ఈ వారం ఆఫ్ లైన్ తెలుగు టూల్స్ గురించి మాట్లాడుకుందాం.
నెట్ కనెక్షన్ లేకపోయినా మన సిస్టం లేదా ట్యాబ్ స్మార్ట్ ఫోన్ లలో తెలుగు టైప్ చేయగలిగితేనే మనకు ఎక్కువ ఉపయోగం అనుకున్నప్పుడు, నెట్ అందుబాటులో లేనిపరిస్థితుల్లోనే తెలుగు రాయాల్సి వచ్చినప్పుడు, ముఖ్యంగా కవులు రచయితలు లాగా తెలుగు టైపింగ్ తో ఎక్కువ అవసరం పడేవారు. పొద్దస్తమానం ఆన్ లైన్లోనే వుండి పని చేసుకోవాలంటే సాధ్యం కాదు. అలాంటప్పుడు ఈ ఆఫ్ లైన్ టూల్స్ అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో చాలా రకాలున్నప్పటికీ ముఖ్యమైనవాటిని, సులభంగా ఇన్ స్టాల్ చేసుకునేందుకు అనువైన జన్యూన్ సాప్ట్ వేర్లను మాత్రం పరిచయం చేస్తాను. వాటికి సంభందించిన స్క్రీన్ షాట్లు పిక్చర్స్ తో కూడిన వివరణలను ఆర్టికల్ కు అనుభందం గా చేసిన కామెంట్లలో గమనించగలరు. నిజానికి ఈ టెక్ సంగమం ఆర్టికల్ కామెంట్లు కూడా అంశాన్ని తెలుసుకోవడంలో ఉపయోగపడేవే అయ్యి వుంటాయి.
కొన్ని లింకులు కూడా క్లిక్ చేసేందుకు అనుకూలంగా ఇస్తూ వాటి స్క్రీన్ షాట్ లను జతచేయాలంటే ఇలా కామెంట్ బాక్సులుగా సులభం కాబట్టి టాపిక్ ను ఇలా కామెంట్స్ లో కూడా కొనసాగిస్తున్నాను. దీనివల్ల మరో ప్రయోజనం ఏమిటంటే మీకు ఉపయోగపడుతుందనుకున్న కామెంట్ బాక్స్ లోని అంశాలనే చదువుకోవచ్చు లేదా సపరేట్ గా సేవ్ లేదా షేర్ చేసుకోవచ్చు.
1) గూగుల్ ఇన్ పుట్ టూల్స్ నుంచి తెలుగు
.................................................................
డెస్క్ టాప్ లేదా ల్యాప్ టాప్ లలో ఈ విధానం బాగా పనిచేస్తుంది. ఈ క్రింద ఇచ్చిన లింకు నుంచి కానీ లేదా దీనిని పోగొట్టుకుంటూ గూగుల్ సెర్స్ లో google input tools telugu అని టైపు చేసి వెతికితే కానీ ఈ క్రింద లింకు దొరుకుతుంది. దానిని క్లిక్ చేసిన తర్వాత కేవలం నాలుగు స్టెప్పుల్లో కంప్యూటర్లో తెలుగు ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
1) https://www.google.com/inputtools/windows/లింకులోకి వెళ్ళండి
2) భాషల వరుస దగ్గర Telugu ను టిక్ చేయండి, షరతులు ఒప్పుకుంటున్నట్లు టిక్ చేయండి
3) ఆ తర్వాత క్రింద వున్న డౌన్ లోడ్ బటన్ నొక్కితే మీకు కావలసిన తెలుగు సాప్ట్ వేర్ డౌన్ లోడ్ అవుతుంది
4) ఆ సాప్ట్ వేర్ ను Install చేసేస్తే మీకు లాంగ్వేజ్ బార్ లో తెలుగు కనిపిస్తూ వుంటుంది. అదే మీరింకా xp పాత వెర్షనే వాడుతూ వున్నట్లయితే రీజినల్ అండ్ లాంగ్వేజ్ సెట్టింగ్స్ లో తెలుగు కనిపించేలా చేసుకోవాలి.
లాంగ్వేజ్ బార్ ఎక్కడుంటుందో తెలుసా లేదా స్క్రీన్ షాట్ పెట్టమంటారా?
అయితే దీనిలో ఇంగ్లీషు అక్షరాలను టైప్ చేస్తుంటే తెలుగు అక్షరాలుగా మారుతూ వస్తాయి. మీకు వేర్వేరు పదాలను ముందుగా ప్రిడిక్షన్ కావాలంటే అటువంటి సెట్టింగ్ కూడా దీనిలో చేసుకోవచ్చు. ఇందులో వున్న ఇబ్బంది ఏమిటంటే తెలుగు పదాలను ఇంగ్లీషు స్పెల్లింగులుగా ఊహించాల్సి రావడం. త,ట లాంటి అక్షరాలకు t అనే అక్షరాన్నే వాడాలి కాబట్టి అది క్యాపిటల్ వాడాలా? స్మాల్ లెటర్ వాడాలా లేదా h తో కలిపి వాడాలా వంటి విషయాలను గుర్తుంచుకోవాల్సి రావడం ఇబ్బందవుతుంది. బాగా అలవాటు పడ్డ చాలా మంది ఇప్పటికే ఈ కీ బోర్డును చాలా సులభంగా వాడేస్తున్నారు.
గూగుల్ ఇన్ పుట్ టూల్స్ తో టైపు ఎలా చేయాలి అనే అంశంలో Nallamothu Sridharగారు తయారు చేసిన విడియోను ఈ లింకులో చూడండి. విజువల్ గా ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలో సులభంగా అర్ధం అవుతుంది.
మరోలింకు నుంచి ఇదే వివరణ

2) ప్రింటింగ్ ప్రెస్ లలోనూ, ఆఫ్ సెట్ వర్క్ లలనోనూ ప్రొఫెషనల్ గా పనిచేసే చాలామంది వాడే కీబోర్డు APPLE కీ బోర్డు, పేజిమేకర్ కోసం అనూ ఫాంట్స్ వాడే వాళ్లు కూడా ఎక్కువగా దీనిని ఉపయోగిస్తున్నారు. @Veeven Veerapaneni గారు దీనిని అభివృద్ది చేసి తన వెబ్ (crossroads Koodali) లోనుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకునేందుకు అనుకూలంగా వుంచారు. Apple telugu Unicode keyboard అని సెర్చ్ చేసి కానీ క్రింద నేను ఇస్తున్న లింకులోకి వెళ్లికానీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
http://crossroads.veeven.com/.../25/apple-keyboard-layout/
దీనిని ఇన్ స్టాల్ చేసుకోవడం సులభమే పైగా ఆ సూచనలన్నీ వీవెన్ గారి వెబ్ పేజీలో కూడా వివరంగా ఇచ్చారు. ఇప్పుడు మీ ఆర్టికల్ ను టైపు చేసేందుకు నేను వాడుతున్న కీబోర్డు కూడా యాపిల్ యూనికోడ్ మాత్రమే. దీనిని కొంచెం మనసు పెట్టి జాగ్రత్తగా నేర్చుకోవడం వల్ల గత ఆరేళ్ళుగా నాకు చాలా ఆర్టికల్స్ ను చేతితో రాయాల్సిన పతి తప్పుతోంది. పైగా రాసిన దానికన్నా చాలా వేగంగా టైపు చేసుకోవడం కూడా కుదురుతోంది. కేవలం ఒక్క వేలు ఉపయోగించి అక్షరాలను వెతుక్కుంటూ టైపు చేసుకోవడం కాకుండా రెండు చేతుల వేళ్ళనూ శాస్రీయంగా పనివిభజన చేసిన పద్దతిలో సైకో మోటార్ స్కిల్ ను అలవాటు చేయడం ద్వారా ఇంగ్లీషు లాగానే తెలుగును కూడా చాలా వేగంగా టైపు చేసుకోవడం సాధ్యం అవుతుంది.
1) యాపిల్ కీ బోర్డు లే అవుట్ ఎలా వుంటుందో క్రింద జతచేస్తున్నాను. అలవాటయ్యేంత వరకూ దీనిని ప్రింట్ చేసి ఎదురుగా వుంచుకుంటే ప్రాక్టీస్ చేయడం సులభం అవుతుంది.
2) కొన్ని బ్రాండ్ లు తెలుగు కీబోర్డులు అంటూ ప్రత్యేకంగా అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు తెలుగుకోసం ప్రత్యేకంగా వేరే కీబోర్డును కొనుక్కోవలసిన పనిలేదు. కాకపోతే మీరుఇలా ప్రింటవుట్ అంటించుకోకుండా కీ బటన్స్ మీదనే ఇంగ్లీషుతోపాటు తెలుగు అక్షరాలను కూడా అచ్చేసి ఇస్తున్నారు. సాప్ట్ వేర్ వున్నప్పుడు మనం వాడేసాధారణ కీబోర్డు కూడా తెలుగు అక్షరాలను టైపు చేసుకునేందకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి