దడిగాడు వాన సిరా

పాత సినిమాల్లో రక్తంకూడా నల్లగా కనిపించేది.
అదేమిటో
మొహాలపై పులిమిన సిరా కూడా
ఇప్పుడు
ఎర్రగా భయపెడుతోంది.
కాదు కాదు
కాషాయంలా కలవరపెడుతోంది.
సుధీంద్ర కులకర్ణీ, సుబ్రతారాయ్ లదేముంది.
ఎలాగో శుభ్రం చేసేసుకుంటారు.
మనసుల తెలుపు
మాసిపోతున్నందుకు మాత్రం
మరింత భయంగా వుంది.
అయనా సరే వణికుతున్న నాకలం
‘‘దడిగాడు వానసిరా’’ అంటూ లోలోపలే గొణుగుతోంది.
సుడిగాడు తుగ్గక్ అయినప్పుడు
దిల్లీ యా దౌలతాబాద్
దిల్ తో సంభందం లేకుండా నడక నాలుగైదేళ్ళు సాగుతూనే వుంటుంది.
=21-10-2015 





కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి