కొనుగోలు మార్కెట్లను ఊపేస్తున్న #ఆహారప్రవక్తలు
#KattaSrinivas
మీరు ఆరోగ్యంగా వుండాలంటే ఇలాంటివి ఈ విధంగా తినాలి, లావుగా వున్నారా? వెంటనే తగ్గాలా? షుగర్ వ్యాధి చిటికెలో పోవాలా? డాక్టరుతో పనిలేకుండా యాక్టివ్ గా వుండాలా? ఈ టాపిక్ తో వస్తున్న ఉద్యమాలు జనం ఆరోగ్యస్ప్రుహను అనేక విశ్వాసపు ఆచరణల గాడుల్లో నడిపిస్తున్నాయి. ఒక్కో ఉద్యమం మర్కెట్లోను కొన్ని వస్తువుల వినియోగాన్ని అమాంతం ఎన్నోరెట్లు పైకి లేపుతున్నాయి. అయితే ఇందులోనూ కొన్ని గందరగోళాలున్నాయి. మాంసం గుడ్లు అసలు తిననే వద్దంటారు ఒకరు, అవే ఆరోగ్యానికి మంచిదంటారు మరొకరు. తేనే కొబ్బరినీళ్ళు, గోధుమ రొట్టె భలే మంచిదంటారు ఇంకొకరు, అసలవి డైట్ లోవున్నంతకాలం వాడనే కూడదంటారు మరోకరు. డాక్టర్లలో చాలామంది డబ్బుల మనుషులు వాళ్ళు చెప్పిందాంట్లో చాలా తప్పులే అనేసారు చేదుమందుబిళ్ళల వెగటును ఈ మాటలు మరింత బలపరిస్తే ఇప్పుడొచ్చిన కొత్త సందేహాలు ఎలా తీర్చుకోవాలో అర్ధం కాదు. కనీసఆరోగ్యకాముకలకు. అసలే ఆహార కల్తీ ప్రపంచం, ఆపై బోలెడంత కాలుష్యం, అడ్డదిడ్డమైన వాతావరణం ఎప్పుడెంత ఎండ చలి తీవ్రత వాన రాకడ అర్ధంకాని పరిస్థితులు పైగా ఉరుకుల పరుగుల జీవితాలు. పోనీ వాకింగ్ ఒక్కటన్నా చేసుకుని సంతోషపడదామా అంటే అదే సర్వరోగనివారిణి అని ఎంతబాగా అంటున్నారో మరోమూలనుంచి అసలు కీళ్ళు అరిగిపోయే ప్రధాన కారణం అదేసుమా జాగ్రత్త అంటారు మరోమూల. ఈ నేపద్యంలో తినేందుకు ఖర్చుతప్ప్రదు ఎవరన్నా ఆరోగ్యంగా వుండేందుకు మంచివిధానం చెపితేబావుండనే కోరిక తీవ్రతను ఇప్పుడెన్నో విధానాలు తాముగీసిన గాడుల్లో పరుగులుపెట్టిస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా ఒకటి రాగానే మరింత ఆకర్షణీయంగా వుంటోంది దానిలోని లోపాలు ఇబ్బందులూ ప్రచారం అయ్యేంత వరకూ మరొకటి రీప్లేస్ చేసేంత వరకూ అది ఒక స్థాయిలో వుంటోంది. ఎంతగా అంటే ఈ ఆహార ప్రవక్తలు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే సులభంగా పేరు అర్ధం అయ్యేంత పాపులారిటీ వేరే ఖర్చులేవీ లేకుండా వచ్చేస్తోంది. పైగా ఈమధ్య ఆధునిక ఫోన్లూ వాటికి సులభమైన రేటులో నెట్ సదుపాయం వచ్చిన నేపద్యంలో ఇది మరీ సులభం అయ్యింది. విషయం వినాలనుకున్నవారు వేదకల దగ్గరకే వెళ్ళాల్సిన పనిలేదు. వీళ్ళు కష్టపడో ఖర్చుపెట్లో పత్రికలూ, టీవి లపై ఆధారపడాల్సిన పనీలేదు. యూట్యూబ్ విడియోలూ, సోషల్ మీడియాలో సమాచారాలూ కాంతివేగంతో దూసుకుపోతున్నాయి. ఒక్క వాట్సప్ విడియో మారుమూల గ్రామీణ మహిళను ఉన్నపళంగా ప్రముఖ గాయనిగా మార్చి సినిమాల్లోనూ, టివీకార్యక్రమాల్లోనూ, సామాజిక మాధ్యమాల లోనూ ప్రముఖురాలిగా స్థానం కల్పించింది. అదే కోవలో ఆహారవిధానాల ప్రచారాలు కూడా ఇప్పుడు వేగంగా జనంలోకి దూసుకుపోతున్నాయి. దీన్ని ప్రారంభించినవాళ్లే ఆశ్చర్యపోయేంత విస్త్రుతమై మార్కెట్ పై సైతం తమ విరాట్ రూపం చూపిస్తున్నాయి. సరే కొనుగోళ్ళు ఖర్చులు డబ్బుల సంగతి అలాపెడదాం. వృధాలోకి ప్రవహించే అనేక కష్టపు చుక్కలలో ఇది మరొకటి అనుకుందాం కానీ ఆరోగ్యంపై సరాసరి ప్రయోగాలు చేస్తున్నప్పుడు చిన్నపొరపాటువల్ల తప్పుడు అవగాహనవల్ల, తొందరపాటు నిర్ధారణలవల్ల ఆచరణలోకి వచ్చిన విషయం దీర్ఘకాలంలో దుష్పలితాలను ఇస్తే ఎలా? దానిపై భాద్యత ఎవరు వహిస్తారు? శాస్త్రీయంగా ఇటువంటి కోర్సులు చదువుకున్నవారు పెద్దగా పట్టించుకోరు. ఆహారకల్తీ చట్టాలుంటాయి, ఆరోగ్య సంరక్షణ చట్టాలుంటాయి. మెడిసిన్ అండ్ డ్రగ్స్ యాక్ట్ లుంటాయి కానీ అసలు ప్రభుత్వంకానీ ఆరోగ్య శాఖ కానీ కుంభమేళాలకో, తిరునాళ్ళకో స్పందిచినట్లు కూడా ఇటువైపు చూడాలనుకోదు. కనీసం నిపుణుల ఆధ్వర్యంలో ఒక కమిటీ కానీ, ప్రయోగ పరీక్షలకు ప్రాసెస్ చెయ్యడం కానీ తమ భాద్యతగా ఏలినవారు భావించరు. తమ ఓట్లపై ప్రభావం చూపని విషయాలపై దృష్టిపెట్టడమే ఒక తెలివితక్కువ పని అన్నట్లు తమ వలలూ గాలాలూ అల్లుకునే పనుల్లో నిరంతరం బిజీగానే వుంటుంది. డైట్ ప్లాన్ ఎంత క్రేజీగా వుంటే అంతపాపులర్ అవుతున్న చిట్కా నేపద్యంలో రేపెవ్వరో వచ్చి కీటోడైట్ లాగానే ఆల్కహాల్ డైట్ ని భుజాన వేసుకుని ప్రచారం చేసారనుకోండి. నిజమేనండీ ఆల్కహాల్ డైట్ తమాషాగా అనడంలేదు వీలయితే నెట్ లో వెతికి చూడండి . అప్పడు హమ్మయ్యా ఆబ్కారీ ఆదాయం పెరిగిందిలే అనుకుంటుందా ప్రభుత్వం?
ఆరోగ్య శాఖ, మెడికల్ కాలేజీలూ, రీసెర్చ్ సెంటర్లు సమన్వయంలో ఇటువంటి వాటిపై తీసుకోవలసిన చర్యలగురించి ఇప్పటికైనా ఆలోచన ప్రారంభించాలి. రోగాలబారిన పడకుండా మంచి ఆరోగ్యంతో వుండాలన్న ప్రజల తీవ్రమైన కోరికకు సరైన శాస్త్రీయ మార్గం చూపే ప్రయత్నాలు జరగాలి. కొన్ని విషయాల్లో ఇదిమిధ్దంగా ఇదే మంచిది ఇది మాత్రమే మంచిది అని ప్రయోగాల ద్వారా సైతం తేలకపోవచ్చు. కానీ ఇది ప్రమాదం దీనివల్ల ఇటువంటి దీర్ఘకాలిక నష్టాలు సంభవించే అవకాశం వుంది అనేవాటిని వెలుగులోకి తీసుకారవలసిన అవసరం కూడా వుంది.
https://m.facebook.com/story.php?story_fbid=2304087102949128&id=100000435816359

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి