జీవితాన్ని కళ వెంటాడటమే ప్రమాదం

కళను వెంటాడే జీవితంలో మొదమో ఖేదమో కానీ
జీవితాన్ని కళ వెంటాడటమే ప్రమాదం

భోపాల్ నుంచి తిరుగుప్రయానం చాలా గంటలు ఉండటంతో వచ్చి పొయ్యే నెట్ వర్క్ తో యూట్యూబ్ ట్రేండింగ్ వీడియోలు కొన్ని చూసాను.  ఎక్కువ లైక్ లు కామెంట్ లు రావడానికి ఫార్ములాలు పెట్టుకుని, రాత్రికి రాత్రే వర్చువల్ రిచ్ గా మారడానికి అర్థమై, అడ్డమై నిలబడ్డవాళ్లను చూసిన సందర్భాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటాను.

1) ఫ్రాంక్ వీడియోలు ఒకబ్బాయి రోడ్డు మీద డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి దగ్గరకు వెళ్లి సార్ మీ ఆవిడను ప్రేమిస్తున్నాను. మీకు చెప్పాలని వచ్చాను అని అసలే డ్యూటీ లో చిరాగ్గా ఉన్న పోలీస్ కి మరింత పెర్సొనల్ విషయం తో చిర్రెత్తుకొచ్చేలా చేసి బోలెడు తిట్లు, కొన్ని దెబ్బలు తిని చూడండి సర్ కెమెరా పెట్టాం అంటే ఊరుకుంటారా? కెమెరా ఆపరా అని ఇంకో రెండు పీకితే ఆగండి మీ మేడం గారి ఐడియా తోనే ఇలా చేశాం ఆవిడతో మాట్లాడండి అంటూ ఎలాగో చావుతప్పి  కన్ను లోట్ట పోయినట్లు బయట పడి ఇష్టమైతే లైక్ చేయండి లేకపోతే డిస్ like చెయ్యండి మొత్తం మీద subscribe చెయ్యటం మాత్రం మర్చిపోవద్దు అంటాడు ఒకాయన.
2) హిజ్రా కు ఐ లవ్ యు : తన దారిన తను పోతున్న ఒక థర్డ్ జెండర్ ను మధ్యలో ఆపి నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకుంటా జీవితాంతం చెయ్యి వదలకుండా చూసుకుంటా మీకు మాత్రం మంచిగా బ్రతకాలని ఉండదా అంటూ ఆమె జీవితంలోని వెలితిని పదిసార్లు ఎత్తిచూపి నిజమేనేమో అనే ఆశ చిగురింపజేసి, కళ్ళ నీళ్లతో ఆమె నువ్వు పిచ్జోడివా  నేను పెళ్లికి పనికి రాను అమ్మానాన్నలు చెప్పినట్లు బుడ్డిగా పెళ్లి చేసుకుని బాగుపడు అంటే, సరే అయితే నన్ను కౌగిలించుకుని బుగ్గమీద ముద్దు పెడితే ఇక వెంటపడను అని అలా చేసాకా అదిగో కెమెరా హాయ్ చెప్పు అంటే చెప్పు తియ్యల్సింది కదా అనుకున్నా. పాపం ఆమె అమాయకంగా సరే తీసుకో అంటూ వెళ్ళిపోయింది.

3) పొలం పనిచేస్తున్నాయనను లెక్క్కెళ్లి పోలీస్ స్టేషన్ కెళ్లాలి అని కంగారు పెడుతుంటారంకో చోటా

ఇంత కంటే ఎక్కువ చూడలనిపించలేదు. కానీ మరో ప్రమాదకరమైన ట్రెండ్ ఫోన్ లో వ్యక్తి గతం అనుకుని ఓపెన్ గా కొన్ని సార్లు విచ్చలివిడి తనంతో మాట్లాడిన కాల్స్ యూట్యూబ్ లాంటి చోట ప్రత్యక్షం కావడం. ఎన్ని కాపురాలు కూలదానికి ఎందరు ఆత్మహత్యల దిశగా ప్రేరేపించబడటానికి కారణం అయ్యివుంటాయో కదా!!

4)  బూతులు తిట్టడం (ఓపెన్ గా ఉన్నాం అనేపేరుతో పాక్షిక ఔట్ బర్స్ట్) మగవాళ్ళు అడవాళ్లను అనుకరించడం, ఆడవాళ్లు మగరాయుడిలా ఉన్నానని పేరుతో ఇంకేదోలాగా కనిపించడం ఇవికూడా మరోరకం ట్రెండ్.
5) పాపం ఆరోగ్యానికి వంతెన గారి లాగా వుంటారనుకున్న ఒక పెద్దాయన తన రెండవ రాకడలో ట్రెండ్ లో ఆకర్షణీయంగానూ, ఆశలనూ నరాలనూ ఉత్తేజపరిచే శీర్షికలు పెడుతూ రావడం. ఎంత వారు కానీ మాస్ ఫాలోయింగ్ దాసులే అనేందుకు గొప్ప ఉదాహరణగా అయ్యింది.
6) కొమ్ములు తిరిగిన దర్శకులుగా పేర్లు పొందిన వారు కూడా పోర్న్ స్టార్ క్రేజ్ ని ఫిలాసాఫీ అద్దకంతో దొంగదారినైన సామాజిక మాధ్యమంలో పేరు నలిగేలా చేసుకుంటారు. పైగా అవును నేనింతే నాయిష్టం అనికూడా తుంటేర్వ్యూ ఇస్తారు.

జీవితం అంటేనే పరుగుల పందెంగా మారిన ఈరోజుల్లో రొటీన్ చక్రం నెమ్మదిగా తిరిగే కొద్దిసమయంలో సీరియస్ విషయాలను చూసే ఓపిక తీరిక ఎవరికీ లేదు. అందులో ఆరోగ్యం, క్రైమ్ హారర్ సెక్స్ హాస్యం లాంటి వాటికీ ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. మరీ పెద్దగా కాకుండా సూక్ష0లో మోక్షం కావలనుకుంటున్నారు. ఎప్పుడూ వుండే ఎడ్డే0 కాకుండా తేడా తెడ్డే0 కి ఆకర్షింపబడుతున్నారు. దీనిపై కొన్ని సర్వే లు కూడా నిర్వహించబడ్డాయి.


మనకి కావలసింది పేరు లేనిది బాధ్యత అనుకున్నప్పుడు. దృశ్య శ్రవణ మద్యమాన్ని జనంలోకి పంపడం సులభమూ చౌక అని తెలిసిన వేలం వెర్రి రోజుల ముఖ ద్వారంలో ఉండటంతో విరుగుడు మందు కనుక్కోవడానికి ముందున్న వ్యాధిలా విలాసంగా నవ్వుతుంటుంది ఈ విపరిణామం.

ఇదంతా చాలదన్నట్లు టిక్ టాక్ ఆఫీస్ టైం లో చేస్తూ సస్పెండ్ అయిన అధికారులు ఒకవైపు రైతుగా తన పొలానికి ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు హృద్యం గా చెప్పి ఆధునిక మాధ్యమం ఆలంబనగా రైతుకు విలువ పెంచే స్థితి మరోవైపు.

ఫోన్ కాల్ తో చెవి గుండా మనసులో చొరబడటం అంటే  సరాసరి పడకగదిలో దిగబడటం అనుకుని పిచ్చిమాటలు విచ్చలవిడిగా గుమ్మరించుకుని అడ్డంగా దొరికిపోవడమో, అచ్చంగా జీవితాన్ని కాల్చుకోవడమో చేసున్నారు మరికొందరు. ఏం సృజన తిన్నవా దగ్గర నుంచి, థిర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు వెనకనుంచి ఒక్కసారి బోర్లా పడిపోయాయి.

ఒకప్పుడు రిక్రియేషన్ కి అవకాశాలు భిన్నంగా ఉండేవి, హరికథ, బుర్రకధ, వీధినాటకం లేదా పుస్తకాల్లో అక్షరంగా ఉండేవి. తర్వాత పెద్ద తెర పై పాకి వెండి తెరగా మార్చుకుంది రంగులద్ది స్కోప్ గా చూపించింది. చిన్న తెరగా ఇంటి బల్లల మీద నుంచి గోడలకు ఫోటో ఫ్రేమ్ అంతగా ఇమిడిపోయింది. ఇప్పుడిక మరింత అనుకూలించింది అరచేతిలో స్వర్గాన్ని చూపుతూ జేబులో ఇమిడిపోతోంది. ఒక కళా రూపం తయారీకి ఎందరో నిపుణులు అవసరం లేకపోతోంది. అసలు వడపోత అంటేనే అమడదూరం పోతోంది. ఈ క్షణాన ఒక మెదడులో ఆలోచన తళుక్కుమంటే మరుక్షణమే ప్రపంచమంతా వెలిచివర వెలిగేందుకు సిద్ధమై పోతోంది.

ఇంతకీ ఏమంటావు కట్టా!! పదునైన కత్తితో పీకలూ కొయ్యొచ్చు, ఆపెరషనూ చెయ్యొచ్చు ఆ తప్పు కత్తితో కాదు వాడి వారిలో ఉంటుందని మాకు తెలుసు కదా అంటున్నారా??

అవునండీ కేవలం ఆ ముక్క చెపుతూ సరిగా వాడటం లేదే అనే బాధను మీతో పంచుకోవాలనుకున్నాను. దానితో పాటు ముందే మీరు చదివిన శీర్షికను నా పరిష్కరంగా సూచించాలనుకున్నాను. నా వంతుగా నేను కూడా లైకుల వెంట కాకుండా విషయం వెంటనే వెళ్లే ప్రయత్నం చేస్తుంటాను. అటువంతుడెమీలేనప్పుడు.

Something is better than nothing అనికాక
Nothing is better than nonsense  అనేది గమనంలో ఉంచుకుంటాను అని చెప్తామనుకున్నాను. ఇప్పుడిక మీవంతు వీలుంటే ఓ మాట సాయం కుదిరితే నాలుగు ఉదాహరణలు.

వుంటామరి..


కామెంట్‌లు

  1. Totally agree with you. The desire to make movies / videos with weird ideas has reached madness levels.

    రిప్లయితొలగించండి
  2. ఇది చదవడానికి ఆసక్తికరమైన పోస్ట్ అని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది
    Latest Andhra Pradesh Political News
    Online Breaking News Telugu

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి