వెయ్యేళ్ళ క్రితంనాటి మహా వైద్యుడు మన అగ్గలయ్య

భారతీయ ప్రాచీన వైద్యం అంటే కేవలం ఆకుపసర్లు, దుంపలు మూలికల పొడులు  లేహ్యలు మాత్రమే కాదు అత్యంత సునిశితంమైన skull సర్జరీలు, అంతర్గత అవయవాల సర్జరీలు లాంటివి సైతం చేశారని అనేక చోట్ల దొరికిన పుర్రెలు, ఎముకలు, శస్త్ర చికిత్సకు వాడిన సునిశిత పరికరాలు చెపుతున్నాయి. అటువంటి గొప్ప వైద్యుడి గురించి మరింత లోతుగా తెలుసుకునే అవకాశం కలిగింది.

నిన్న 23-మే-2019 నాడు యువ పరిశోధకుడు అరవింద్ ఆర్య, కవి కార్తీక రాజు, సోదరుడు రౌతు అప్పారావులతో కలిసి వరంగల్ హన్మకొండ బస్టాండ్ కు చాలా దగ్గరలో పద్మాక్షి గుట్టకు ఎదురుగా ఉన్న చారిత్రక గుట్టపై పూర్వ కలెక్టర్ ఆమ్రపాలి గారు మంజూరు చేసిన నిధులతో అరవింద్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూద్దాం అని వెళ్ళొచ్చాము.
హన్మకొండ చౌరస్తా సమీపంలో పద్మాక్షి, సిద్ధుల గుట్టలకు ఉత్తరంగా ఉన్న ఈ అగ్గలయ్య గుట్టపై ఉత్తరాభిముఖాన 30 అడుగుల ఎత్తులో ఉల్బణ(అర్ధ) శిల్పం ఇది వరకే ఉన్నది. ఇదే గుట్టపై ఏడు జైన తీర్థంకుల అర్ధశిల్పాలున్నాయి. వీటిలో పార్శ్వనాథున్ని తేలిగ్గా గుర్తించవచ్చు. తలపై ఏడు పడగల సర్పం గొడుగుపట్టి నేలదాక మెలికలు తిరిగి నిలిచి ఉంటుంది. ఈ శిల్పాలు రాష్ట్ర కూటులు, కళ్యాణ చాళుక్యులు పాలించిన 9,10వ శతాబ్దాలనాటివి.

ఇక్కడి జైన విగ్రహం ప్రత్యేకథలగురించి, గుట్ట గురించి ఇప్పటికే అనేక కధనాలు వచ్చాయి. కానీ ఈ గుట్ట పేరు అగ్గలయ్య గుట్ట ఈ అగ్గలయ్య ఎవరు? జైన తీర్ధకరులలో ఇతను ఒకరు కాదు. పోనీ మహా రాజు కూడా కాదు, ఆ పేరు తో ఈ గుట్ట ఎందుకు పిలువ బడుతోంది? ఈ గుట్టకు ఆ పేరు కు సంబంధం ఏమిటి? ఈ వివరాలు  ఆశక్తికరం మాత్రమే కాదు తెలంగాణ ప్రాంత ప్రాచీన వైభవానికి తార్కాణం గర్వకారణం కూడా. వేల ఏండ్ల నాటి సంగతులు ఒక్కచోట ఒక్కసారిగా దొరికేఅవకాశాలేమీ లేదు. ఆధారాల చుక్కలను కలుపుతూ పోతే అగ్గలయ్య జీవితంలోని అతికొద్ది భాగమే అర్ధం అయినా అమితాశ్చర్యం కలుగుతుంది. మన వాడే సుమా అని గర్వంతో ఛాతి ఉప్పొంగుతుంది.

కొన్నాళ్ల క్రితం ఈ  కొండకోసన ఒక విగ్రహం వెలుగులోకి వచ్చింది. దాన్ని నిశితంగా పరిశీలించిన మీదట ఆ విగ్రహం జైనమతగురువు నర వైద్య వర, శస్త్ర వైద్య శిఖామణి అనే బిరుదులున్న అగ్గలయ్యది ( సైదాపురం శాసనంలో పేర్కొనబడివుంది) అని ప్రముఖ చరిత్ర కారులు శ్రీరామోజు హరగోపాల్ చెపుతున్నారు.

1979లో ఒకరోజు నల్గొండ జిల్లా భువనగిరి తాలూకాలోని చిన్న పల్లెటూరు సైదాపురం. ఆ గ్రామ పొలాలలో బయటపడిన ఒక శాసనం వల్ల ఈ అగ్గలయ్య ప్రతిభా పాటవాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి.

అగ్గలయ్య జైన మాలవ గణానికి చెందిన యావనీయ సంఘానికి చెందిన వాడు అని హరగోపాల్ గారు తన ఆలేటి కంఫణం పుస్తకంలో పేర్కొన్నారు. చాళుక్య ప్రభువు రెండవ జయసింహుని ఆస్థాన వైద్యుడు. వైద్య శాస్త్రంలో దిట్ట, ఎవరూ నయంచేయలేకపోయిన ఎన్నో మొండి రోగాలను నయం చేసిన గొప్ప వైద్యుడు. శస్త్రచికిత్సలో ప్రసిద్దుడు. ఈ అగ్గలయ్య కు "శాస్త్రాశాస్త్ర కుశల",  "వైద్యరత్నాకర" అనే బిరుదులతో పాటు "ప్రాణాచార్య", "నరవైద్య" గా కీర్తింపబడ్డాడు. ఆ కాలంలో వైద్య రంగంలో ప్రముఖ వైద్యునిగా ప్రసిద్దినొందినట్లు ఈ శాసనం తెలుపుతోంది.
ఉమా తంత్రం సలిగ్రహ పరిచ్ఛేద వంటి పుస్తకాల రచయిత.

రెండవ జయసింహుడు జైనమతాభిమాని అతను 4 జూన్ 1034 న పొట్లకెరె / పొత్తలకెరె (నేటి పఠాన్ చెరువు-ప్రసిద్ద జైన కేంద్రము, ఆనాడు ప్రసిద్ద పట్టణము) లో విడిది చేసి ఉన్నపుడు అగ్గలయ్యకు ఈ శాసనం రాయించబడినది. అంతేగాక దీనివలన జయసింహుడు (జగదేకమల్లునిగా కూడా ప్రసిద్దుడు, ఈ శాసనంలో అదేపేరు ప్రస్తావించబడింది) పఠాన్ చెరువుకు అధిపతిగా ఉన్నట్లు తెలుస్తుంది. బసవపురాణంలోనూ పఠాన్ చెరువు రాజధానిగా చాళుక్య రాజు పరిపాలించినట్లు, ఇది జైనుల ముఖ్య కేంద్రంగా చెప్పబడింది.   అగ్గలయ్య జైనుడు, అతని ఆద్వర్యంలో నడపబడుతున్న   జైనదేవాలయాలకు రాజుని భూదానం కోరగా రాజు భూదానాలు చేసినట్టు తెలుస్తుంది. ఆ జైనాలయాలు నల్గొండ జిల్లా ఆలేరు తాలుకాలోని ఇక్కుర్తి గ్రామము, మరియు ముచ్చనపల్లి (ఇది కొలనుపాక దగ్గర పరిసర ప్రాంతంలో ఉండి ఉంటుంది).

సిరూరు శాసనం (క్రీస్తు శకం 1074) ప్రకారం కల్యాణి చాణుక్య రాజు రెండవ సోమేశ్వరుడు అగ్గలయ్యను తన ప్రధాన అడపం గాను, మహా సమంత పదవితో ముచ్చన పల్లి ప్రాంతానికి ప్రధాన గావుండ గాను నియమించినట్లు ఉంది. ఇలా 50 ఏళ్ల పాటు రాజాశ్రయంలో ఉన్నట్లు తెలుస్తోంది.

వైద్యరత్నాకర అగ్గలయ్య గురించి జైన సాహిత్యంలోను ఇతర సాహిత్య ఆధారాలలోనూ ఎక్కడైనా ప్రస్తావించబడి ఉందేమో చూడాలి. ఒక వైద్యుని గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ బయల్పడిన శాసనం ఇదే కావడం విశేషం కూడా. అగ్గలయ్య మహావైద్యుడు అవటం వల్లనే శాసనాల్లో ప్రస్తావించబడ గలిగినాడు అనటంలో సందేహం లేదు. ఈయనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియకపోయినా ఈయన అద్వర్యంలో నడచిన జినాలయాలు, వైద్యసేవలు, భూములు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవే. అగ్గలయ్య శస్త్రచికిత్సలో గొప్ప వైద్యుడుగా చెప్పబడటం వలన, ఎందరికో ఎన్నో రోగాలను రూపుమాపినాడని చెప్పటంవల్ల ఆ కాలానికే తెలంగాణ ప్రాంతంలో శస్త్ర చికిత్స కూడా ప్రముఖంగా అందుబాటులో ఉందని తెలుస్తుంది. అతని వైద్య కౌశల్యం గురించి ఈ శాసనంలో బాగా వివవిరించటం జరిగింది. ఎవ్వరూ నయం చేయలేకపోయిన రోగాలను కూడా ఇతను నయం చేశాడని, అంతేగాక ఈయన ఆయుర్వేదాన్ని, శస్త్రచికిత్సను కలిపి ప్రయోగించి రోగాలను నయం చేసినట్లు తెలుపబడింది.

మరుగునపడ్డ ఈ గొప్ప తెలంగాణ వైద్యుని పేరుతో వరంగల్ మహా నగరంలో ఒక గుట్ట ఉండటం మనందరి గర్వకారణం. జైన మత గురువుగా పద్దతి ప్రకారం బసదుల నిర్మాణాలు చేసిన అగ్గలయ్య ఈ సిద్ధుల గుట్టను కూడా నిర్మించి ఉంటాడు. ఈ గుట్ట ఉన్నన్ని రోజులు ఈ మహనీయుడి వైభవాన్ని తలచుకునేలా ఇతని చరిత్రను భవిష్యత్ తరాలకు తెలిసేలా చెప్పాలి. ఆరోగ్య కేంద్రాలకో ఆరోగ్య శాఖలోని ఏదన్నా ప్రముఖ వైద్య విధానానికో ఈయన పేరు ఉంచి గౌరవించాలి.

Text of the inscription on the third side of the pillar
1. 0 Ni [rddaJ haya satam hitiya vidusam [rogabhibhu*]
2. tatmana marogyaya nr nam sukhaya suhrdam tu
8. ~tyai gurunam sada raksayai jinasasanasya bhisa
4. jam sastrakriya saIp;ayady-ucchedaya ca pa
6. dmabhussa (sa)* hajah srivaidayaratniikaral:l 0
6. Ayurvedavidiim sad a patudhiyam ye ~iistra
7. karmmakrame praudha (l:l) Srijagadekamalla.
8. nrpater= yye sastrapararigatiis •• te~llm
9. samsadi sastrasastrakuialal;1 sri
10. vaidyaratnakarah jeta
11. va [ ... laJ raggala (10)* bu,
12. dhanidhiisastre{\a sastrc':la va 0
18. Yadyatra sistradi~u karmma
U. karoti lokah tvam tu pravetsi naravai,
15. dyakam Aggalaryya'm) divram (tivram)* tathlpadi
16. dathapi sukham vidhitum simhasya tasya ca
17. tatha mahi (ma)* ganasya 0 Asakyavy~dhe (ra)
18. pi parair eebhisagbhir ss vyadhipra (kar!}e) tadu.,
19. pakrame ca I tamaggaljiryarn punarujbaj
20. daksam niruha ldak~am) kathayanti diksu [111*
21. Uma (tantra) mad yam [ •.. ] safigrahapariccheda
22. kriyakauSaloddamaprathitasastrasastra
23. vi~ayapraga (D'ya) marurjjitapra (dam)
24. [karmmigaJ cakravartti Jayasingam .•.

1. ఓ ని(ర్దాహా)య సతాం హితాయ విదుషాం (రోగాభిభూ)
2. తాత్మనా మారోగ్యాయ నృణాం సుఖాయ సుహృదాం తు
3. ష్టై గురూణాం సదా రక్షాయై జినశాసనస్య భిష
4. జాం శాస్త్రక్రియా సంశయాద్యుచ్ఛేదాయ చ ప
5. ద్మభూస్స(స)హజ: శ్రీవైద్యరత్నాకర: (ఓ)
6. ఆయుర్వేదవిదాం సదా పటుధియాం యే శాస్త్ర
7. కర్మక్రమే ప్రౌఢా (:) శ్రీజగదేకమల్ల
8. నృపతే.. య్యే శాస్త్రపారంగతాస్తేషాం
9. సంసది శస్త్రశాస్త్రకుశల:శ్రీ
10. వైద్యరత్నాకర: జేతా
11. వ(..ల)రగలో బు
12. ధనిధిశ్శస్త్రేణ శాస్త్రేణ వ
13. యద్యత్ర శాస్త్రాదిషు కర్మ
14. కరోతి లోక: త్వం తు ప్రవేత్సి నరవై
15. ద్యకం అగ్గలార్య(0)దివ్రం (తీవ్రం) తథాపది
16. దథాపి సుఖం విధాతుం సింహస్య తస్య చ
17. తథా మహి(మా)గణస్య అశక్యవ్యాధే(ర)
18. పి పరైర్భిషగ్భిర్వ్యాధి (ప్రకర్షే) తదు
19. పక్రమే చ. తమగ్గలార్యం పునరూమ
20. దక్షం నిరూ(దక్షం) కథయంతి దిక్షు
21. ఉమాతంత్రమాద్యం.. సంగ్రహపరిచ్ఛేద
22. క్రియాకౌశలోద్దామ ప్రథితశస్త్రశాస్త్ర
23. విషయప్రాగ(ణ్య)మరూర్జితప్ర(దం)
24. (కర్మిగ) చక్రవర్తి జయసింగ


SUMMARY

The article presents" an inscription,  discovered near Hyderabad. It mentions a physician-surgeon called Aggalayya who flourished under the patronage of Chalukya King Jayasimha II (A.D. 1015 - 1042). The inscription records the gift
of a village for the maintenance of two Jaina Basadis built by Aggalayya, Aggalayya had the titles Vaidyaratnnkara, PraJacharya and Naravaidya.

 Third part of the record contains description of Aggalayya. He was a Jaina and was helpful to the
good people and for the health and welfare of all. In surgery he excelled all
others. He was also well versed in Umatantra and SaIigraha - pariccheda.

The Editor's note mentions that this inscription shows that the practice of
surgery was not completely given up and that Jainas also practised surgery. The
title Naravaidya shows the importance of physicians of human beings as well as
animals.

థాంక్స్ : ఈ వ్యాసంలోని అనేక అంశాలకు గౌరవ Pv పరబ్రహ్మ శాస్త్రి గారి వ్యాసం, శ్రీరామోజు హరగోపాల్, అరవింద్ ఆర్య గార్ల వివరణలు, ఈమని శివనాగిరెడ్డి గారి 2015 నాటి వ్యాసం, తోపుడుబండి సాదిక్ అన్న రాసిన ఫేస్ బుక్ ఇన్పుట్స్ ఉపయోగపడ్డాయి. వారికి సగౌరవంగా నా ధన్యవాదాలు.

https://m.facebook.com/story.php?story_fbid=2488297734528063&id=100000435816359

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి