అవంతికా.... వాడంతే
ఆడగాలి తగిలితే చాలు.
ఆడగాలి తగిలితే చాలు.
తడారిపోని ఇసుకనేలలో ఆడనీడైనా పడితేచాలు,
పాక్కుంటూ, దూక్కుంటూ ఆఖరికి డేక్కుంటూ నైనా నీవున్న పైదాకా నీపైదాకా వచ్చేస్తాడు.
వాడెప్పుడూ అంతే అవంతికా
నీళ్లుకారుతూ జారిపోయే కొండలైనా సరే
పట్టుచిక్కక దుర్భేధ్యంగా నిర్మించిన బండరాతి కోటలైనా సరే
గుడ్డిగా అడ్డదిద్దంగా నరవాసన తగిలిన బెమ్మరాచ్చాసుడిలా
వెర్రెత్తిపోయిన కళ్ళుమూత తనంతో ఉరుక్కుంటూ వచ్చేస్తాడు.
సీతాకోకలు వాలిన నీ దేహంపై వస్త్రాలే లేవంటూ చేసే ఊహలు నిజాలుగా భ్రమిస్తూ ప్రమాదాలు అంచులపై పిచ్చిప్రకోపంతో గెంతుకుంటూ దూసుకొస్తుంటాడు.
అవంతికా.. నువ్వెక్కడో లక్ష్యంకోసం పోరాడుతూ వుంటావు.
అవంతికా.. నవ్వెక్కడో నీదైన భాద్యతలు మోస్తూ మంచిపేరుతెచ్చుకుంటుంటావు.

అవంతికా.. నిన్ను నమ్ముకుని నీవాళ్ళంతా నిశ్చింతగా అనుసరించే చెట్టువై నిలబడివుంటావు
అవంతికా, అగంతుక, అనామికా, అవనతా, అచేతనా, అనన్యిక,
అప్పుడిక వీడెంతో ప్రయాసపడి ఆయాసపడి నీదాకా వచ్చేస్తుంటాడు.
అనుమతేమీ లేకుండానే నీలోపట లోలోపటికి
నంగినంగిగా దొంగచాటుగా తొంగిచూసేస్తాడు.
నీ జీవితం నీదే కాదన్నట్లు నీమీద తనే నిర్ణయాలను రచించేసుకుంటాడు.
వాడంతే అవంతికా అలుసేమీ ఇవ్వకపోయినా అల్లుకుపోతుంటాడు.
అంతర్జాతీయ సమాజాలు
మంచినవ్వుల సేన్ లకూ ఐశ్వర్యాల రాళ్ళకు
నెత్తిమీద అందాల కిరీటాల కుప్పతొట్టెలను పెట్టి
అతిపెద్ద సంతల్లోపట పౌడరుడబ్బాలూ, స్నోలూ కాటుకడిబ్బీల యాపారాన్ని అమ్ముడుబోయేలా చేసుకున్నట్లు
ఆత్మాభిమానం కోసం బెదిరిపోయిన లేడిపిల్లలా పోరాడుతున్ననిన్ను
రెండుచేతుల మధ్యలో అదిమిపట్టుకుని మరీ
అడ్డమైన రంగులు పూసి ‘అధో’లోకాన్ని చూపిస్తాడు.
సౌందర్య ఉత్పత్తుల గిరాకీలు పెంచి సొమ్ముచేసుకున్నట్లే
వీడు చలాకీగా సొమ్ముల్నిమించి గుమ్మనంగా నిన్నే వమ్ముచేస్తుంటాడు.
అవును వాడంతే భాద్యతలు మోస్తున్న నీ చేతులమీదా
అలసటతో ఆదమరచి సేదతీరుతున్నావన్న సోయికూడా లేకుండా
చాపకింద నీరులా వచ్చి పిచ్చిరాతలు రాసిపోతుంటాడు.
పాములు పాకినా చలించని నీ భుజస్కందాల భాద్యతలపై
వెకిలితనాన్ని దొంగచాటుగా స్కలిస్తుంటాడు.
నీ నీడకు సైతం నీవు బెదిరేలా నీ వెనకగానే సంచలిస్తుంటాడు.
నీలో ఏం చూడాలో తెలియని వాడు నీ చర్మాన్నీ మాంసాన్నే ప్రేమిస్తుంటాడు.
అవును అవంతికా వాడంతే
మాతృస్వామ్య సమాజం వాడిని ఒక్కచేతితో కాపాడుకుంటూ,
కాలప్రవాహంలో ఊపిరాడక మునిగిపోయిన్నాటినుంచీ
మదిలోపట మదమెక్కిన తనంతో విచ్చలవిడిగా సంచరిస్తునే వున్నాడు.
వాడేకాదు వాడివాళ్లంతా అంతే అవంతికా
పదిలంగా పట్టుకునే పువ్వుల్ని పట్టి, పీకి గుట్టపోసి వికటాట్టహాసాల్ని అద్దుకుంటూ కరకరా నమిలేస్తారు.
దండయాత్రలో గెలిచిన రాజుల్లా, వ్యాపారంపేరుతో భారతదేశాన్ని దోచుకున్న ఆంగ్లేయుల్లా
ఏదోఒకరోజు నిన్ను సాంతం తన ఆధీనంలోకి కూడా తీసుకుంటాడు
ఆ తర్వాత మాత్రం చుట్టూ ఏముందో తెలియనంత హాయిగా ఈ దుష్యంతుడు ఆదమరచి నిద్రపోతాడు.
అవంతికా అప్పటికిక లక్ష్యంకోసం పోరాడే నీ శక్తి నీర్వీర్యమైపోతుంది.
ఏ ఝడిపింపుకైనా బేలవై వీడివెనకే దాక్కునే పరాధీనత నీదౌతుంది.
ఆఖరికి నీ లక్ష్యమే నీదికాదు వాడికే ఇమ్మన్నా
గుడ్డిగా నమ్మటం వినా నీవిక చేసేందుకేమీ మిగలదు.
నీకసలు అర్ధం అవుతోందా?
ఇటీజ్ నథింగ్ బట్ ఏ రేప్
నీకసలు తెలుస్తోందా?
ఇటీజ్ ఏ క్లియర్ థెప్ట్
అనుమతిలేకుండా చొచ్చుకురావడం దురాక్రమణే
దేశంలోకైనా దేహంలోనైనా
అందుకనే అవంతికా
చదువు,సామాజిక హోదాల సరిహద్దుభద్రతను
నువ్విక మరింత పఠిష్టం చేసుకోవాలి.
నువ్వంటే దేహం, రూపం మాత్రమే కాదు
లోపటమనస్సనేది ఒకటుందన్న స్పృహను చురుక్కున కలిగిస్తుండాలి.
అవంతికా అస్సలు నీకు నచ్చిన జీవితంలోకి ప్రవహించే స్వేచ్చ నీకే వుండాలి.
రంగుబొమ్మల బార్బీడాల్ లా కాక నిండుమనిషిలా నిలబడగలగాలి.
బండలను ఎత్తపడేసే నాయకశూరత్వమే కాక
నిండుగా నిలబడినీడనిచ్చే ఆత్మీయత నీదాకా వీస్తుండాలి.
విన్నపం : కేవలం ఒక సినిమాను మాత్రమే ఉద్దేశించి రాసింది కాదు. ఈ మధ్య విజయంసాధించిన ఒకానొక సినిమాలో ఒకానొక సన్నివేశాన్ని ఆధారంగా చేసుకుంటూ సమాజపు పోకడను గమనంలో వుంచుకుని రాసినది. విజ్ఞతతో విషయాన్ని ఈ కోణంలో కూడా ఒకసారి చూడండనేది నా విన్నపం.
అంతర్జాతీయ ఆడశిశువుల దినోత్సవం సందర్భంగా, ఒక్కరోజు ఆలస్యంతో SS రాజమౌళి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ....
అంతర్వేది కవిత్వపఠనం ఎంట్రీ కవిత, కవిసంగమంలో ప్రచురితం

Simply superb kudos katta srinivas garu
రిప్లయితొలగించండిబాహుబలి సినిమా చూసి ఎంత టైమ్ వేస్టని చికాకు కలిగిందో, అంతకు పదింతల చికాకు కలిగిందీ బహుథాబలి చదవాల్సి వచ్చాక.....
రిప్లయితొలగించండిIt is just a commercial stuff with graphics.
రిప్లయితొలగించండి