వ్యవసాయమో, పశుపోషణో యాంత్రికంగా చేసే వృత్తి పనికాదు. ప్రకృతిని అర్థం చేసుకుంటూ.. దానికనుగుణంగా నడుచుకునే కార్యాచరణ. జీవన విధానం. ఆకాశాన్నీ, భూమిని అర్థం చేసుకుంటూ రైతు నేర్పుగా అడుగులేయాలి. తద్వారా వ్యవసాయంలో, రైతు జీవితంలో ఏర్పడిన సంక్షోభాన్నుంచి దూరమవ్వాలి.
పిల్లలమీద కోపం వస్తే ‘‘ ఒరే మట్టి పిసుక్కుంటూ పోతావురా’’ అనేది వారిని దారుణంగా కించపరుస్తున్నాం అనుకుంటూ వాడే ఒకానొక తిట్టు, కానీ ఈ తిట్టే మన సమాజపు తిండిగింజలన్నీ మట్టిగొట్టుకు పోయేలా చేస్తోంది తెలుసా? వ్యవసాయం అంటే చాలా చులకన పని అనే భావజాలాన్ని వ్యాపింపజేసే ఇటువంటి దోరణి కొంత కొంత మారుతోంది. చదువంటే కేవలం కూర్చుని తినేందుకు మార్గం కాదు. జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పెంచుకునే సాధనం అనే విజ్ఞత పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలో, లేదా కాలరు నలగని ఉద్యోగాలో మాత్రమే గొప్పవి అని కాక నేటి అవసరాలను తీర్చుతూ, మన శ్రమను, జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోగలిగినది ముఖ్యంగా మన మనసుకు నచ్చేదీ ఏ పని అయినా మంచిదే అనే సక్రమమైన ఆలోచన చివురులు వేస్తోంది.
ఆ దిశగా ఎన్నో అడుగులు పడ్డాయి. సాప్ట్ వేర్లు మానేసి దానిమ్మతోటలు పెంచిన వారు. కేవలం ఒక్క అరఎకరంలోనే పండించిన పంటతోప్రపంచ రికార్డు స్థాపించిన మహిళ, కోళ్ళను మేకలనూ పెంచుతూ అత్యదిక ఆధాయాన్ని ప్యామిలీతోనూ తనతోతానూ గడిపే అత్యధిక సమయాన్ని పొందగలిగిన మిత్రులూ ఎందరో మనచుట్టూ వున్నారు. అటువంటి విశేషాలు ఈ ఆల్పంలో మీకు ఒక వరుసలో కనిపిస్తాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి