కలుక్కుమంటుంది
తళుకులీనాల్సిన ఒకనొక రోజుని
బండబారిన రోజువారీ కాలచక్రపు రాతిపై
మొరటుగా అరగదీసి,
గతపు కుప్పతొట్టెలో ఆదాటున
విసిరేస్తున్నప్పుడు
తరుక్కుపోతుంది
పెళపెళ సాగే నడకని
రంగుదారాలకు బిగగట్టి
రూళ్ళ కర్రతో గిరిగీసి వరసనే
సర్వస్వమని నేర్చినపుడు.
ఇంకనయం
మనసు నాడీ చూడటమ్మన్నా
తెలిసింది.
జీవపు ఉనికి గుర్తించేందుకు.
తేదీ : 19 ఫిబ్రవరి 2020 నాటి ఒకానొక రాత్రి సమయం
ప్రదేశం : లోపటెక్కడో నన్ను నేనే వెతుక్కుంటున్న గుర్తుతెలియని చోట.
సందర్భం : ఏమీ లేకపోవడమే!
కవిసంగమం లో ప్రచురితం
నాలుగు సన్నివేశాలు తో కవిత బాగరాశారు, సర్!అభినందనలు, ఈకవిత, ఏ,విభాగం లోకి,వస్తుంది, సర్?ఎందుకుఅడిగా,అంటే.. ఇలాంటి కవిత, ఇంకొకటి రాసారని!సర్
రిప్లయితొలగించండిఇది తెలుగు పొయెట్రీ విభాగం లోనండీ
తొలగించండిhttps://antharlochana.blogspot.com/search/label/telugu%20poetry
పదాలు సులభమైనవే
రిప్లయితొలగించండిభావాలు లోతైనవి
దూకైనా కనుగొందామనుకుంటే
ఈదేందుకు నీరులేదు
గాదిరాజు మధుసూదనరాజు