ఫణిగిరి సిరీస్ 10 : ఫణిగిరికి ఆ పేరెందుకు వచ్చింది?

ఫణిగిరి పర్యటనలో వేర్వేరు విషయాలు గమనించాను కానీ అసలాపేరు ఎందుకు వచ్చింది అనేదగ్గర మాత్రం సందేహం అలాగే వుండిపోయింది. రాక్ ఆర్ట్ వెతుకులాటలో పడగబండలను ఆవాసాలుగా గమనించడం అలవాటయిపోవడంతో ఈ గుట్టమీద ఎక్కడా అటువంటి షేప్ కనిపించనే లేదు. నిన్నటి పర్యటనలో మాట్లాడుతుందగా హరగోపాల్ సర్ అన్నారు. ఫణి పడగ విప్పకుండా పడుకుని వున్న కొండలేమో కదా అని. గుగుల్ శాటిలైట్ చిత్రాలలో చూస్తే నిజమే నాకు కూడా అచ్చంగా పాము పడుకుని వున్నట్లే కనిపించింది అంటే రెండు వేల ఏళ్ల క్రితమే ఇలా పైనుంచి చూసి ఈ కొండ పాములా వుంది అని ఎలా అర్ధం చేసుకున్నారు.? భూమి చుట్టుకొలతలను, గ్రహాల మధ్య దూరాలను, సంవత్సరంలో వాతావరణ పరిస్థితులను, గ్రహణాలను లెక్కేసిచెప్పగల భారతీయ ఖగోళ పరిజ్ఞానానికి అది అంత పెద్ద విషయం కాదేమో అంటారా? నిజమే కావచ్చు.
PC : Google Satellite Images

కామెంట్‌లు