రుచి అంటారా నాకు బాగా గుర్తుంది కొత్తిమిర మొదట్లో నాకు అసలు నచ్చేది కాదు. కానీ ఇప్పుడు చాలా కూరల్లో అదొక అదనపు హంగుగా వాడుతున్నాం. ఏడెనిమిది రోజుల్లో రుచిమొగ్గలు మార్చుకునే నాలుక మాటల్లోనే కాదు రుచిలో కూడా ఎటు మలిస్తే అటో మొగ్గుతుంది. ఇప్పుడు చూడాల్సింది రుచి మాత్రమే కాదు శరీరానికి మేలుచేసేది ఏది? ఏది తినడం అవసరం అని కదా.
మిడతల నివారణకు
డబ్బాలు కొట్టడం గందరగోళపు శబ్దాలు చేయడం పనిచేయడం లేదు, వేపరసం లాంటి సేంద్రయ మందులు పిచికారీ చేద్దాం అంటే అవి వేపమొక్కల్నే కాదు మనం విషం అనుకునే జిల్లేడు మొక్కల్ని కూడా వదలకుండా తినేస్తున్నాయి. పురుగుమందులు ఎన్నని చల్లాలి ఎంతని ఖర్చుపెట్టాలి అయినా పనిచేయక నిరాశ పడుతున్న ప్రపంచం మిడతల వైపు బెంబేలెత్తి చూస్తోంది. ఏదో మిడతే కదా నాలుగు ఆకులు తినిపోతాయిలే అనుకోడానికి లేదు. ఒక చదరపు కిలోమీటరు మాత్రం ప్రదేశంలో వున్న మిడతలు తినే ఆహారం వెయ్యి మంది మనుషులు తినే ఆహారంతో సమానం. వాటికి పంటలను వదిలేసి కూర్చుంటే కరువే కాదు. క్షామం కాటకం లాంటి తీవ్రతలు తప్పకుండా ముంచుకొచ్చే ప్రమాదం వుంది.
బాతులకు ఆహారంగా పెట్టవచ్చు
మిడతలను వేగంగా తినే జీవులు బాతులు, బాతుల సైన్యాన్ని మిడతమీదకు వదలడం గొప్ప పరిష్కారంగా చాలా చోట్ల విజయవంతంగా గమనించారు కానీ బాతుల్ని పొదిగించడం పెంచడం టైం తీసుకునే ప్రక్రియం. ఇప్పుడున్న ప్రతి బాతుగుడ్డునీ హేచరీస్ లోకి తరలించి బాతుపిల్లలుగా మార్చినా వర్షంలా కురుస్తున్న మిడతలను ఎదుర్కొవడం సాధ్యం అయ్యే పనికాదు.
ఉగాండా చూపిస్తున్న మరో దారి.
నీ మీదకు విసురుతున్న రాళ్ళతోనే కోటకట్టుకోవడం
ప్రారంభించు అన్నది ఒక ప్రసిద్ధ సామెత దాన్ని అక్షరాలా మిడతల విషయంలో అమలు
జరుపుతున్నారు ఉగాండా వాసులు.
పంటలు నాశనం చేసిన మిడతలని ఫ్రై చేసుకొని తింటున్న యుగాండా ప్రజలు !
ఉగాండాలోని గోగో గ్రామానికి చెందిన క్రిస్టీన్ అబాలో అనే మహిళ తమ పూర్వీకులు మిడతలను ఆహారంగా తినొచ్చని చెప్పారు అంటోంది. కుప్పలుగా సులభంగా దొరుకుతున్న వీటిని మొదట బాగా ఉడికించి రెక్కలు వగైరా శుభ్రం చేసి బాగా వేయించి కావలసిన పదార్ధాలను వేర్వేరు కాంబినేషన్లలలో కలిపి చక్కటి ప్రోటీన్ ఆహారంగా వీటిని తింటున్నారట.
మిడతల్లో మనిషికి హాని కలిగించే రసాయన పదార్ధాలు లేకపోయినా రుచికి అలవాటు పడతారులే అని సర్ధుకున్నా మరి వాటిమీద అప్పటికే ఏమన్నా క్రిమిసంహారకాలు చల్లబడి వుంటే ప్రమాదం కాదా అని వాపోతున్నారట బుద్ది జీవులు కాకపోతే మనం తినే ప్రతి కూరగాయ మీద వుండే రసాయనాలతో పోల్చితే వీటివీద చల్లిన క్రిమిసంహారకాలు ఒక లెక్కా అయినా మాంసాహారం తగినంత వేపకుండా ఎలాగూ తినం కదా అని సులభంగా సమాధానం ఇచ్చేస్తున్నారు.
ప్రపంచం ముందున్న అవసరం అనుకోకుండా ఇలా ముందుకొచ్చింది.
2050 నాటికి ప్రపంచ జనాభా 970 కోట్లకు చేరుకుంటుందని ఓ అంచనా. అంతటి జనాభాకు సరిపడా ఆహారం కావాలంటే, ప్రస్తుతం ఉన్న ఆహార ఉత్పత్తి ఎన్నో రెట్లు పెరగాల్సిన అవసరం వుంది. మొక్కలనుంచి వచ్చేది ఎక్కువగా పిండిపదార్దాలే ప్రోటీన్ అంటే మాంసకృత్తులు మానవ శరీరానికి అత్యంత అవసరమైన పదార్దం దానికి ఇప్పటి జంతువుల పక్షుల సాగు సరిపియేలాగా లేదు. అందుకే ఆర్ధోపొడా వర్గాలకు చెందిన అనేక కీటకాలు (పురుగులు అంటే మనకు ఇబ్బందిగా అనిపించొచ్చు కానీ) తినడం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో తలెత్తే ఆహారలోటును భర్తీ చేయవచ్చని ప్రపంచ ఆహార సంస్థ ఎప్పటినుంచో చెపుతోంది.
ఇప్పటికే నెదర్లాండ్స్, ఆఫ్రికాల్లో కీటకాల పెంపకం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాపారం 2023 నాటికి రూ.8,575 కోట్లకు చేరుతుందని ఒక ఫుడ్ మ్యాగజైన్ చెపుతోంది.
ఈ మిడతలు మనిషి తినదగిన కీటకాలే అని అవి ఆరోగ్యవంతమైనవని, వాటిల్లో మంచి పోషక పదార్థాలు, ప్రొటీన్లు ఉంటాయని ఇప్పటికే వీటికి కేలరీల గురించి ఆహారవిలువల గురించి చేసిన పరిశోధనలు నిరూపిస్తున్నాయి. అంతే కాకుండా అవి మనకు ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా దొరుకుతాయి. అదే ముక్క లెక్కా పత్రాలతో చెప్పాలంటే ప్రపంచంలో తినదగిన ఇటువంటి కీటకాల సంఖ్య 10 క్వింటిలియన్ (ఒకటి పక్కన 18 సున్నాలు ఉంచితే వచ్చే సంఖ్య) ఉంటుందట. ప్రపంచంలో మనిషి ఆహారానికి 1,900 రకాల కీటకాలు ఉపయోగపడతాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ తెలిపింది.
కీటకాల పెంపకం సులభం మాత్రమే కాదు పర్యావరణహితం కూడా
వివిధ జంతువుల పెంపకం, వ్యవసాయంతో పోలిస్తే,
కీటకాల సాగు ద్వారా చాలా తక్కువ కర్భన ఉద్గారాలు వెలువడతాయి ప్రపంచవ్యాప్తంగా
మనిషికి చెందిన మొత్తం కర్బన్ ఉద్గారాల్లో వ్యవసాయం నుంచి మాత్రమే 25% ఉద్గారాలు
విడుదలవుతున్నాయి.
ఉదాహరణకు ఏదైనా జంతువు కేజీ బరువు పెరగాలంటే దానికి 8 కేజీల
దాణా అవసరం. కానీ, కీటకాలు అలా కాదు. వాటి రక్తం వేడిగా కాకుండా
చల్లగా ఉండటంతో, సగటున 2 కిలోల ఆహారానికి 1 కిలో ‘కీటక
ద్రవ్యరాశి’ వస్తుంది.
ఆ రకంగా మనిషికి సూపర్ ఫుడ్ అనదగ్గ లక్షణాలున్న ఆహారం కీటకాలే
ఫుడ్ గా ఎన్ని పదార్ధాలు తిన్నా సుపర్ ఫుడ్ అనడానికి కొన్ని లెక్కల్లో చూస్తారు. ఆహారంగా ఆ పదార్ధం ప్రపంచ వ్యాప్త అందుబాటు, పెంపకంలో సౌలభ్యత, పర్యావరణ హితపు తక్కవు కర్భన ఉద్ఘారాల పెరుగుదల, తక్కువ పరిమాణంతో ఎక్కువ శారీరక పోషణ చేయగల సామర్ధ్యం ఇటువంటి అనేక లక్షణాల్లో ఆర్ధ్రోపొడాకు చెందిన అనేక కీటకరాజాలు ముందున్నాయి. వాటిల్లో ప్రొటీన్, మినరల్స్, అమైనో యాసిడ్‌లు అధికంగా ఉంటాయి, వీటికి జీవ వ్యర్థాలను ఆహారంగా ఇవ్వవచ్చు. జంతువుల పెంపకంతో పోలిస్తే.. కీటకాల పెంపకానికి తక్కువ స్థలం, తక్కువ నీరు అవసరం అవుతుంది
ఈమధ్య కాలపు సక్రమ ఆరోగ్య పోకడ
రుచిని డామినేట్ చేస్తూ ఆరోగ్య అభిరుచి
ఇవి మీ ఆరోగ్యానికి మంచిది అంటే దాని రుచితో సంభందం లేకుండా కొబ్బరినూనె తాగటానికైనా, గడ్డిని జ్యూస్ చేసుకుని తాగటానికైనా తొందరగా అలవాటుపడగలగటం ఒక పాజిటివ్ ఆరోగ్య స్సృహ సరైన పద్దతిలో అందవలసిన సమాచారం అధికారికంగా అందితే మనిషి తప్పకుండా సమస్యనుంచి అవకాశాన్ని వెదుక్కోగలుగుతాడు.
మూడు దొంతరల్లో విషయం ముందుకు తీసుకెళ్ళొచ్చేమో
ప్రమాదం లేదు అని తెలియడం,
ఆహార విలువలు ఏమున్నాయో అర్ధం కావడం,
రుచిగా వండుకునే అవకాశం వుందని నమూనాలు చూపడం అందుబాటులో ఉంచడం
అవి సహజంగానే వచ్చినవి కావచ్చు లేదా కొన్ని అనుమానాలున్నట్లు ఎక్కడో ల్యాబ్ లో తయారుచేయబడి శత్రుదేశాలు వదులుతున్నవే కావచ్చు. దీనికి కొలతగా స్త్రీ, పురుష జీవుల్లో వుండే వ్యత్యాసం లాంటివి చెప్తున్నారు. గత చరిత్రలోనూ ప్రపంచం ఈ మిడతల దాడిలో కరువులకు గురైన సందర్భాలున్నాయి. గాలి మా రాష్ట్రం వైపు వీయకూడదు, మళ్ళీ గాలివీచి కొట్టుకుపోవాలి అనుకుంటూ గాలిలో మిడతలకు అదృష్టమా నీవే దిక్కుఅనుకోవడం కంటే మరికొన్న ప్రత్యామ్నాయ పోరాట మార్గాలను ఆలోచించాల్సిన అవసరం ముందుంది బహుశా ఇదే కాకపోవచ్చు ఇంతకంటే బాగుండేమరేదైనా ముందుకు తెచ్చినా సంతోషంగా.
మీ
@Katta Srinivas
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి