అబూ బెన్ ఆదాం. ( నీలాంటోళ్లు ఇబ్బడి ముబ్బడవ్వాలరా భాయ్ )
పురసత్ గా పనుకున్నోడు కాస్తా రాత్రిల పూసిక్కిన లేచిండు.
పండు ఎన్నెల పడగ్గదిల పరుసుకొనుడు జూసిండు.
మల్లెలపై మంచు మెరిసినట్లు జిగేలనటం జూసిండు.
బంగారు ఫుస్కమ్ ల దేవకన్య రాసుకోనుడు జుస్తే ధైర్నం పెరిగి
"ఏం రాస్తున్నవ్ అక్క దాన్ల" అని సొంచాయించిండు.
ఆరామ్ గా తలెత్తి కమ్మని గొంతుతో సెప్పింది కదా.
" దేవున్ని ఇష్ట పడేటోళ్ల పేర్లు రాస్తన్న తమ్మి" అని
" మరి నా పేరు ఉన్నదేమో సూడ్రాదే" వుండబట్టలేక ఆడిగిండు.
లిష్టంతా జూసి కరుగ్గా సెప్పింది అబ్బే దీన్లో లేత్తియ్,
కొంచెం గొంతు తగ్గించినా జబర్దస్త్ గా ఏమన్నడంటే " గట్లయితే.... నా పేరు ఆయన జమానా లోని మనుషుల్ని ప్రేమించే చిట్టాలో నన్న రాయరాదే" గీమాలిండు.
సర్లేపో అని రాసి గబాల్న మాయమయ్యింది.
తర్వాతి రాత్రి జిగేల్మనే ఎలుగుల్ల ఆ యక్క మల్లా వొచ్చింది.
దేవుడు ఎవర్ని ఇష్టంగా ప్రేమిస్తున్నడో ఆ చిట్టా సుతా దెచ్చింది.
దాంట్ల అబూ గాని పేరే ముంద్గల ముంద్గల రాసుంది.
English || Abou Ben Adhem ||
BY LEIGH HUNT
తెలంగాణ || అబూ బెన్ ఆదాం|| కట్టా శ్రీనివాస్
https://m.facebook.com/story.php?story_fbid=2570322566325579&id=100000435816359

మీ తెలుగు సేత అద్భుతంగా ఉంది. ఎప్పుడో చిన్నతరగతులలో ఇంగ్లీషు వాచకంలో చదువుకున్నది.
రిప్లయితొలగించండిఇంత మంచి పోస్ట్ పంచుకున్నందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిLatest Telugu News
Andhra Pradesh Telugu News