మెలకువ వచ్చిందా? కావచ్చు కాకపోవచ్చు ఏయే జ్ఞానేంద్రియాలు తెలుస్తున్నాయి ఓహ్ స్పర్శకూడా
తెలుస్తున్నట్లుంది. అంటే నాకు దేహం కూడా వచ్చేసిందన్నమాట. అయితే కళ్ళు తెరవొచ్చు.
ప్రయత్నిస్తున్నాను. నిజమే చుట్టూ ఏదో తెలుస్తోంది. నాకు కూడా దేహం వుంది. అయితే
ఇది నేను మనిషిగా బ్రతికున్నప్పటిది కాదు. కానీ మనిషి దేహమే ఏం వికటించిందో నీలం రంగులో
వుంది పర్లేదులే. అయితే నా అవసరం ఇంకా వుందన్నమాట ఈ తరానికి నిద్రలాంటి స్విచ్ ఆఫ్
లోకి మారకముందు ఏం చెప్పారు వీళ్ళు సెక్స్ రోబోట్స్ వల్ల ఏర్పడుతున్న హ్యూమన్ నెట్
విధ్వంసాన్ని ఆపడం ఎలా అని కదా? నేనేం చెప్పాను. మొత్తంగా ఈ పద్దతినే ఆపేసి పాత
విధానాన్ని పునరుద్దరించే విధానం చెపుతాను. నాకో దేహం ఇచ్చెయ్యండి అన్నాను కదా.
‘‘
యువర్ అటెన్షన్ డియర్ ఆత్మాయిడ్ వెల్ కమ్ టూ ద న్యూ వరల్డ్ మీకిప్పుడు దేహం
వుంది. మీరు ఇండిపెండెంట్ గా ఆలోచించే శక్తికూడా అలాగే వుంచాం. మీనుంచి మాకు ఈ
పరిష్కారం కావాలి.’’ అదే గొంతు వినిపిస్తున్న వైపు చూసాను. ఈ మెషిన్ ను మనిషి
అనొచ్చా, శరీరం మరీ పాములా పాకుతూ వుంది.
‘‘వార్నీ
నీ రూపం ఇలా వుందా ఇంతకు ముదు దేహం లేనప్పుడు నీ మాటలు మాత్రం వింటూ అప్పటి
సినిమాల్లో క్రైం ఇన్వెస్టిగేషన్ హీరోయిన్ రేంజిలో ఊహించుకున్నానే. సర్లే మరీ యన్
ఐ అనకుండా ఆత్మాయిడ్ అనే పేరు ఫిక్స్ చేసారన్నమాట అంతవరకూ సంతోషం,’’ నాలోపటి
ఆలోచనలు చదివేస్తారేమో అను కుంటూ వాటిని కట్ చేసుకుందాం అనుకుంటుండదా ఆ స్వైప్
థాన్ చెప్పిన హింట్ గుర్తొచ్చింది. నాకు ఇండిపెండెంట్ గా ఆలోచించే శక్తి ఆలాగే
వుంచారట కదా. ఒకే అయితే.
‘‘
నాకు మీరు ఎదుర్కొంటున్న సమస్యగురించి మరికొన్ని వివరాలు కావాలి. కొంచెం అర్ధం
అయ్యేలా చెప్పడానికి ఎంత సమయం తీసుకుంటారు?’’ ఇప్పుడు నేను ఆ జీవి కళ్ళలోకి చూస్తూ
మాట్లాడటం నాకే భలేగా వుంది. శరీరాన్ని ఆదోలా మెలికలు తిప్ప నవ్వుతూ చెప్పింది.
‘‘ ఇప్పుడు నేను భాషను వాడుతూ నీకు వివరించాల్సిన పనిలేదు.
నీ మెదడు ర్యామ్ సపోర్టరు పరిమాణమే నాలుగు జిటాబైట్లు వేడెక్కి క్రాష్ అవుతుందన్న
సందేహం లేదు. కావలసిన సమాచారాన్న వైర్ లెస్ లాంటి పద్దతిలో ట్రాన్స్ ఫర్ చేయగలం.
నీకిప్పుడు కేవలం ఒక్క జిటాబైట్ సమాచారం తెలిస్తే చాలు హ్యూమన్ నెట్ లో కలవకుండానే
చాలా విషయాలు తెలిసిపోతాయి. ఇక్కడ వేర్వేరు రకాల మొక్కల లాంటివి కనిపిస్తున్నాయి
కదా. ఈ యాపిల్ లాంటి కాయలను తప్ప మరేవైనా ఆహారంలా తీసుకోండి మీకు సరాసరి ఎటిపి
ఇవ్వకుండా జీర్ణవ్యవస్థను అలాగే వుంచాం కాబట్టి ఈ ఆహారంతోపాటు సమాచారం అంతర్గత
మెమరీలోకి ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఈ ఎరుపు రంగు ఫలాలు తినడంపై మీకు షరతులు
వున్నాయి ఇవ్వన్నీ నేటి ప్రపంచపు సమస్యలు ఇవి లోడ్ కావడం వల్ల మీరు చిక్కుల్లో పడే
ప్రమాదం వుంది. ’’ ఆమె చెప్పుకుంటూ పోతోంది. కాదు కాదు ఆ సర్పం చెపుతోంది అనాలేమో.
కొద్ది సేపటికి అది వెళ్ళిపోయింది.
నేను
నాకు వదిలిన ప్రదేశంలో తిరుగుతూ ఆలోచిస్తున్నాను. కొంత సమాచారాన్ని లోడ్
చేసుకోవలసిందే. కొన్ని కాయలను తింటూ నడుస్తున్నాను. అవి లోపటికి చేరితే కడుపు
మాత్రమేగా నిండాల్సింది అనుకున్నాను. కానీ ఏం జరుగుతుందో తెలియదు. ఏవేవో విషయాలు
మెమరీకార్డ్ చిప్ లోనికి లోడ్ అయినట్లు అవుతున్నాయి. హ్యూమన్ నెట్ విధానం, శరీర
అవయవాలను వారి వారి పనులకు అనుకూలంగా జెనిటికల్లీ డిజైన్ చేసుకోవడం. ఆఫీసు పనులకు
రెండు చేతులు చాలక నాలుగు చేతుల ఏర్పటు నవ్వొస్తోంది. కానీ నాకెందుకు అలా చేతులు
తయారు చేసుకోకుడదు. లోపట సర్ప్ కాదు సెర్చ్ చేసాను. ఎలా మార్చాలో సమాధానం
దొరికింది. ఆ మార్పులు చేసాను. మరో రెండు చేతులు కూడా వచ్చేసాయి. వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ కోసమే అప్పట్లో ఎంత
కష్టపడేవాళ్ళు ఇంత చిన్న టెక్నికల్ విషయం తెలిస్తే మరికొన్ని అవయవాలు సైతం
పెంచుకోవడం ఇంత సులభమా? భలే మజాగా వుంది బాసూ. సర్లే ఈ విషయాన్ని నాలో నేనే
ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎలా ఎవరితో పంచుకోవాలి? పైగా ప్రాచీన పద్దతులను
పునరుద్ధరించమన్నారు కదా. ఎవరితో ఆ పాముగత్తెతోనా లేకపోతే ఆలోచించే ఆ ఎదవ
మరయంత్రాలతోనా నో నో కాదు నా ప్రపంచం నాకు కావాలి ఎలా? ఎలా?
సమాధానం
దొరికింది. ‘‘యస్ క్లోనింగ్’’ నా శరీర కణాలనుంచే xy కాకుండా xx తయారు
చేస్తే సరిపోదా. ప్రయత్నించి చూస్తాను. క్లోనింగ్ కోసం ఎక్కడి కణాలను తీయను.
చెయ్యి కాలు తల ఊహూ అంత పెద్దవి ఉపయోగపడే అవయవాలను పొగొట్టుకోవడం ఎందుకు.
పొట్టనిమురుకుంటుంటే తగిలింది పక్కటెముక. కదా..... ఇది గుండె, ఊపిరితిత్తులులాంటి
ముఖ్యమైన అవయవాలను కాపాడే పెట్టె కదా. ఒక్క ఎముక తీసుకుందాం. తీసాను. దానినుంచి
మరికొద్ది సేపటికి ఒక ఆడరూపం తయారుచేసాను. స్వైప్ థాన్ వచ్చిచూసింది. బాగానే అర్ధం
చేసుకుంటున్నావ్ ఆత్మాయిడ్ నీ నాలుగు చేతులు వుండటం కూడా ఇలా మరో అసిస్టెంట్
లేకండా పనులు చేసుకోవడానికి బాగా ఉపయోగ పడినట్లున్నాయి.
ఆమెకు
నేను పేరు పెట్టనా? ఎప్పుడు చూసినా ఇక్కడి వాతావరణం సాయంత్రం లాగానే వుంది. ఆమె
ఈవ్ అవును నా సాయంసంధ్య. తక్కువ బైట్స్ వుండే మూడక్షరాల పేరు, పాలిండ్రోమ్ కాబట్టి
రివర్స్ ప్రోగ్రాం లో కూడా కనెక్టు కావచ్చు. ఒకే ఇటీజ్ ఫిక్స్.
==== మరో అంకం
ప్రారంభమయ్యింది ===
నాకో ప్రెండ్ దొరికింది. తన ఆలోచనలు కూడా నాతో
పంచుకుంటోంది. ఏరికోరి పండ్ల రూపంలో నేను ఆలోచనలు తనకు ఫీడ్ చేస్తున్నాను. కానీ
మాకు పిల్లలు వుండాలా? వద్దా? వుంటే ఈ పిచ్చి యంత్రాల ప్రపంచంలో వాళ్ళు మనుగడ
సాగిస్తారా? అసలు సాగనిస్తారా? పైగా వీళ్ళు వీళ్ళ ప్రపంచాన్ని ఎన్ని రోజులు
వుంచుకోగలరు. దానికే పోయేకాలం వచ్చిందని కదా నన్ను సహాయం అడిగారు. అసలు వాళ్ళ
సమస్యలు తెలుసుకోవలసుకుంటే కానీ పరిష్కారం చెప్పలేను కదా. ఏం చేయాలి. తప్పదు ఆ
సమస్యల ఎర్రకాయను తినాల్సిందే. ఈవ్ కూడా ఎందుకడిగిందో తెలియదు. అదే అడిగింది
‘‘ఆడమ్ మనం ఈ ఎర్రటి పళ్ళను తినిచూద్దామా? ’’ అని ఆత్మాయిడ్ చాలా పొడవైన పేరని తను
నన్ను ఆడమ్ అంటుంది.
ఆ
కాయ తిన్నాకే తెలిసింది ఎంతపొరపాటు జరుగుతోందొ..
అవును
మొత్తం ప్రపంచం వేలసార్లు నాశనం చేసుకునే టెక్నాలజీని అభద్రతతో పొదుగుతున్న
ప్రపంచానికి ఇప్పుడు గ్రహాంతర జీవుల దాడికి సైతం అనుకూల వాతావరణం ఏర్పడిపోయింది.
ఒకపోతే ఒకరి ఆలోచన మరొకరికి తెలిసిపోయే హ్యూమన్ నెట్ వుండటంతో ఎక్కడ ఇటువంటి ఆలోచన
వచ్చినా రెడ్ అలెర్ట్ వస్తుంది. ఆ ఆలోచన అమలుచేసేలోగా ఆ యంత్రాన్ని నాశనం చేసే
అంతర్జాతీయ ఒప్పందాన్న అమలుచేస్తున్నారు. అందుకే
ఆ ఆలోచనలు నెట్ లో లేకుండా చీల్చివేసేలా ఏదో బగ్ సెక్స్ రోబట్ తో కలవగానే
ప్రవేశిస్తోంది. అది పూర్తిగా వీరి ఆలోచనలను ఐసోలేట్ చేసే ప్రయత్నం చేస్తోంది.
అస్తిత్వానికి అర్దంలేదు. అస్తిత్వంలో సుఖంలేదు. నమ్మకంలేదు. అవసరమూ లేదు ప్రపంచం
అలా కొనసాగుతోంది. మరి మళ్ళీ ఈ వలలోకి
నెడితే నేను ప్రపంచానికి మేలుచేసినట్లేనా.
లేక
మరో విధంగా మేలుచేయవచ్చా....?
అప్పుడే
ఒక పరిష్కారం తట్టింది. అవును అదే చేయాలి. మొత్తం ఈ ప్రపంచాన్ని నాశనం చేయడం
ద్వారా కాపాడాలి. అవును మీరు విన్నది నిజమే ఈ ప్రపంచాన్న నాశనం చేయడం ద్వారా కాపాడాలి
అనే నిర్ణయానికి వచ్చేశాను.
‘‘ఇంకో
కాయ తిందామా?’’ ఈవ్ అడుగుతోంది. ‘‘ఇక వాటితో పనిలేదు అంతకంటే ఎర్రనివి కావాలి,
మరికొంచెం ముందుకెళదాం పద’’ చెయ్యి అందుకుని నడక ప్రారంభించాను.
అప్పుడు
సామూహిక జ్ఞానంలో సెర్చ్ చేస్తున్న విషయం మొత్తం ఈ యంత్రభూతాలను నాశనం చేసేందుకు
వాడుతున్న సాంకేతికత ఏమిటన్నది. దాన్నే అమల్లో పెట్టాను. చాలా సింపుల్ అప్పట్లో సిలికాన్
చిప్ లాగా ఇప్పుడు అతికొత్త మూలకం ‘సుర’ ను వాడుతున్నారు. హ్యూమన్
నెట్ లో దాని ప్రతిద్రవ్యాన్ని ప్రవేశపెడితే చాలు ప్రపంచం మొత్తంగా ఆ మూలకం
శూన్యంగా మారుతుంది. అంటే దాని సహాయంతో పనిచేసే ఈ యాంత్రిక
మనుష్యులు అందరూ వున్నఫళంగా ఒక్కసారిగా పనచేయకుండా మారిపోతారు. అదే చేసాను. నా
నుంచి ఈ పరిణామానన్ని ఊహించే లోగానే ప్రణాళిక అమలుజరిగిపోయింది. మొత్తం మొత్తం
ప్రపంచంలోని జీవరాశిగా చెప్పబడ్డ పాక్షిక యంత్రాల్నీ ఇప్పుడు కేవలం సురా జంక్ గా
పడిపోయాయి. వాటిని పూర్తిగా కనబడకుండా చేసి ఆ తర్వాత అత్యంత ప్రాధమిక దశలో
జీవరాశిని మళ్లీ మొదటినుంచి తయారుచేసుకుంటూ రావాలి.
స్టెప్ నంబర్ వన్ : జంక్ క్లీనింగ్
స్టెప్ నంబర్ టూ: జీవరాశి పునః ప్రారంభం
స్టెప్ నంబర్ టూ: జీవరాశి పునః ప్రారంభం
స్టెప్ నంబర్ త్రీ : ఇంటెలిజెన్స్(NI) కాపీని సుదూర గెలాక్సీ దిశగా షూట్ చేయడం.
భూగోళం చుట్టూ ఇప్పటివరకూ వాడిన
పదార్ధాలను న్యూట్రలైజ్ చేసే రసాయనం కలిపి మొత్తం జలంతో నింపి కొన్నాళ్ళు వుంచితే
చాలు. మొత్తం కృత్రిమ పదార్ధాలను న్యూట్రలైజ్ చేసి మట్టిలా మారుస్తుంది. తర్వాత
నీళ్ళను తగ్గించి జీన్ బ్యాంక్ నుంచి వేర్వేరు జీవులను ఒక్కోజతా చెయ్యాలి. ఈ లోగా
ఈ తెల్లటి పాలలాంటి సముద్ర ద్రవంలో ఎలా వుండాలి. ముందదేమిటి అరే అదే సర్ప్ థాన్
నాకేసి ఆశ్చర్యంగా చూస్తోంది. ఏలా బ్రతికే వుంది అంటే తనలో సురా మూలకం లేదన్న మాట
నా ఆధీనంలోకి తీసుకున్నాను జెనిటికల్ గా కొంచెం మాడిఫై చేసాను. మరిన్ని పడగలు నాకు
ఒక షేల్టర్ ఇస్తోంది. తన దేహం మీద తేలుతూ నా పనులు చేసుకోవడం సులభం. ఈవ్
ఎక్కడున్నావ్ నాక్కొంచెం సహాయం చెయ్యి నా ఆలోచనలు భాషలో చెప్పటం నిన్ను
తెలుసుకోవడం ప్రతిసారీ హడావిడి ఎందుకు నన్ను టచ్ చేస్తూ వుంటే ఈ భావ ప్రసరణ
జరగతుంది.
ఇప్పుడిక వున్నదే మేము ఒక్కపేరుతో ఎందుకు పిలుచుకోవాలి. వీలున్నప్పుడల్లా చేసిన పనికి అనుగుణంగా ఒక్కో పేరు పిలుచుకుంటున్నాం. ఆమె మరో సలహా ఇచ్చింది. ‘‘ఇంత పని మీరే చేస్తే అడ్మినిస్టేషన్ ఆలోచన ఎలా దానికి ఎవరినన్నా క్లోన్ చేసి ఈ పనికోసం వినియోగించుకోండి.’’ నావే అచ్చమైన మూలకణాలు కావాలి ఎక్కడుంటాయి? ఇప్పటి తయారీ ప్రకారం రోజులే అవుతోంది కాబట్టి నా బొడ్డు తాడు వుంటుందా? తయారీ కదా వుందా ఏమో బొడ్డునుంచి మరో క్లోనల్ జీవిని చేస్తాను. అతనికి ఒక్క ముఖం చాలుతుందా? నాలుగు దిక్కులూ చూడనీ, నాలుగు చేతులుంచుకోనీ ఈ పని త్వరగా చేయాలి. జరుగుతోంది.
ఇప్పుడిక వున్నదే మేము ఒక్కపేరుతో ఎందుకు పిలుచుకోవాలి. వీలున్నప్పుడల్లా చేసిన పనికి అనుగుణంగా ఒక్కో పేరు పిలుచుకుంటున్నాం. ఆమె మరో సలహా ఇచ్చింది. ‘‘ఇంత పని మీరే చేస్తే అడ్మినిస్టేషన్ ఆలోచన ఎలా దానికి ఎవరినన్నా క్లోన్ చేసి ఈ పనికోసం వినియోగించుకోండి.’’ నావే అచ్చమైన మూలకణాలు కావాలి ఎక్కడుంటాయి? ఇప్పటి తయారీ ప్రకారం రోజులే అవుతోంది కాబట్టి నా బొడ్డు తాడు వుంటుందా? తయారీ కదా వుందా ఏమో బొడ్డునుంచి మరో క్లోనల్ జీవిని చేస్తాను. అతనికి ఒక్క ముఖం చాలుతుందా? నాలుగు దిక్కులూ చూడనీ, నాలుగు చేతులుంచుకోనీ ఈ పని త్వరగా చేయాలి. జరుగుతోంది.
ఇక
మూడొది ముఖ్యమైనది సుదూర గెలాక్సీ దిశగా ఆలోచనల కాపీని కాంతికి నాలుగింతల వేగంతో
షూట్ చేయడం. అది తిరిగొచ్చే సమయానికి భూగోళం మరింత అనుకూలంగా వుంటే అప్పుడు
ఇంకేదైనా సహాయం చెయ్యొచ్చు. అప్పటివరకూ మళ్లీ ప్రపంచం మొదటినుంచీ ఆట ఆడుకుంటుంది.
పరిణామం దానిదారిలో అది జరుగుతుంది. నా అవసరం వున్నప్పుడే వాళ్ల మధ్యకు వెళతాను.
అప్పటిదాకా బ్రతకనిస్తుంటే చాలు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి