ఫోన్ కాల్ విసిగింపులకు చక్కని గుణపాఠపు నమూనా ఇది

సమయం సందర్బం లేకుండా ఫోన్లు చేసి మీకు హోం లోన్ కావాలా? కార్ లోన్ కావాలా? డాక్టరు సలహా కావాలా? ఇన్సూరెన్సు  కావాలా అంటూ విసిగించే టెలీ కాలర్స్ కి ఈయనెవరో కానీ తగినట్లు బుద్ది చెప్పారు. మొత్తగా మాట్లాడుతున్నట్లే అంటించాల్సిన అన్ని చురకలూ అంటించేసారు. అందుకేనేమో పేరుకూడా రామకృష్ణ అని చెప్పారు. అసలు టెలికం రెగ్యులేటరీ అధారిటీ వారి నిభందనల ప్రకారం, ఎప్పుడు పడితే అప్పుడు ఇలా కష్టమర్లని విసిగించడం, ఏదో ఒక నంబరుతో చేసేయడం, కుప్పలు కుప్పలుగా నంబర్లను కొనుగోలు చేయడం నేరం క్రిందకే వస్తాయి. కానీ వ్యాపారాభివృద్ధి ద్యాసలో ఈ నిభందనలన్నీ పిచ్చి కస్టమర్లకు ఏం తెలుస్తాయిలే అన్నధీమాతో మన సమాయాలను నంజుకుతీనేస్తున్న టెలీ మార్కెటింగ్ విధానాలకు ఈ మాత్రం చురక లేకపోతే జనాల్ని మరీ పీడిస్తారుసుమా. అందుకే సరదాగా ఒకసారి ఈయన గారి వీర ఉతుకుడు చూడండి.




ఇది మరోరకం గేమ్ ధనలక్ష్మీ యంత్రం వచ్చింది డబ్బులు కట్టాలంటూ చేసిన కాల్ కు అత్యంత అమాయకుడిగా చెప్తున్న సమాధానాలు నవ్వుపుట్టిస్తాయి. మనకి కూడా ఆయన అచ్చంగా అమాయకుడేనేమో అనే అనుమానం కొన్ని సార్లు వచ్చినా పేరు రాజేష్ ఖన్నా అనడం, ఆపేస్తున్నప్పుడల్లా పిచ్చిచేపను మరో ప్రశ్నగాలంతో నీళ్ళలోకి లాగటం గమనిస్తే హబ్బో ఈయన గడుసోడే అని తెలుస్తుంది. మధ్యలో ఒకచోట హేమండి ఇంతకీ మీ హింట్లో మగవాడు మీరా మీ హావిడా అని అడిగితే అదేనంటీ అస్సలు అర్ధం కాక తెగతికమక పడిపోతున్నానంటూ అమాయక చక్రవర్తి చెప్పిన గడుసు ఆన్సర్ వీలున్నప్పుడోసార ివినిచూడండి. మీరు నవ్వి తీరతారని నాది గ్యారంటీ.







కామెంట్‌లు