గ్రామానికి పేరు తెచ్చిన శిలాజరాయి : హబర్ స్టోన్ (జైసల్మేర్,రాజస్థాన్)

 గ్రామానికి పేరు తెచ్చిన శిలాజరాయి : హబర్ స్టోన్ (జైసల్మేర్,రాజస్థాన్)


మీది చిన్న గ్రామమే కావచ్చు దానిలోని ప్రత్యేకతను మీరు కాపాడితే అది గ్రామాన్నే ప్రత్యేక స్థానంలో నిలబెడుతుంది. దానికి ఆలయాలు, శిల్పాలు, నిర్మాణాలు, నదీనదాలు లాంటివి వుండాల్సిన పనిలేదు కేవలం ఒక చిన్న రాయి ముక్క కావచ్చు. దానికి కోట్లాది సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు. కొంచెం ఆ కథేమిటో విని కల్పనలతో మహత్తులో మూర్ఖత్వాలతో మలినం చేయకుండా కొంచెం శాస్త్రీయవెలుతురు పరచుకునేలా చేస్తే ఏమో మీ గ్రామే ప్రపంచంలో ప్రత్యేకంగా చెప్పుకునేది కావచ్చు. శిలాజాలలో వైరస్ బాక్టీరియాలకు ఆవాసంగా వుంటాయా అనే విషయం వల్ల కొన్ని సమస్యల పరిశీలనలకు కొత్త సమాధానాలు దొరకొచ్చు.

ఎడారి ఇసుక నేలల రాజస్థాన్ రాష్ట్రంలో, జైసల్మేరే ఒక జిల్లా దానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న గ్రామం పేరు హబర్ (27 ° 19 ¢ N: 70 ° 33 ¢ E). ఈ ప్రాంత ప్రజలు అక్కడ దొరకే సున్నపు రాతిని రెండు కారణాలతో ప్రత్యేకంగా గమనించారు. ఒకటి దాన్ని దగ్గరగా చూస్తే దేవుడి రాతలు అని వాళ్లకు అనిపించే కాలి గ్రఫీ టెక్ఛర్ దానిపై స్పష్టంగా కనిపిస్తూ వుండేది.మరొకటి వాళ్ళు మహత్తుగా భావించిన విషయం ఆ రాయిని కాగబెట్టిన పాలలో వేస్తే అవి వేరే మజ్జిగ పెరుగు లాంటి తోడు కలపకుండానే కొంత సేపటికి పెరుగుగా మరేవి. ఈ ముఛ్చటతో సంబరపడి పూరుకోకుండా ఈ ఊరినుంచి రాళ్లను ఇలా ఎందుకు జరుగుతుందో పరిశీలించమని పంపించారు.

శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ క్రెటేషియస్ ఆప్టియన్ రకపు శిలల వయసు 125 -112 మిలియన్ సంవత్సరాలవిగా గుర్తించారు అంటే పన్నెండున్నర కోట్ల నుంచి పదకొండు కోట్ల సంవత్సరా క్రితం నాటివి. ఈ గోధుమ రంగు, ఫెర్రుగినస్ క్లే బేరింగ్ సున్నపురాయిలో అనేక సూక్ష్మశిలాజాలు వున్నట్లు గమనించారు.  వీటివల్ల ఆ రాతిలో అనేక కాలిగ్రాఫిక్ రాతలు లాగా అనిపించే నిర్మాణాలు కనిపిస్తున్నట్లు తేల్చారు.

ఇక పోతే పాలు పెరుగు కావడం విషయంలోకి వస్తే మనం పెరుగుని తోడు వేస్తున్నాం అనుకుంటాం కానీ పాల నిర్మాణంలో మార్పులు చేయగల బాక్టీరియాను దానిలో కలుపుతున్నాం. కానీ పెరుగును తయారుచేసుకునే మొదటి రోజుల్లో ఈ పద్దతి మాత్రమే కాకుండా అనేక ఇతర మార్గాలను కూడా ఉపయోగించేవారు. మనిషి పెరుగుని కనుక్కుని కనీసం మూడువేల సంవత్సరాలు అవుతుంది. దీని తయారీలో క్లిష్టమైన ప్రోటీన్ శృంఖలాలు(గొలుసులు) ఏర్పడటం అనే పద్దతి వుంది.  బాగా మరగబెట్టిన పాలలో కాల్షియం నిల్వల శాతం పెరిగి అది అనేక దగ్గరి శృంఖల నిర్మాణాలుగా మారి పెరుగుగా రూపొందటం నుంచి ఎండుమిర్చి , చింతపండు లాంటి వాటిలోని బాక్టీరియాలను వాడి పాలను పెరుగుగామార్చడం ఇప్పటికీ పల్లెలలో మనం గమనిస్తూనే వుంటాం. జున్నుపాల తయారీ కోసం జున్నులో పదే పదే నానబెట్టి ఆరబెట్టిన వస్త్రపు ముక్కను కాచి చల్లార్చిన పాలలో వేయడం ద్వారా జున్ను పొందడం అనేది కూడా మనకు తెలుసు. ఆ గుడ్డలో మిగిలిన జున్నుకు కారణమైన బాక్టీరియా మళ్ళీ తగు ఉష్టోగ్రత వద్ద పాలలో కలిసినప్పుడు కుటుంబాలు పెంచుకుని కాలనీలుగా వృద్ది చెంది మొత్తంగా పాలను జున్ను లేదా పెరుగు రూపంలోకి రద్దీ సిటీగా మర్చేస్తాయి.  అదే విధంగా ఈ శిలాజ రాయిలో వున్న విపరీతమైర రంధ్రాలు స్పాంజి రంధ్రాలను పోలి వుంటాయి. అవి అనేక సూక్ష్మజీవులకు ఆవాసం అవుతున్నాయి. వాటిలో పెరిగే ఒకరకం బాక్టీరియా పాలను తోడుకునేలా చేస్తున్నదా లేక వాటిలోని  ఈ రాయిలో అమైనో ఆమ్లాలు, ఫినైల్ అలీనియా, రిఫ్టాఫెన్ టైరోసిన్ లాంటి రసాయనాలు పాలు నుండి పెరుగు తయారీకి సహాయపడతున్నాయా అనేది పరిశీలిస్తున్నారు. కానీ ఇప్పటికే కొందరు ఆ రాళ్లతో గ్లాసులు పాత్రలు ఆకారాలను తయారు చేసి  వాటికి ఈ పెరుగు మహత్తు వుందని చెప్తూ వేలల్లో సొమ్ముచేసుకుంటున్నారు. కానీ పొరపాటున అవి శిలాజాలతో పాటు లక్షలాది అతిచిన్న రంధ్రాలతో వైరస్ బాక్టీరియా లాంటి సూక్ష్మజీవులకు కూడా ఆవాసంగా వుంటున్నాయా వంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. దానికితోడు ఆన్ లైన్ లోను కొన్ని షాపుల్లోనూ అటువంటి రకం రాయితో తయారుచేసి పరీక్ష చేసే సమయంలో చూసేవాళ్ళకు తెలియకుండా కొంచెం పెరుగు కలిపి అదే హబర్ రాయి అని అమ్మి సొమ్ముచేసుకుంటున్న వాళ్ళ సంగతులు కూడా ఆన్ లైన్ లో కనిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం కోసం ఈ లింకులు

file:///C:/Users/Admin/Downloads/729.pdf

http://www.iisc.ernet.in/currsci/sep102005/729.pdf

 

 

 

 

 

 


కామెంట్‌లు