ప్రొద్దుటూరులో ఊరూరా కవిసంగమం సిరీస్ 10

ఈసారి ఊరూరా కవిసంగమం పొద్దు మరో చారిత్రక పట్టణంలో పొడిచింది. తన అనువాదాలతోనూ అంతకు మించి ఆప్యాయత లతోను కవిత్వంకోసం ఇష్టంగా కష్టపడే సి వి సురేష్ గారి సారథ్యంలో ఒక సైన్యంలా పనిచేసిన ఆ ప్రాంతమిత్రుల శ్రమతో ఈ కార్యక్రమం ఒక చక్కటి రూపంలో జరిగింది. కవిసంగమం సమూహంలో @Rajeswari Ramayanam గారు ఇప్పటికే సమావేశ విశేషాలను కూలంకషంగా వివరించారు. నాకు ముచ్చటగా అనిపించినా మరికొన్ని విశేషాలు మిత్రులతో పంచుకుంటాను.

ది 17-02-2019(ఆదివారం) ప్రొద్దుటూరులోని స్త్రీ శక్తి భవన్ ప్రాంగణంలో కలుసుకున్నాం. ఆ ప్రాంత కవులు పెద్దలతో పాటు హై స్కూల్ కాలేజ్ చిన్నారులు కూడా హాజరయ్యారు. ఈ పిల్లలంత ఎలా తెలుసుకుని వచ్చారు అని సురేష్ గారిని అడిగితే ఒక పాంప్లెట్ చేతిలో పెట్టారు. పదిరోజుల ముందునుంచే విద్యార్థులకు కవితా పోటీలు ఉన్నాయన్న సమాచారం అది. సరే కార్యక్రమం మొదలవడానికి మరికొంత సమయం ఉండటంతో అక్కడున్న పిల్లలతో మాట్లాడటం కుదిరింది. వాళ్ళు రాసిన కవితకు సందర్భం ఏమిటి? ప్రేరణ ఏమిటి? ఆ పదాలను వాడటంలో ఉద్దేశ్యం ఏమిటి? లాంటి ప్రశ్నలకు పిల్లలు ముచ్చటగా గౌరవంగా ఇంటర్వ్యూ సమాధానాల్లా చెప్పడం ఆశ్చర్యం అనిపించింది. పదాలు dictation పెట్టినా రాయలేకపోతున్నారు అని సర్వేలు చెపుతున్న రోజుల్లో భావానికి పొసగే పదాలు ఎంచుకుని మరీ రాసిన వీళ్ళు నాకు ఆశ్చర్యమే కదా!! అలా మాట్లాడుతుండగానే హరికృష్ణ అనే ఒక బుజ్జోడు చకా చకా పెన్సిల్ తో @Kavi Yakub సర్ బొమ్మ గీసేస్తున్నాడు. వాడు ఎంత ఏకాగ్రతగా నిమగ్నం అయ్యడంటే ఆహూతులతో మాట్లాడుతూ యాకూబ్ గారు అటూ ఇటూ కదిలినా విసుక్కుంటూ కూర్చోమని కోపంగా సైగ చేసేంత. మరో అమ్మాయి ఒక పుస్తకం నిండా వేర్వేరు సందర్భాలకు తన స్పందన కవిత్వంగా రాసుకొచ్చింది ప్రస్తుతం D El Ed చేస్తోందట నిజానికి ఆ పాపకు కంటిచూపు కూడా చాలా తక్కువ అటువంటి పరిస్థితిలో అటు చదువుతూ ఇలా ఇంత కవిత్వం రాయడం ఎలాకుదిరిందమ్మ అంటే నేను కొన్ని సినిమా స్టోరీ లు కూడా రాసాను తెలుసా సర్ అంటుంది. వేరే పిల్లలకు వల్ల కాలేజ్ లో ఏవో కార్యక్రమలు వదులుకుని వచ్చారు. ఇక్కడ మాటలు కవిత్వం వినేసి త్వరగా వెళ్లి అక్కడ కూడా పాల్గొవాలని వల్ల టైం management పోనీ హడావుడి ఉంటే వెల్లకపోయారా అన్నసరే వల్ల మనసు ఇక్కడే ఊగిసలాడుతోంది.


అంతలో అనుకోకుండా అప్పటి వరకు వచ్చిన కవిత్వంలో మరింత బాగున్నవి ఎంపిక చేయమని @Srinivas Vasudev గారికి నాకు జడ్జిమెంట్ పని అప్పగించారు. అయితే కవిత రాసిన ఏ ఒక్కరూ తక్కువ కాదు ప్రతివాళ్లకు బహుమతి ఉంది అనిచెప్పక మాకు ఈ కష్టమైన పని మొదలుపెట్టే ధైర్యం వచ్చింది. పైగా కనిగిరి నుంచి వచ్చిన మిత్రులు భాస్కర్ కె గారు కూడా మాకు సాయంగా వుంటానన్నారు. ఇంకేం కార్యక్రమంలో ఒక పక్క @LN Gunturu గారి కీలకోపన్యాసం కవిత్వం ఏమిటి? ఎందుకు లాంటి వాటిపై ఒక తూగులో సాగుతోంది మేము ఒక చెవి అటువేసి వింటూనే, ఇటు పిల్లల కవితలు జడ్జ్ చేయటం మరిచిపోయి వీళ్ళు పిల్లలేనా అని అబ్బురపడటం కూడా చేస్తున్నాం. ఇంకా ఎక్కడెక్కడి మిత్రులొ అక్కడ పలకరించాల్సిఉంది.


రాజేశ్వరి రామాయణం గారు కుటుంబంతో సహా కార్యక్రమ నిర్వహణ బాధ్యతలతో వున్నారు, ప్రభుత్వ హై స్కూల్ పిల్లలంటే ప్రతిభలోనూ హై గానే వుంటారన్నట్లు ముద్దనూరు పాఠశాల పిల్లలకు కన్న తల్లిలా కాచుకుంటు పిల్లలను పొగిడితే పుత్రోత్సాహం తానే పొందుతూ ఒక పక్క వెంకట సుబ్బమ్మ గారు గాంధారి ఖిల్లాలో(మంచిర్యాల) మొన్నీమధ్య ఊరూరా కవిసంగమం కార్యక్రమం నచ్చిన యామిని రెడ్డి గారు, గీత చల్లా శిలాలోలిత మేడంలతో కలిసి శ్రద్ధగా కార్యక్రమం పరిశీలిస్తున్నారు.
పీర్ల మహమూద్ గారు, బసవరాజు వేణుగోపాల్ గారు మురళి కృష్ణ గారు నిశ్శబ్దంగా కార్యక్రమ ఏర్పాట్లలో తమతోడ్పాటు నిస్తున్నారు. కుప్పం నుంచి వచ్చిన పల్లిపట్టు నాగరాజు, హైద్రాబాద్ నుంచి సుగుణశ్రీ బిరుదు మాకు మరో అబ్బురం. ఒక చిన్న కవిత్వ కార్యక్రమం పై ఇంత ఇష్టం చూపించి ఎంతో దూరప్రయాణాలు చేసి సమయాన్ని ఖర్చు పెట్టగలుగుతారా అని. బహుమతులు అందుకున్న చిన్నారుల కవితా పఠనం మేము పెద్దవాళ్లకు మా కవితను వినిపిస్తున్నాం అన్న ఉద్వేగ పూరిత ఉత్సాహం మాకు స్పష్టంగా కనిపించాయి. అప్పుడు అర్ధం అయ్యింది ఇంత ఖర్చు పెట్టి సురేష్ గారు కార్యక్రమం నిర్వహించింది తన వెలుగు కనిపించాలి అని మాత్రమే కాదు మరి కొన్ని దివ్వెలను వెలిగించాలి అనికదా.
మానవ వికాసం కోసం కవిత్వం అనే నినాదం వారి నవ్వులతో పాటు ఆ ప్రాంగణమంత పరిమళం పంచుతున్నట్లే ఉంది. రెండు రోజుల మా పర్యటనలో మరెన్నో విశేషాలు ఒక్కొక్కటే మీతో వరసగా పంచుకుంటాను. ఇప్పటికి సెలవు


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి