1
మొక్క ఒకటి మౌనంగా తలూపుతోంది.
..
జీవితంలోంచి జీవం కరిగిపోతే
బ్రతికేవుంటామేమో కానీ
గడిచే ఏ క్షణంలోనూ ఆసక్తి మెరుపు ఉండదు.
జీవం అంటే ఏంటో తెలుసుకుందామని స్పటికపు కళ్లలోతుల్లోకి ఎంతసేపో చూస్తుంటాను.
మొక్క ఒకటి మౌనంగా తలూపుతోంది.
..
జీవితంలోంచి జీవం కరిగిపోతే
బ్రతికేవుంటామేమో కానీ
గడిచే ఏ క్షణంలోనూ ఆసక్తి మెరుపు ఉండదు.
జీవం అంటే ఏంటో తెలుసుకుందామని స్పటికపు కళ్లలోతుల్లోకి ఎంతసేపో చూస్తుంటాను.
2
కష్టజీవి నడుస్తూ నవ్వుతున్నాడు.
..
టూత్ పేస్ట్ లో ఉప్పు వుందో లేదో
బతుకులో లైఫ్ ఉందా?
బతకడాన్నే జీవించడం అనుకుంటున్నామా?
లైఫ్ లైన్లు వాడుకునే హడావిడిలో
లైఫ్ అంటే ఏమిటో అసలు పట్టి చూడటమే లేదా?
అక్షరమే ఎరగని చెమటచుక్క దర్పంతో ఎలా ఉందా అని ఆశ్చర్యపోతుంటాను.

3
పండు ముసలి మందహాసం గుండెల్లో పరచుకుంటోంది.
..
కరెంట్ తీగ అనాలంటే లోహం ఉంటే చాలా?.
కనబడకుండానే ప్రవహించేది పనిచేసేది ఒకటుండాలి కదా!
అనుభవమంతా రాసిపోసుకున్న దేహపు మిగిలిన నడకలో వెలుతురు ఏమిటో అర్ధం కానే లేదు నాకు.

4.
పిట్ట గూడు కట్టుకుంటూ కిచ కిచ మంటోంది.
..
పొట్ట, నాలుక, జేబు, చర్మం, ఇనప్పెట్టె, పాస్ పుస్తకంలో అంకెలు లాంటివే చోదక శక్తులయినప్పుడు
దేహారాధన దానితో పాటే ముగిసిపోతుంది.
నీ సంతోషాన్ని వేరే మనసుల్లో విత్తనాలుగా నాటిచూడు.
అనేక నువ్వులు నీ తర్వాత కూడా భలే పచ్చగా నవ్వుతుంటాయి.
వేలాడుతున్న బరువులని విసిరేశాక రోజుని హాయిగా ఈది చూడు, ఉల్లాసం నీ వెంటే పరిగెడుతుంటుంది.

నోట్లు తెలియక, భాషే రాక, ఆస్తులు లేక అచ్చమైన జీవితం ఒకటి నిజంగా ఉంటుందా?
5.
చిట్టిపాప బోసినోటితో ఆదమరచి నవ్వుతోంది
..
గ్రాంఫోన్ ప్లేటు గానుగెద్దు పతాక చిహ్నాలుగా రెపరెప లాడుతుంటే పనినడుస్తున్నట్లే ఉన్నా పస ఉన్నట్లు కనిపించదు.
పైరగాలి, పైటగాలి, పిట్టకూత పరవశాన్నివ్వకపోతే
వశం వరమా? శాపమా?
నిన్ను అసలు నడిపించేది ఏమిటి?

6.
సిద్ధార్థుడే చూస్తాడా? వేర్వేరు దృశ్యాలు
సమయం ఉంది బుద్ధా!!
చుట్టూ చూస్తూ నడువు.
సిద్ధార్థుడే చూస్తాడా? వేర్వేరు దృశ్యాలు
సమయం ఉంది బుద్ధా!!
చుట్టూ చూస్తూ నడువు.
సరే సరే...
ఇదంతా గందరగోళంగా ఉందా
కంగారేమీ పడకు మిత్రమా
జీవితం అంతే గజిబిజి గానో బిజీ గానో ఉంటుంది.
ఇదంతా గందరగోళంగా ఉందా
కంగారేమీ పడకు మిత్రమా
జీవితం అంతే గజిబిజి గానో బిజీ గానో ఉంటుంది.
చిట్టిపాప, పిట్టగూడు, కష్టజీవి పచ్చనాకు, పండుటాకు అన్నీ నీ చుట్టూతానే ఉన్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి