బహుముఖ ప్రతిభ తో అబ్బుర పరిచే కవి "కట్టా శ్రీనివాస్

కరోనా .."కాలమ్".40

*బహుముఖ ప్రతిభ తో అబ్బుర పరిచే కవి
"కట్టా శ్రీనివాస్ " !!

కవిత్వం,చరిత్ర పరిశోథన, సినిమా సమీక్షలు,కథలు
వైజ్ఞానిక విశేషాలు, వ్యవసాయిక విశేషాలు ఇలా..
విషయం ఏదైనా ' కట్టాశ్రీనివాస్ ' ' చేతిలో మైనపు ముద్దలా కరిగి పోవాల్సిందే..మాధ్యమం ఏదైనా
కట్టా రచనకు పాఠకులు బ్రహ్మరథం పట్టాల్సిందే.
ఓ  సర్కారీ బడిపంతులు ఇలా.. బహుముఖ ప్రతిభతో రాణించడం అరుదైన విషయం.

కవిసంగమం ప్రారంభంలో కవియాకూబ్ కుడిభుజం
గా టెక్నికల్ విషయాల్లో తోడుంటూ అనేక కార్యక్ర
మాల్ని నిర్వహించాడు. వృత్తిరీత్యా హైస్కూల్ లో ఇంగ్లీషు ఉపాధ్యాయుడైన కట్టా శ్రీనివాస్ తెలుగు రాతలలో తన సత్తా చాటుతున్నాడు. డిప్యుటేషన్ పై కొన్నాళ్ళు.MLA  గండ్ర వెంకటరమణారెడ్డి గారి దగ్గర,మరికొన్నేళ్ళు విద్యావేత్త MLC ప్రొఫెసర్
కె నాగేశ్వర్ గారి దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసాడు. అప్పటి హైదరాబాద్ జీవనం తనకు ఎన్నో పరిచయాలతో పాటు ఎంతో అనుభవాన్ని కూడా ఇచ్చిందంటాడు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో కలిసి10 టివి ప్రారంభ సమయంలో‌ హన్స్ఇండియా
పత్రికలో పనిచేస్తున్నప్పుడు మీడియాను సీరియస్ గా తీసుకోవాలనిపించిందట.

ఖమ్మంజిల్లా సత్తుపల్లిలో  పుట్టిన శ్రీనివాస్ తన విద్యాభ్యాసం అక్కడే పూర్తి చేసుకుని 1998లో ఉపాధ్యాయుడిగా తొలి నియామకం పొందాడు. వేర్వేరు బాధ్యతల్లో వివిధ ప్రాంతాల్లో తిరిగి ప్రస్తుతం ఖమ్మం లో ఉంటున్నాడు. కవిగా ఒకవైపు తాత్త్వికత మరోవైపు సామాజిక స్పృహ అతని కలానికి రెండు
ముఖాలుగా చెప్పుకోవచ్చు.  కట్టా రాసిన
"బహుధాబలి" కవిత బాహుబలి సినిమాను ఆధా
రంగా చేసుకుని రాసింది. బాహుబలి అవంతికను ప్రేమించడం కాదు ఆక్రమించడం అంటాడు.అలాంటి
దుర్మార్గమే సమాజంపై కూడా జరుగుతోందన్నది
ఆయన అభిప్రాయం.ఇలా అసాధ్యమైన పోలికల్ని అలవోకగా‌ చేసి చూపిస్తాడు కట్టా..

*సాహిత్యం..!!

2001లో తన మిత్రులు దాసరి రాజబాబు, మోరంపూడి నిర్మల్ కుమార్ లతో కలిసి
*మూడు బిందువులు’’ ,అనే హైకూ సంకలనం వెలువరించాడు, 2012 లో ‘‘ మట్టివేళ్లు’’ పేరుతో తన తొలి కవితా సంపుటిని తెచ్చాడు. దానికి ముందు మాట రాస్తూ స్థిమితత్వమే కట్టా శ్రీనివాస్ కవిత్వంలో మూలసూత్రం అంటాడు అఫ్సర్ 

*తాత్విక కవి…!!

మనిషి తత్వాన్ని అర్థం చేసుకొని జీవితంలో తాత్వికతను రంగరించి కవిత్వం రాయడంలో
దిట్ట కట్టా శ్రీనివాస్.అందుకే కట్టా కవిత్వం నాకు బాగా నచ్చుతుంది.కట్టా రాసే తాత్విక కవిత్వం
మనిషిని ఓ పీక్ కు తీసుకువెళుతుంది.భుజం
తట్టి “ఇదిగో..ఇదే నీ అసలు రంగు..ఇదే నువ్వు “
అంటూ…. మన లోపలిమనిషిని బయటకు తెస్తుంది.  మాయమైపోతున్న ‌మనిషితనాన్ని
పట్టిస్తుంది.

“జనాలతో కలిసేదారిలో
కరుకుముళ్ళు రాక్కు పోతున్న నొప్పి.

పదునెక్కిన దృక్పథాలు
గిడసబారిన మనసులు
తుప్పుపట్టిన భావాలు
కలివిడిగా వుండేలోగానే
కలుక్కుమనిపిస్తున్న నొప్పి.

గుచ్చుకుంటున్నందుకు కాదు
మెత్తగా మార్చలేకపోతున్నందుకు నొప్పి.

మెత్తబరిచే తడి ఊటే లేనందుకు నొప్పి.

మెత్తబడితే పదునులోకంలో బతకలేమనే ముళ్లపొదలు ఏపుగా పెరిగినందుకు నొప్పి.

గిడసబరిచే కేంద్రాలు లాభాల్లో తేలుతున్నందుకు నొప్పి

బండలను ఢీ అంటూ పగలగొట్టే
గుండెల్లో సన్న ఊట చెలిమైనాలేనందుకు నొప్పి.

ఊట అనవసరం అనేదే పెద్ద పాఠం అయినందుకు నొప్పి.

ఇంతకంటే ఏమీ చెప్పలేనందుకు...."!!

"తడిలేని పాదు".
తేదీ-09-2018

బండల్ని సైతం  'ఢీ ‘ కొట్టి పిండి చేయగల చేవ
వున్న మనిషి గుండెలో కనీసం సన్నని  ఊట
చెలమైనా లేనందుకు నొప్పి .' అసలు ఊట అనవసరం..గుండె గిడసబారి రాటుతేలడమే
మేలన్న ' వాదన పెరిగినందుకు కవి గుండెకు
నొప్పి. ఏదైతేనేం? ఏమైతేనేం మనిషి గుండె
గట్టిపడింది.గుండెతడి తగ్గి మనిషితనం చచ్చి
పోయింది. మనిషి గుండె పొడబారింది.దీన్ని
మెత్తబరిచే ఉపాయం కరువైంది. కవి గుండె
కాస్తా ' చెరువైంది.'

2.మరో కవిత.."పూర్ణమేవావశిష్యతే”.....!!

"నువ్వు వెళ్లి పోయాక
లోకమెలా పయనిస్తునే వుంటుందో చూడాలనివుందా!”?

కవి మన  చేయిపట్టుకొని  తనతో ట్రావెల్
చేయిస్తాడు. ఈ ఆలోచనలోని మంచి చెడ్డల్ని విశ్లేషిస్తాడు.అసలు ఇటువంటి ఆలోచన రావడం మంచిదేనా? అన్న విషయమై చర్చిస్తాడు.
ఇది ఓరకంగా తాత్త్విక పరమైన ప్రయాణంగా కనిపిస్తుంది కానీ,నిజానికి ఇందులో
తాత్త్వికత కంటే హేతుబధ్ధతే ఎక్కువ.మరణం తర్వాత మనిషి అస్తిత్వం ఏమిటి?
మనిషి తానున్నంత వరకు అన్నీ నావే అనుకుంటాడు.సమస్తం తనే అనుకుంటాడు.
మరి తానే వెళ్లిపోయాక ... అంతా తానే అనుకున్నదీ,,అన్నీ తనవే అనుకున్నవీ…..
ఏమైపోతాయి? తను లేకుండా అవి ఎలా వుంటాయన్న మనిషి జిజ్ఞాసలో అర్ధముందా?
సమాధానానికి అందని ప్రశ్నలేం కావివి.వీటికి సమాధానాన్ని వెదికే ప్రయాణమే ఈ కవిత.

నిజానికీ ప్రతీ మనిషీ ఆలోచించాల్సిన అతి ముఖ్యమైన విషయమిది..దీనికోసం
హిమాలయాలకెళ్లి ముక్కుమూసుకొని తపస్సు చేయాల్సిన అవసరం లేదు.ఇంట్లోనే ఓ మూల
కళ్లు మూసుకొని మససు లగ్నం చేసి ఆలోచిస్తే సరిపోతుంది. “ నేను” “నాది,” ‌అనే మూలాల్లోకి
మనం జొరబడితే మనమేంటో తెలుస్తుంది.
అప్పుడు మన తర్వాత నేను,నాది అనుకున్నవి
బోధపడటం మొదలవుతుంది.

*కుండలకొద్దీ బళ్లున కుమ్మరిస్తున్న వెచ్చని వెలుతురులో
లోపల దేన్నో కడుగుతున్నట్లవుతుంది
…………………….
దీర్ఘకాల సుప్తావస్తలో
మొద్దు నిద్రపోతున్న మెదడు మూలాలను తట్టినట్లవుతుంది

అయితే ఇప్పుడు
నువ్వసలేం మిగలకుండా పోయాక
నిలబడేదేమిటో వెదకాలని వుందా!

ఇనప్పెట్టల కలల్నీ, కుర్చీల ఎత్తుల్నీ,
యవ్వనపు సవ్వడుల ఎండమావుల్నీ,
చీకటి చు.క్క.ల..మత్తునీ దాటుకుంటూ
నడవాలని వుందా?

ఇదిగో ఈ చిన్న వెలుతురిని అంటించుకో
కనీసం అది తర్వాత వేసే అడుగు
పరుచుకున్నా చాలు
లోలోపల వేల మైళ్ళ ప్రయాణం ఏదో నాడు పూర్తవుతుంది.

హుష్….!
ఇలా కూడా వెదిక
దాచుకున్న జ్ఞాపకాలు సైతం దేహంతో పాటు కాలిపోయాక
ఈ వెతుకులాట ప్రయోజనాల్ని విశ్లేషించాలని వుందా?
అయితే…!

మళ్లీ మొదటి లైను దగ్గర నుంచే
చదువుకుంటూ రా…..!!” .

ప్రతి జీవితంలోనూ కొన్ని బాధలూ,దుఃఖాలూ,
అసంతృప్తులూ,ఆవేదనలూ,సంవేదనలూ
వుంటేనే కానీ మానసానికి పదునెక్కదు.బుధ్దికి పనిబడదు.అప్పుడే తోటి మానవుడి వెలుగు
నీడలను అర్ధం చేసుకోలేము.గతంలోకి ఓసారి వెళ్లొస్తే దీర్ఘకాల సుప్తావస్థలో వున్న మెదడు
మూలాల్ని తట్టిలేపవచ్చు! ఇప్పడు మనం
అసలే లేనపుడు ఓ సారి వెనక్కు తిరిగి చూసు
కుంటే మిగిలిందేమిటో వెతుక్కోవాలి….!

మనం లేకపోయినా మన మంచితనం ఏమైనా మిగిలుందా?

మనం లేకపోయినా మన జ్ఞాపకాలు ఇంకా ఆకుపచ్చగానే వున్నాయా?

మనం వదిలి వచ్చిన అడుగులు నడవడానికి ఎవరికైనా పనికొస్తున్నాయా?

మనం లేకున్నా..మన తాలూకు తడి ఎవరి గుండెల్లో అయినా చెమ్మగా మిగిలిందా?
ప్రతీ మనిషి చావుకు ముందే తన్ను తాను తడిమి  చూసుకోవాల్సిన ముఖ్య విషయాలివి.

బతికున్నపుడు ఇనప్పెట్టెలు నిండాలని కలలు కంటాం.రాజకీయ కుర్చీకోసం,అధికారం కోసం
పాకులాడతాం.యవ్వనపు సవ్వడుల ఎండమావులుకోసం తాపత్రయపడతాం.
చీకటి చుక్కల మత్తులో చిత్తవుతాం..ఈ వికారపు చేష్టలను దాటి ముందుకు నడవాలనుకుంటే..
మనిషి వాసనను అంటించుకోవాలి.మానత్వపు వెలుగులో ప్రయాణించాలి.కనీసం అది..తర్వాత వేసే అడుగు పై పరచుకున్నా చాలంటాడు కవి..
ఇదే నిజమైన జీవిత లక్ష్యమంటాడు. దీన్ని 
గుర్తెరిగి నడుచుకున్నప్పుడే మనిషి లోలోపల
వేల మైళ్ల ప్రయాణం ఏదో ఒక నాటికైనాపూర్తవు
తుందన్నది కవి ఆశ.  .

మనిషి తన దేహంతో పాటు తాను దాచుకున్న జ్ఞాపకాలు కాలి బూడిదయ్యాక వాటికోసం వెదుకులాటలో అర్ధం లేదన్నది కవి అభిప్రాయం.మరణం తర్వాత మిగిలేది మనం చేసిన మంచి మాత్రమే.బతికున్నపుడు మంచిని మిగుల్చుకొనేప్రయత్నం చేస్తే బాగుంటుంది.
అంతేగానీ చచ్చి,దేహం కాలి బూడిదై పోయాక కూడా..స్వార్ధంతో ఇంకా  ’నాది,’నావాళ్లు అని
పాకులాడటం వృధా ..వృధా!  అన్నది ఈ కవిత పిండితార్ధం.“తన్ను తా తెలిసిన తత్వమేల?”.
నిన్ను నువ్వు తెలుసుకుంటే ఇక తత్త్వాలతో పనేముందంటాడు వేమన..  తనవెంటజనుదెంచు వారలెవ్వరు? చేసిన పాప పుణ్యములు గాక”
అని అన్నమయ్య చెప్పడంలో కూడా అర్ధం ఇదే.
"పూర్ణమేవావశిష్యతే" ….!!!

*చరిత్రకారుడిగా…!!

చరిత్రకారుడిగా క్రొంగొత్త విషయాలకు అక్షరాల సొబగులద్దడం కట్టా ప్రత్యేకత. నాగులవంచ అనేది ఖమ్మంజిల్లాలో ఒక చిన్న గ్రామం ఆంధ్రదేశ చరిత్రలు, తెలుగునాట వచ్చిన పరిశోధనల్లోనే కాదు గూగుల్ లో వెతికినా ఎక్కడా దాని ఆనవాళ్ళు  కనిపించవు. కానీ ..ఆక్కడి మట్టి కోట..దాని చరిత్ర…. ఆ ఒక్క ఊరుపైనే ఒక  పుస్తకమంత చరిత్రను వెలికి తీశాడు
కట్టా శ్రీనివాస్.

నాలుగు వందల యేళ్ల‌క్రితం తీరప్రాంతం కాక
పోయినా అది డచ్ వ్యాపార కేంద్రం గా
వుండిందని.అక్కడి విశేషాలు ,పోరాటం గురించి
వివరించాడు. ..బహుశా అదే భారతదేశంలోని
తొలి స్వతంత్ర పోరాటం కూడా కావచ్చనీ బోలెడు విశేషాలు వెలుగులోకి తెచ్చాడు. 2019 అక్టోబర్ 13న నాగులవంచ పోరాటం విజయవంతమైన రోజునాడే తన పుస్తకాన్ని  అదే గ్రామంలో ఆవిష్క
రించాడు. అలాగే కూసుమంచి లోని  గణపేశ్వరా
లయంపై 2015 లో ఆ గుడికి సంబంధించిన తొలి ఏకైక పుస్తకం విడుదల చేసాడు.

అలాగే మైలారం నల్లగుట్టల్లోని తెలంగాణలోని పెద్ద తొలి రాతి గుహలను గురించి పరిచయ వ్యాసం, పూణే లోని నానే ఘాట్ శాసనాల గురించి, చింతపల్లి వలస కొంగల గురించి ఇలా అనేకానేక వ్యాసాలు పత్రిక‌ల్లోనూ,  ఫేస్ బుక్ లోనూ ప్రచు
రించాడు. నిరంతరపరిశోథనల సత్యాన్వేషి  కట్టా‌ బస్తర్ విశేషాలను, అక్కడి కాకతీయుల వారసుల వలస గురించి వెలికి తీశాడు.

చత్తీస్ ఘడ్ కి, తెలంగాణా మూలాలున్న శాసనాల కోసం పూణే లోని నానేఘాట్ శాసనాల చూస్తూ, మధ్య ప్రదేశ్ లోని బింబెట్కా (భీముని ఆసనం) రాతి చిత్రాలు, బోజుడి శివాలయం, వడదాం ఫాజిల్ ఫారెస్ట్ లాంటి పక్క రాష్ట్రాలలో మన ఆనవాళ్ల పరిశీలించాడు..అంతే కాదు తనున్న చోటతిరుగు
తూ ఆ విశేషాలను కూడా  గుది గుచ్చడం శ్రీనివాస్ ప్రత్యేకత. తను హైదరాబాద్ లో వున్న ఐదున్నర ఏళ్ళలో రోజువారీ బిజీ విధులు పోగా మిగిలిన సమయాన్న కొంత కవిత్వం కోసం కేటాయిస్తూ
వచ్చాడు. హైదరాబాదు వివిధ ప్రాంతాల ఫోటోలు తీసుకుంటూ వాటి విశేషాలను పేస్ బుక్ లోని హైదరాబాద్ హిస్టరీ అనే గ్రూపులో వివరించాడు. ఒక పోస్టులో ఒక ప్రాంతపు విశేషాలు ఒకే దగ్గర పోగుపడేలా దాని అనుబంధ సమాచారం అంతా అదే కామెంట్ లింకు లో వచ్చేలా ఆ గ్రూపును
నిర్వహించాడు.

తన సొంత జిల్లా  ఖమ్మంపై అవకాశం వున్నంత మేరకు లోతైన పరిశోథన చేస్తూ నాగుల వంచ
వంటి వినూత్న అంశాలు, ఐదు కొత్త శాసనాలను, శిలాజాల ఆనవాళ్లను, సంస్థానాలు, గడీల ముచ్చట్లు, చారిత్రక వ్యక్తులు, వంటి వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నాడు.

జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పరిశోథనా పత్రాల  సమర్పణ రాక్ ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా (RASI) శాశ్వత సభ్యుడిగా ఆదిమానవుడి కాలంనాటి రాతి చిత్రలపై లోతైన పరిశోథనలతో పాటు వాటిని సదస్సులలో సమర్పిస్తున్నాడు.
ఉదాహరణకు ఆ రాతి చిత్రాల రంగులపై రామన్ స్పెక్ట్రా పద్దతిలో మిల్లీ మీటరు రంగు వృధా పోకుండా అందులోని పదార్ధం ఏమిటో వివరిస్తూ శ్రీనివాస్ సోదరుడు జ్ఞానేశ్వర్ సహకారంతో చేసిన ప్రయోగాలు మన్ననలు పొందాయి.

తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ లోనూ, వివిధ విశ్వ
విద్యాలయాల సదస్సుల్లోనూ ఇతని పత్రాలు ఆమోదం పొందాయి. కాలేజీ చదువుల్లో సైస్సు విద్యార్ధి (బయోలజీ )అయిన శ్రీనివాస్ తన చరిత్ర పరిశోథనలు కూడా శాస్త్రీయ పద్దతిలో సాగాలని కోరుకుంటాడు. సాంకేతిక అంశాలలో ముందడుగు
లో‌‌ 1999జనవరిలోనే (ఉద్యోగం వచ్చిన తొలి
రోజుల్లో)ఒక కంప్యూటర్ శిక్షణా కేంద్రం స్థాపించిన శ్రీనివాస్ తన ప్రవృత్తికి అవసరమైన అంశాలను ఎప్పటికప్పుడూ నేర్చుకుంటూ మిత్రులకు తెలిపేం
దుకు ప్రయత్నం చేస్తుంటాడు.

జనార్ధన్ గారు నిర్వహించే' కంప్యూటర్స్ ఫర్ యు' అనే తెలుగు టెక్నికల్ మాస పత్రకలో అనేక నెలల పాటు కాలమ్ రాశాడు.. కవిసంగమం గ్రూపులో వారం వారం పిన్ పోస్టుగా ‘‘టెక్ సంగమం’’ పేరుతో 39 ఆర్టికల్స్ రాసాడు.

వికీపిడియన్ గా తన పుస్తకాలనూ అంశాలనూ ఉచిత లైసెన్స్ పరిథిలోకి తీసుకువస్తూ
వికీపిడియాలో పుస్తకాన్ని ఉచిత లైసెన్సులో
విడుదల చేస్తే ఎవరైనా దాన్ని చదువుకోవచ్చు
 అలా తన గణపేశ్వరాలయాన్ని సిసి బై లైసెన్సుతో విడుదల చేసాడు, వికీ వారి ట్రైయిన్ ద ట్రైనర్ కార్యక్రమానికి బెంగళూరు సదస్సులో ప్రతినిథిగా పాల్గొన్నాడు.

ప్రపంచ మహాసభల సందర్భంగా నిర్వహించిన డిజిటల్ తెలుగు సదస్సులో ప్రాతినిధ్యం వహించాడు. యూనికోడ్ ప్రాచుర్యంలో పాత్ర వహించాడు. తెలుగు శాసన పాఠాల్లోని ప్రతి పదం సెర్స్  కి అందుబాటులో వుంటే చరిత్ర పరిశోథన మరింత సులభం అవుతుందంటూ కాకతీయ శాసనాల ఇండెక్స్ సార్టబుల్ పద్దతిలో వికీలోకి చేర్చాడు. వికీలో ఇతను రాసిన 'కలివికోడి: లాంటి విశేష వ్యాసాలు పలువురి మన్ననలు పొందాయి.
కథకుడిగా సైన్సు ఫిక్షన్ తో పాటు సామాజిక అంశాలతో ముందుకు వెళుతున్నాడు కట్టా..

అలాగే‌‌మహిళల పై జరుగుతున్న లైంగిక దాడులపై మూలకారణం వెతుకుతూ ‘‘మగకాలువ’’ అంటూ ఎండోక్రైన్ గ్రంధులను ఉటంకిస్తూ మరో కథ రాశాడు.సాయిపాపినేని గారు విజయవాడలో చరిత్రను కల్పనాత్మకంగా తీర్చిదిద్ది పాఠకులకు అందించడం ఎలాగనేదానిపై నిర్వహించిన 'కాలయంత్రం'  వర్క్ షాప్ లో అతిథిగా పాల్గొన్నాడు.

పర్యావరణ ప్రేమికుడిగా హౌ డేర్ యూ అంటూ అగ్రరాజ్య అధిపతిని నిలేసిన ‘‘గ్రెటా థెన్ బర్గ్’’ గురించి ఆవిడ ఉపన్యాసంలోని విశేషాలతో 2019లో ఒక పుస్తకం వెలువరించాడు. ఇతని కలంనుంచి వెలువడిన మరెన్నో విశేషాలు పుస్తకాలుగా రావలసి వుంది.

*ఫేస్ బుక్ పోస్టులు..!!

'శివనగర్ మెట్లబావి' పై రాసిన వ్యాసం పేస్ బుక్
లో ఎందరిదో అటెంన్షన్ తో పాటు 7 వేల షేర్లు సాధించింది
https://www.facebook.com/nivas.katta74/media_set?set=a.1192188010805715&type=3
హల్దర్ నాగ్ అనే కవి గురించి హలధరుడు కలధరుడూ అంటూ రాసిన వ్యాసం వేలాది షేర్ష్ లో ఇదొకటి
https://www.facebook.com/nivas.katta74/media_set?set=a.1167290906628759&type=3

*వ్యవసాయం గురించి..!!

వ్యవసాయమో, పశుపోషణో యాంత్రికంగా చేసే వృత్తి పనికాదు. ప్రకృతిని అర్థం చేసుకుంటూ.. దానికనుగుణంగా నడుచుకునే కార్యాచరణ. జీవన విధానం. ఆకాశాన్నీ, భూమిని అర్థం చేసుకుంటూ రైతు నేర్పుగా అడుగులేయాలి. తద్వారా….
వ్యవసాయంలో, రైతు జీవితంలో ఏర్పడిన సంక్షోభాన్నుంచి దూరమవ్వాలి.

పిల్లలమీద కోపం వస్తే ‘‘ ఒరే మట్టి పిసుక్కుంటూ పోతావురా’’ అనేది వారిని దారుణంగా కించపరుస్తున్నాం అనుకుంటూ వాడే ఒకానొక తిట్టు, కానీ ఈ తిట్టే మన సమాజపు తిండి గింజలన్నీ మట్టిగొట్టుకు పోయేలా చేస్తోంది తెలుసా? వ్యవసాయం అంటే చాలా చులకన పని అనే భావజాలాన్ని వ్యాపింపజేసే ఇటువంటి దోరణి కొంత కొంత మారుతోంది. చదువంటే కేవలం కూర్చుని తినేందుకు మార్గం కాదు. జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పెంచుకునే సాధనం అనే విజ్ఞత పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలో, లేదా కాలరు నలగని ఉద్యోగాలో మాత్రమే గొప్పవి అని కాక నేటి అవసరాలను తీర్చుతూ, మన శ్రమను, జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోగలిగినది ముఖ్యంగా మన మనసుకు నచ్చేదీ ఏ పని అయినా మంచిదే అనే సక్రమమైన ఆలోచన చివురులు వేస్తోంది. అంటూ వ్యవసాయ విశేషాలు ఒక దగ్గర చేర్చాడు.
https://www.facebook.com/nivas.katta74/media_set?set=a.1270830819608100&type=3

బాహుబలి సినిమాలో అవంతిక పై జరిగింది రేప్ అంటూ సామాజికకోణంలో కొత్త భాష్యం చెప్పిన కవిత ‘‘బహుధాబలి’’
https://antharlochana.blogspot.com/2015/10/blog-post.html (బ్లాగులో)
https://www.facebook.com/groups/kavisangamam/permalink/1032871393432279/ (కవిసంగమంలో)
రూమీ కవిత్వ అనువాదాలు చక్కటి బొమ్మలతో ఆల్బంగా
https://www.facebook.com/nivas.katta74/media_set?set=a.2122053824485791&type=3

*టెక్నికల్ విషయాలు..!!

23-5-2016 నుంచి 30-01-2018 వరకూ  39 ఆర్టికల్స్ కవిసంగమంలో
https://www.facebook.com/media/set/?set=oa.1167025863350164&type=3
కట్టాశ్రీనివాస్ ‘‘అంతర్లోచన’’ బ్లాగు
http://antharlochana.blogspot.com/
అల్లూరిసీతారామరాజు చనిపోతాడా? వ్యాసం
https://antharlochana.blogspot.com/2014/06/blog-post_6534.html
బేట్రాయి సామి ఎవరూ అంటూ పవన్ కళ్యాన్ సినిమా పాటపై విభిన్న చారిత్రక వివరణ
https://antharlochana.blogspot.com/2013/08/blog-post_5.html

*హైదరాబాద్ చరిత్ర..!!

► హాలీ సిక్కా, బెల్లా విస్తా అంటే ఏమిటో విన్నారా?
► స్వర్గధామం అదే వుద్దేశ్యంతో ఇర్రం మంజిల్, ఎర్రమంజిల్ అయ్యింది.
► తొలి ఉర్దూ కవయిత్రి --- మాహలఖాబాయి "చందా" గురించి తెలుసుకోవాలా?
► ‘బాబ్-ఎ-హుకూమత్’ సచివాలయంగా ‘షా మంజిల్’ రాజ్ భవన్ గా ఎలా మారింది?
► కచ్ తెగ పేరుమీదుగా కాచిగూడానా?
► నిజాం వాడిన రోల్స్ రాయిస్ కారు ఇప్పుడెక్కడుంది?
► ‘కార్వా’ అంటే వ్యాపారం కోసం వచ్చి పోయే కూడలి
► పార్శీలు ఆరాధించే అగ్ని దేవాలయం(1904) హైదరాబాద్‌లో ఎక్కడుంది?
► హైదరాబాద్ చుట్టూ గోడ వేరు వేరు చోట్ల ద్వారాలూ వున్నాయా?
► మూసీ అంటే ముచుకుందా నదా? దానికి ఎన్నిచోట్ట వారధులున్నాయి?
► అరుదైన ఆఫ్రికన్ జాతి మహావృక్షం హైదరాబాద్ లో ఎక్కడుంది?
► మహాత్మా గాంధీనాటిన మామిడి చెట్టు ఇంకా హైదరాబాద్లో బ్రతికే వుందా?
► RTC బస్సుల రిజిస్ట్రేషన్ నంబర్లలో z వుండటం వెనక కారణం తెలుసా?
► 1812లో మౌలాలీ కమాన్ కట్టడం వెనక కారణం ఏమిటి?
https://www.facebook.com/groups/HistoryofHyderabad/

*కథకుడిగా..!!

మగకాలువ పేరుతో సారంగలో 2017లో ప్రచురితం అయిన తొలికథ
https://antharlochana.blogspot.com/2017/09/blog-post.html

కరోనా నేపథ్యంలో యుగాంతపు హెచ్చరిక పేరుతో సైన్సు ఫిక్షన్ కథ
https://www.facebook.com/photo.php?fbid=3223724350985394&set=a.104366492921211&type=3&theater

అంతమే ఆరంభం కథ
https://antharlochana.blogspot.com/2018/03/blog-post.html

ఇలా..."బహుముఖీన ప్రతిభ కలిగిన కట్టా శ్రీనివాస్ తో ఇప్పుడు మాట్లాడదాం..!!

*,నమస్తే శీను..(  నేను అలానే పిలుస్తా  )

*నమస్కారం అన్నగారు" (ఆయన అలానే 
 అంటాడు)

ప్ర. కరోనా లాక్ డౌన్ లో ఏం చేస్తున్నారు?

జ.ఇంట్లోనే రాయపనులు చూసుకుంటున్నా.!

ప్ర.చదివింది సైన్స్...చేసేది చరిత్ర పరిశోథన..
   ఎలా?

జ.చదువు బయాలజీ..వృత్తి అథ్యాపకత్వం.
   ప్రవృత్తి చారిత్రక పరిశోథన..వెరసి కట్టా
‌ ‌. శ్రీనివాస్.కొత్త విషయాలు తెలుసుకోవాలన్న
   ఆసక్తి వుంటే ఏమైనా చెయ్యొచ్చు.

ప్ర.కరోనా‌ గురిఃచి ఏమైనా రాశారా?

జ. రాశానండీ.. కరోనా నేపథ్యాన్ని తీసుకుని 
    ఒకప్పటి రాక్షసబల్లుల మరణాన్ని ఊహిస్తూ
    ఒక కథ రాశాను.అలాగే కొన్ని కవితలు కూడా.

ప్ర .కరోనాపై రాసిన రెండు కవితలు వినిపిస్తారా?

జ. అలాగే…

"మొదటిదీ కాదు ఆఖరుదసలే కాదు ||

"మొహాలను కోల్పోయిన వేళ

రాత్రి నిద్రపట్టక దొర్లుతుంటే
పిన్నుపీకిన ఉమ్మెత్తకాయ గ్రైనేట్లు
వీధులనిండా పొంగిపొర్లుతున్నట్లు కల.

మోహాలను కోల్పోయిన వేళ
పరుగులకు తాళం వేసుకుని
చుట్లూ గీసుకున్న వలయంలో
అమ్మకడుపులో బిడ్డనైపోయా

కంటికి కనిపించని శత్రువు
ఊహించలేనంత ఉత్పాతం
పుట్టని బిడ్డకూడా పోరాడుతోంది.
పదును తగ్గకుండా చూసుకోవాలంతే

మహా ప్రళయం కాదు
సవరణల పునర్నిర్మాణం
బూది కుప్పలు కాదు
ఫినిక్స్ పురరుద్థానం

మాట్లాడుతూ వుండండి మిత్రమా
పక్కనొకరున్నారన్న ధైర్యం చచ్చిపోదు.
విరామంలో బాణాన్ని లాగి వుంచండి
సదా మనసు దీపం మలగనీయకండి
.
Lets Break the chain Not the rules ' !!

బాగుందండీ..ఈ కవితలో " కరోనా 'అని ఎక్కడా
పేర్కొనకుండానే కరోనా గురించి చెప్పేశాడు కవి.
ముఖ్యం గా కరోనా లాక్ డౌన్ లో కాలు బయటకు
పెట్టలేని స్థితిని వర్ణించిన తీరు గొప్పగా వుంది.

మోహాలను కోల్పోయిన వేళ...చుట్టూ గీసుకున్న
వలయంలో అమ్మ కడుపులో బిడ్డపై పోయా.."!!
ఈ ఒక్క వాక్యం చాలు ఈ కవిత గొప్పదనానికి.
అలాగే కంటికి కనిపించని శత్రువుతో పుట్టిన బిడ్డ
కూడా పోరాడుతోందనడం.. పరిస్థితి తీవ్రతకు,
దయనీయతకు అద్దంపడుతోంది..బాగా రాశారు .

*ఇంకో కవిత…

*ఒకే చేతివేళ్ళు ||

*ష్ ష్ ష్

కొందరు నీళ్ళన్నీ సర్ది

నిమ్మలంగా ఉంచాలని చూస్తున్నారు.

బుడుంగ్

కొందరు మాటల రాళ్ళేసి

అలలను రేపి ఆడుకుంటున్నారు.

దానిపై నాదో

కాగితం పడవ

కదిలిన కదలకున్న

పోనీ మునిగినా

చూస్తూ చూస్తూ

ఉండటం  కాలక్షేపం.

రోజు గడుస్తుంది."!!

*కరోనాలో రోజులెలా గడుస్తున్నాయో..ఇందులో
దృశ్యీకరించాడు కట్టా.

"నీళ్ళన్నీ సర్ది నిమ్మళంగా వుండాలని చూస్తున్నారు.

*ఆ నీళ్ళలో కొందరు మాటల  రాళ్ళేసి అలలతో
 ఆడుకుంటున్నారు.

*ఆ నీళ్ళపై కవి  కాగితం పడవను వదిలాడు.
 ఆ పడవ కదిలినా…..కదలకున్నా..ఒక వేళ
 మునిగినా అలా చూస్తూ చూస్తూ కాలక్షేపం
 చేస్తున్నాడు..రోజు అలా గడుస్తోంది.ఒకే చేతికి
 అయిదు వేళ్ళున్నా..అవి సమానంగా లేవు.వాటి
 వ్యవహార శైలి కూడా భిన్నంగా వుంది. కరోనా
 కాలంలో జనం వైఖరికి అద్దంపట్టే కవిత ఇది.
 ఇందులో కూడా ' కరోనా ' పేరు చెప్పకుండా
 తెలివిగా రాశారండీ.

ప్ర.చివరగా కరోనా ను ఎలా చూడాలంటారు?

జ.కరోనాను "విపత్తు " గానే చూడాలి.
   దురదృష్టమేమంటే కరోనా ను అడ్డం
   పెట్టుకొని ప్రభుత్వాలు  రాజకీయం
   చేస్తున్నాయి.చాలా మంది కరోనాతో
   వ్యాపారం చేస్తున్నారు.అదే దురదృష్టం.

థ్యాంక్యూ శ్రీనివాస్.
ఉంటాను….

ఎ.రజాహుస్సేన్.!!

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి