మొదటిదీ కాదు ఆఖరుదసలే కాదు

కట్టా శ్రీనివాస్ ||మొదటిదీ కాదు ఆఖరుదసలే కాదు ||

మొహాలను కోల్పోయిన వేళ
రాత్రి నిద్రపట్టక దొర్లుతుంటే
పిన్నుపీకిన ఉమ్మెత్తకాయ గ్రైనేట్లు
వీధులనిండా పొంగిపొర్లుతున్నట్లు కల.


మోహాలను కోల్పోయిన వేళ
పరుగులకు తాళం వేసుకుని
చుట్లూ గీసుకున్న వలయంలో
అమ్మకడుపులో బిడ్డనైపోయా



కంటికి కనిపించని శత్రువు
ఊహించలేనంత ఉత్పాతం
పుట్టని బిడ్డకూడా పోరాడుతోంది.
పదును తగ్గకుండా చూసుకోవాలంతే



మహా ప్రళయం కాదు
సవరణల పునర్నిర్మాణం
బూది కుప్పలు కాదు
ఫినిక్స్ పురరుద్థానం


మాట్లాడుతూ వుండండి మిత్రమా
పక్కనొకరున్నారన్న ధైర్యం చచ్చిపోదు.
విరామంలో బాణాన్ని లాగి వుంచండి
సదా మనసు దీపం మలగనీయకండి
.
.
Lets Break the chain Not the rules

కామెంట్‌లు