కట్టా శ్రీనివాస్ || తడిలేని పాదు ||
జనాలతో కలిసేదారిలో
కరుకుముళ్ళు రాఁక్కు పోతున్ననోప్పి.
పదునెక్కిన దృక్పధాలు
గిడసబారిన మనసులు
తుప్పుపట్టిన భావాలు
కలివిడిగా వుండేలోగానే కలుక్కుమనిపిస్తున్న నొప్పి.
గుచ్చుకుంటున్నందుకు కాదు
మెత్తగా మార్చలేకపోతున్నందుకు
నొప్పి.
మెత్తబరిచే తడి ఊటే లేనందుకు నొప్పి.
మెత్తబడితే పదునులోకంలో బతకలేమనే ముళ్లపొదలు ఏపుగా పెరిగినందుకు నొప్పి.
గిడసబరిచే కేంద్రాలు లాభాల్లో తేలుతున్నందుకు నొప్పి.
బండలను ఢీ అంటూ పగలగొట్టే
గుండెల్లో సన్న ఊట చెలిమైనాలేనందుకు నొప్పి.
ఊట అనవసరం అనేదే పెద్ద పాఠం అయినందుకు నొప్పు.
ఇంతకంటే ఏమీ చెప్పలేనందుకు....
తేదీ: 21-09-2018

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి