కట్టా శ్రీనివాస్ || త్వమేవహం ||

కట్టా శ్రీనివాస్ || త్వమేవహం   ||

నిజంగా
నాకప్పుడు తెలియదు.
ఒక పుట్టుక కోసం
సృష్టి ఎదురుచూస్తూ ఉందని.
కొందరికెప్పటికీ తెలీదు.


సమాజ మహాయంత్రం లోనైనా
అతిచిన్న నట్టూ ముఖ్యమే,
దానికంటూ ఒక పనుంటుంది.
ఆదింకెవరూ చేయలేనిది.


మనమూ అంతే
వ్యక్తులం


శాశ్వత అస్తమయాలు లేనట్లే
నిరర్ధక ఉదయాలూ ఉండవు.


గ్లోబు నిండారా ప్రాణికోటి
చిన్న  ఉషోదయం కోసం
చీకటికళ్ళతో వేచి చూస్తున్నాయని
తూరుపుకొండల కడుపులో
ఎదిగే ఎర్రటి ముద్దకు తెలీదేమో!

*^
దేహపు నౌక నడవడానికే ఇంధనం !!
ఇంధనాన్ని తాపటానికే
బండి కొంటోంది ఎవరర్రా?


........
తేదీ : జూనొకటి ఇరవైయ్యిరవై
ప్రాచ్య పాత వాచకం
నూతనాశ్వాసం
కవిసంగమం లో ప్రచురితం


కామెంట్‌లు