వంటగది జవరాళ్ళుగా
మణిపూర్ లాంగ్సీ(నుంగ్భీ) రాళ్ళ పాత్రలు
మొదట్లో తంగ్ఖుల్
తెగ వారు కుమ్మరిచక్రం లేకుండా కరెంటు యంత్రాలు లేకుండా రూపొందించే నల్లటి రాతి పాత్రలు అల్యూమినియం
(రాతెండి/సత్తు) పాత్రలు రాకముందునుంచే మణిపూర్
సాంప్రదాయంలో ఒక భాగంగా కలిసిపోయివున్నాయి. ఇప్పుడు స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు,
నాన్ స్టిక్ కెమికల్ పూతల పాత్రలు లాంటి అత్యాధునిక వంటపాత్రల శకంలోనూ మళ్ళీ
మరోసారి తమ ప్రత్యేకతలతో ఆరోగ్య విలువలతో మార్కెట్ ను స్వాధీనం చేసుకుంటున్నాయి.
ఉక్రెల్ జిల్లాకు
చెందిన కె.తిమోతి అనే లాంగ్ఫీ రాతిపాత్రల నిపుణుడు 2009లో హస్తకళల విభాగంలో రాతికుండల తయారీలో
రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపిక చేయబడ్డాడు. అతను కుక్కర్,
వాటర్ పాట్ (తంగ్ఖుల్ మాండలికంలో చంఖా), ఫాంపాయి (కుక్కర్), తెంగోట్ (కోక్తి), కప్, వాటర్ పాట్ (ఖోరం) మొదలైనవి తయారుచేస్తాడు. అతని కుండల ఉత్పత్తులు
ఇంఫాల్, నాగాలాండ్, బెంగళూరు మరియు దేశంలోని ఇతర
ప్రాంతాలకు కూడా ఆర్టర్ పై తయారు చేసి పంపడం ప్రారంభించాడు.
ఈ
కుండల ప్రత్యేకత ఏమిటంటే
· ఆహారాన్ని చాల నెమ్మదిగా ఉడికిస్తాయి
దానివల్ల చక్కటి రుచితో పాటు ఆహారంలోని పోషకాలు వృదా అయిపోకుండా ఉంటాయి.
· ఈ పాత్రను గ్యాస్ మీద ఎలాక్ట్రానిక్
ఒవెన్ లోనే కాదు కట్టెల పొయ్యిమీద కూడా వండొచ్చు.
· ఎటువంటి రసాయన పూతలు లేకుండానే నాన్
స్టిక్ లక్షణాలను చూపిస్తుంది.
· ముఖ్యంగా ఇది నూటికి నూరు శాతం పర్యావరణ
హితమైనది బయోడిగ్రేడబుల్ అనేది ఇప్పటి పరిస్థితుల్లో మరింత ఆకర్షణీయమైన అంశం అయ్యింది.
· ఇంకా చెప్పాలంటే ఈ పాత్రల తయారీలో
విద్యుత్తుని కానీ కనీసం యంత్రాలను కానీ వాడాల్సిన అవసరం లేదు. నూరు శాతం చేతిపనుల
ద్వారా తయారయ్యే పనిముట్లు.
ఈ ప్రాంతంలో దొరికేరాళ్ళ
సర్పెంటినైట్ అంటారట.ఈ మృదువైన రాళ్ళను దంచితే మొత్తటి మట్టి లాంటిదాన్ని ఇస్తాయి
దాన్న స్థానికంగా హామ్లీ అని పిలుస్తారు. సల్లా అనే ప్రాంతంలో ఇటువంటి రాళ్ళు
ఎక్కువగా దొరుకుతుంది. ఈ పాత్రల తయారీలో మొదటి పని చక్కటి మూలపదార్ధాన్ని దొరకబుచ్చుకోవడమే.
దానిలో గొధురరంగులో వుండే ఒకరకం బంకమట్టిని కూడా తగుపాళ్లలో వేసి నీటితో మొత్తగా
కలుపుతారు. అటువంటి జిగురు రాతి పొడి ముద్దలను మొదట్లో చేతులతో లేదా అచ్చులలో వేసి
వత్తి కావలసిన ఆకారాలు తయారు చేస్తారు. దాని ద్వారా ఏర్పడిన పాత్రలను నీడలో
ఆరబెడతారు. తగినంత ఆరినతర్వాత మట్టికుండలను కాల్చినట్లు వాములలో వేసి బాగా కాల్చుతారు.
900 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్టోగ్రతలో దాదాపు ఏడు గంటల పాటు బాగా కాల్చుతారు. దాంతో
ఈ ఆకారాలు తిరిగి మళ్లీ రాయేమో అనిపించేంతగా గట్టిగా మారిపోతాయి. అలా బట్టీ నుంచి
బయటికి వచ్చిన పాత్రలను స్థానికంగా దొరికే ‘మాచీ’ పత్రం (పసానియా లేదా పాచిఫిల్లా) తో ఆ పాత్రలను బాగా నునుపు చేస్తారు. దాంతో
రాతిపాత్రలకు చక్కటి టెక్చర్ వస్తుంది.
దేశ విదేశాల్లో డిమాండ్ కి కారణం ఉపయోగాలు మాత్రమే కాదు వీటి అందమైన రూపం
కూడా.
ఆర్ధిక స్వావలంబన
చాలా కుటుంబాలు
పూర్తిగా పాత్రల తయారీలోనే వున్నవారు నెలకు నలభై నుంచి యాభై వేలు
సంపాదించుకోగలుతున్నామని చెప్తున్నారు. ఒక్కో పాత్ర 50 నుంచి 2000 వరకూ వుంటాయి.
ఇంతకీ లాంగ్ పీ
పేరు ఏమిటనేది చెప్పనేలేదు కదా
మణిపూర్
రాష్ట్రంలోని ఉఖ్రుల్ జిల్లాలోని లాంగ్పి కజుయ్ మరియు లాంగ్పి ఖుల్లెన్ అనే రెండు గ్రామాలను లాంగ్పీ
లేదా లాంగ్ పీ అని పిలుస్తారు. 'లాంగ్‌పి' అనే పేరుకు తంగ్ఖుల్ మాండలికంలో గుంపు/ సమూహం అనే అర్ధం.స్థానిక గ్రామ కథనాల
ప్రకారం ఈ ప్రాంతం పూర్వ కాలం నుంచి సుదూర ప్రయాణికులకు మజిలీ స్థానం(మఠం) గా
వుండేదని చెప్పుకుంటారు. ఎనిమిది వేల జనాభా వుండే ఈ జంట గ్రామాలలో ఇప్పుడు 22
తెగలున్నాయి వాటిని ‘‘లోరి’’ అని పిలుస్తున్నారు.
మన
ప్రాంతాలలో గోధుమ మొలకలతో పండగ చేసినట్లు అక్కడ విత్తనాల పండుగను లుయిరా లేదా
లూయిటా ఫనీత్ అనే పేరుతో చేస్తారు. లూయిరా రకం వంటకాలన్నీ లాంగ్ఫీ పాత్రలలోనే
చేయడం ఆచారం. వీరు ఇష్టంగా తినే ఫోర్క్ వంటకాన్ని చారెడంత పెద్ద పెద్ద ముక్కలు
కోసి లాంగ్ఫీ పాత్రలో మితమైన ఉష్ణోగ్రతలో ఎక్కువ సేపు వండుతారు. జనవరిలో జరుపుకునే సాంప్రదాయక పండుగ సంధర్భంగా ఈ
పాత్రలలో చేసిన మాంసాహారవంటలను,వేరే పాత్రలో వైన్ ద్రావణాన్ని పోసి బంధువులకు ఆఫర్
చేస్తూ ఇంటిముందు చావిడీలో అరుగుల మీద పెట్టి వుంచుతారు. ఈ సాంప్రదాయం
నిన్నమొన్నటి వరకూ లాంగ్పీ ప్రాంతానికి పర్యాటక ఆకర్షణగా కూడా మారింది.
లాంగ్
ఫీ రాతి పాత్రల వేర్వేరు రూపాలు రేట్లు తెలుసుకునేందుకు ఇక్కడ చూడండి
https://www.heartforartonline.com/collections/longpii-black-pottery
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి