దోస్తులందలికీ మాండలిక భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మన జాతీయ గీతాన్ని దేశమంతా ఒకలాగానే పాడతరు కానీ ప్రతిజ్ఞ మాత్రం వారి వారి రాష్ట్ర భాషలలో చేస్తరు. అవును మరి ఒక ఒట్టు వేస్తాన్న మంటే దానికి కట్టుబడి ఉండాల్న వద్దా? అట్లుండాలంటే ముందుగల అదేందో తెలవాల్న వద్దా? మరి మనకి సుత సమజయ్యే టట్లు దేశం కోసం ఒట్టు వేయాలంటే గిట్లుంటే ఏమయితది? వుండాలనుకుంటే నేను సరిగా రాయలేని చోట కొంచెం చెయ్యి చేసుకోండి. చూద్దాం ఒకవేళ ఇదే పనికొస్తదేమో√√
పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి శనార్థులతో.
కట్టా శ్రీనివాస్ || ఒట్టు ||
నే పుట్టిన దేశమంటే నాకు తల్లి లెక్క. దేసపోళ్ళందరూ నా అన్న దమ్ములు, అక్కసెల్లెళ్ల లెక్క. దేశమంటే మస్తు నా పానానికి పానం లెక్క.
డబ్బు దస్కమున్న, జోర్డార్ గున్న నా దేశపు ఇలాకా ఖాన్ దాన్ గట్లా నా పూరా ఖుష్ ఐతది.
దీనికి అర్హత(?) పొందడానికి నేను మస్తుగా పాటుపడతా
అయ్యా అమ్మల్ని పంతులోరిని, పెద్దోళ్ళందరిని ఇజ్జత్ గా జూస్తా.
పతోళ్ల తోనూ బరాబర్ మంచిగుంటా.
దేశానికీ జనానికి సాయత ఉంటానని ఒట్టేసి చెప్తన్నా.
ఆళ్ళఅందరు సుకంగుండుడే నాకు సుతా సంబురం.
|| ప్రతిజ్ఞ ||
భారతదేశం నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం.
దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను.
నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.
09-09-2018 (ఆదివారం)
ఫేస్ బుక్ లింకు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి