రాజ్య విస్తరణ కాంక్ష

|| రాజ్య విస్తరణ కాంక్ష || కట్టా శ్రీనివాస్

అది
మన నరనరాల్లో
జన్యువుల్లో నిద్రపోతూనే ఉందేమో.

౿
నాదంటూ
ఒకటి బిందువుగా మొదలవగానే
నిద్ర లేస్తుంది.



తనపేరుతో మెలితిరుగుతూ
పనలెత్తాలని
పరిగెత్తాలని
ప్రవర్ధిల్లాలని
కుత కుత లాడుతుంది.



యుద్ధం
Nothing is unfair
పాఠం మొదలేస్తుంది.
Live and let live అంచునుంచి
చంపుడు మెట్ల సంతోషపు ఆటవుతుంది
అగత్యం లేని మలుపుల్లోకి జారుతుంది.


నేలమీద నడిచే మనిషి
గుర్రపు స్వారీ బోరు కొట్టి
పులి మీదకెక్కాక
అదొక కిక్కుగా తల కెక్కాక
దిగటమా?
............ ఇంకెక్కడ?


సమయం లేదు మిత్రమా
రణమా! శరణమా!!
ప్రేమ తడి లేదు మిత్రమా.
పరుగా! పడిపోవడమా!!


తనని తాను కోల్పోయాక...
అసలు తనంటూ మిగలక పోయాక...
ఉగ్గబట్టిన
యుద్ధం జరుగుతూనే ఉంటుంది.
కారణం ఒక్కటే
అదొక్కటే...

కామెంట్‌లు