారుతో ఐటంసాంగు (ముగ్గురు స్కిన్ డాక్టర్స్) ఏసేసిన
డైరెక్టరు గారు, పచ్చబొట్లు లింకు పద్దతిలో వేసుకోవచ్చని చెప్పారుకదా అని
సర్దుకోవచ్చు.
5) బాహుబలిని బలితీసుకుంది ఎవరు?
వెన్నుపోటుతో
తనే చంపానని శివుడితో చెపుతాడు కట్టప్ప. కానీ భల్లాలదేవుడు దేవసేనతో మాట్లేడే
సందర్భంలో ‘‘మళ్లీ చూడాలని నువ్వూ, నా చేతులతోనే మరోసారి చంపాలని నేనూ
ఎదురుచూస్తున్నాం రెండూ తీరని కోరికలే’’ అంటాడు. మరి చంపింది బల్లాలదేవుడా, లేక
కట్టప్పా ఇద్దరూనా తెలియాలంటే బాహుబలి ది కంక్లూజన్ 2016 వరకూ ఆగాల్సిందే సుమా.
6) కాలకేయులు మాట్లడే కిలికి భాషను ప్రత్యేకంగా
తయారు చేసుకున్నారట 40 గ్రామర్ రూల్స్ తో తయారు చేసుకున్న 750 పదాల సెట్టు భీభత్స
భయానక రసం పండాలని తయారుచేసామని చెపుతున్న ఈ భాష చివర్లో లొట్టలు వేయడం మాత్రం
భాషానియమాల మాటెలా వున్నా కామెడీగా నవ్వుకునేందుకు మాత్రం బావుంది.
అబ్బో మరీ ఇలా కాలకేయుల డ్రస్సిగ్ లో వెంట్రుకలూ, మేకప్ లో నల్లరంగూ వెతుకుతూ వుంటే చాలా అవుతుందేమో కానీ విడివిడిగా సినిమాని ముక్కలు చేస్తే 60 లో 20 అద్భుతమైన సీన్స్ అనిపిస్తాయి కానీ కథగా చూస్తే సగం పెట్టిన భోజనం. కథ డిమాండ్ చేయడం వల్ల చేసిన గ్రాఫిక్ వర్క్ కాకుండా గ్రాఫిక్ వర్క్ చేయడం కోసం కష్టపడి అల్లుకున్న కథ, కథనాలు. పాతతరం ముచ్చట్లు చెపుతున్నట్లే వుంటూ కొత్తతరం కోరికల డిమాండ్ కు ఎక్కడా గండి కొట్టకుండా అన్ని కమర్షియల్ ఎలిమెట్లూ వుండేలా చూడాలన్న కలెక్షన్ తపన కావచ్చు. ఎందుకో మంచికూరలా వండిన సినిమాలో మషాలాల ఘాటేం ఖర్మ, ఉప్పూ కారం కూడా దట్టించి హోరెత్తించినట్లయ్యింది. ట్రాయ్, గ్లాడియేటర్స్ ను చాలా సందర్భాల్లో పోల్చుతున్నారు కానీ వాటిల్లో సీన్ పెట్టడం కోసం కథను మార్చారేమో అనే అనుమానం కలిగేంతగా అయితే లేవు. బాహుబలి అడిగినట్లు ఇంకా పెద్దది మరింత పెద్దది మీనుంచి కావాలి రాజమౌళి గారూ అది తమ్ముళ్ళందరి దాహం తీర్చేలా వుండాలి. అంత పైకం మా తెలుగు ప్రేక్షకుల దగ్గర కూడా వుందని ఇప్పటి కలెక్షన్లు చెపుతున్నాయి కదా తెరతీయండి. రాజ్యమా ఉలికి పడు అనేంతలా ఒక ఆస్కార్ మనకోసం ఎందుకుండకూడదని మేం మీ వైపే చూస్తున్నాం. నే..నె..వర్ని అని మాత్రం మీరడగొద్దు. ఓస్లా కూస్లా కుర్యే కుట్టా హ్టా......

#Baahubaliమంచి మషాలాలు దంచుదామనుకున్నందుకే వండిన కూర_______________________________________ఈ మధ్యకాలంలో బాహుబలి సిన...
Posted by Katta Srinivas on Saturday, July 25, 2015
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి