కడుపుచించుకుంటే కాళ్ళమీడ పడుతుంది అనే సామెతను స్వంతవాళ్లసంగతులే ఇంకా ఏం చెప్తాంలే అనే సాధారణ నానుడిగా వాడతాం కానీ అసలు ఇలా కడుపు చించుకునే సాంప్రదాయం ఒకటుందని తెలుసా?
గాలంపుగొంకి గంకాళచర్మము గ్రుచ్చు యుడువీధి
నుయ్యెల లూగువారు
కటికి
హోన్నాళంబు గండకత్తెర వట్టి మిసిమింతులునుగాక మ్రింగువారు
వందులను
నారసంబులు సలుపువారు యెడమ కుడిచేత, నారతులిచ్చువారు
సాహసమ
మూర్తిగై కొన్న సరణివారు ధీరహృదయులమైలారు వీరభటులు
వీరగల్లు శిల్పాలలో మనకు అనేక రకాలు కనిపిస్తుంటాయి. ఆత్మార్ఫణ విధానాలు వేరువేరు. బంగారు నాళపు (హొన్ను+నాళము) పిడిగల గండకత్తెర, శిరఃఖండన(తలనరుక్కోవడం ఇందులో మళ్ళీ రకాలున్నాయి), సల్లేఖన(ఆహారం కాని, నీరు కానీ తీసుకోకుండా శరీరాన్ని శుష్కింపజేసుకోవడం), శస్త్రసత విచ్చేదన(దబ్బనాలవంటి సాధనాలతో గుర్చుకోవడం), సతి, భృగుపాతం (కొండకొసనుంచి దూకడం) అగ్నిగుండప్రవేశం(ఆత్మాహుతి) ఇందులో హరకిరి అనే పద్దతిలో ఆత్మార్పణ చేసుకున్న వీరగల్లు విగ్రహాన్ని ఒకదాన్ని మొన్నీమధ్య హైదరాబాద్ స్టేట్ మ్యూజియం సందర్శన సందర్భంగా చూసాను.
జపాన్ భాషలో హర అంటే పొట్ట లేదా కడుపు అని కిరి
అనేది వాళ్ల కిరు అనే క్రియపదం అంటే కత్తిరించుట, తెంపుట అనే అర్ధంనుంచి
ఏర్పడినది. ఇలా పొట్టను కత్తిరించుకోవడం అనే భయానకమైన ఆత్మాహుతి పద్దతిని
వాళ్లదేశంలోని ఆదిమ సంప్రదాయంగా చెప్పకుంటారు. అరుంధతిలో జేజమ్మ అనుష్క
కొబ్బరికాయలతో తలపై కొట్టించుకుని మరణానికి మరచిపోలేని బాధను జతచేయడం అనే దృశ్యం
గుర్తొస్తుంది ఇలా స్వయంగా మరణించేంతవరకూ స్వయంగా పొట్టను కత్తిరించుకునే
సంప్రదాయం గురించి తెలుసుకుంటున్నప్పుడు. దీన్ని భక్తితో మాత్రమే కాకుండా
శత్రువుకి సమస్తరాజ్యం చిక్కి ప్రభువుసైతం వారి చేతిలో హతమైన సందర్భంలో వారిచేతిలో
చిక్కి దీర్ఘకాల చిత్రహింసల జీవనం కన్నా, ప్రభావం చూపలేని పోరాటం కన్నా ఇటువంటి
మరణాన్ని ఆశ్రయించేవారని వారి కథలలో చెప్తారు. అటువంటి దృశ్యాన్ని చాలా స్పష్టంగా
మన దగ్గర కూడా వున్నట్లు ఈ విగ్రహం చూపిస్తోంది. నేనిప్పటివరకూ చూసిన వీరగల్లులలో
ఇది చాలా ప్రత్యేకంగా అనిపించింది.
సెప్పుక్కు అనే మరో సైనోజపనీస్ పద్దతి అర్ధం కూడా సెట్సు(setsu) అంటే కత్తిరించడం, fuku అంటే పొట్ట seppuku లో కూడా పొట్టని కత్తిరించుకోవడం ద్వారానే మరణం వుంటుంది కానీ దీన్ని సాంప్రదాయంగానూ, కఠినశిక్షగానూ కూడా వినియోగిస్తారు. సమురాయ్ తన నిభందనలను మీరి విద్రోహానికి పాల్పడినట్లయితే శిరఃఖండన శిక్షకు ప్రత్యామ్నాయ సూచనగా ఈ స్వీయ క్షుద్విచ్చేదనకు అవకాశం ఇస్తారు.
Seppuku -- ritual, second finishes you off.
Harakiri -- informal, solo flight suicide.
మరి నరసింహుడు హిరణ్యకశపుని పొట్టచీల్చినట్లు ఈ జపనీయులు సాంప్రదాయంగా దీన్ని ఎందుకు సాధన చేసారు? జపాన్ దేశంలో వ్యాప్తిలో వున్న జెన్ బౌద్ధంలో శరిరంలోని ఏడు చక్రాలను ఏడు సింహాలుగా భావిస్తారు. వాటిలోనే శరీర జీవశక్తి అంతా నిండివుంది అంటారు. నాడులన్నీ(న్యూరాన్స్) ముడివేసుకుని కుప్పపడటమే మొదడుగా భావిస్తే అవే నాడులు వేర్వేరు చోట్ల కుప్పలుగా చక్రాలుగా వుంటాయని, ఆయా విధుల నిర్వహణకు తగినంత ఆజ్ఞలను పంపడం, జ్ఞాపకాన్ని కలిగుండటం చేస్తాయని అటువంటి పరిధీయ నాడీసంధానాలనే చక్రాలన్నారా అంటూ వీరభ్రహ్మంగారి శిష్యుడు కక్కయ్యలాగా కత్తిరించిచూసినా చక్రాలేవీ కనబడవు సుమీ అనేవారికి వివరణలతో కూడిన సమాధానాలు కొన్ని ఈ మధ్య దొరుకుతున్నాయి.
వీళ్ళు మూలాధార చక్రాన్ని కామకేంద్రమంటారు. ఇది మొదటి చక్రం. మనిషి శరీరంలోని జీవశక్తి అంతా ఇక్కడే నిక్షిప్తమై వుంటుంది. రెండోది స్వాధిస్టాన చక్రం దీన్నే హరకేంద్రం అనికూడా అంటారు. హరకేంద్ర విచ్ఛేదన కాబట్టే దాన్ని హరకిరి అనే పేరుతో పిలుస్తారు. పైగా హరకేంద్రంలో ప్రత్యేక పూజాపద్దతులతో తయారుచేసిన పవిత్రకత్తితో గుచ్చితే నొప్పితెలియకుండా ప్రాణం అంతవిశ్వంలోకి వెళుతుంది అని ప్రగాఢంగా విశ్వసిస్తారు. మూడోడి బొడ్డు లేదా నాభి దగ్గర వున్న మణిపూరక చక్రం, నాల్గవది హృదయం దగ్గరున్న అనాహత చక్రం, ఐదవది గొంతు దగ్గరి విశుద్ధ చక్రం ఆరవది భృకుటి వద్ద వున్న ఆజ్ఞాచక్రం, చివరిది ఏడవది మరింత ముఖ్యమైనది శిరస్సు పైభాగంలో చిన్నతనంలో వేర్వేరు పుర్రె ఎముకలు కలిసి ఒకటే కపాలంగామారడానికి ముందు వాటి మధ్యలో వున్న రంధ్రం దగ్గరలోని సహస్రారచక్రం. మనం భారతీయ సంప్రదాయం లో కూడా దీన్ని కుండలిని అని ధ్యానం ద్వారా వేర్వేరు చక్రాలను ఉత్తేజితం చేస్తూ క్రిందనుంచి పైకి కదులుతూ చివరికి పునర్జన్మలేని స్థితికి వెళ్లేందుకు సహస్రారం వరకూ ఉత్తేజితం చెందించాలని యోగులు చెప్తుంటారు. అదే సహస్రారం నుంచి ప్రాణం వెడలిపోతే కపాలమోక్షం అంటారు. దహనసమయంలో పుర్రెఎముకలు పేలిపోవడాన్ని కూడా ఈపేరుతోనే పిలవడం వింటుంటాం.
.జైనంలో కూడా కుండలిని శక్తిని నమ్మడం కుండలిని ఉత్తేజం గురించి పవిత్రమైన నమ్మకాలు వున్నవి. జైన మతాచార్యుడైన మహావీరుడి దగ్గరకు ఎవరైనా వచ్చినప్పుడు వారి శరీరంలోని ఎన్ని చక్రాలు చైతన్యవంతంగా వున్నయో వాటి స్థితి ఏమిటి అనేదాన్ని బట్టి అతని స్వభావాన్ని చెప్పేవాడట. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తడం ద్వారా మాయను తొలగించుకోవచ్చు అనేది కూడా చెప్పేవాడట.
కాలం చిత్రమైన ప్రవాహం జీవులతో పాటు వారి జ్ఞానాన్ని సాంప్రదాయాలను తనతోపాటు ఉరవడిగా లాక్కుపోతూనే వుంటుంది. కాలం చిత్రాతి చిత్రమైనది తను తుడిచేసిన ఆనవాళ్ళను లోకన్ను వున్నవాళ్ళకు కనిపించేలా కొన్ని ఆధారాలనూ తనే వదిలుతూ తమాషా చూస్తుంటుంది.
"దుత్ర తాళంబున వీరగు బీతక ధుం
ధుం
ధుం కిటాత్కార సం
గతి
వాయింపుచు నాంతరాళిక యతి
గ్రామాభిరామంబుగా"
- క్రీడాభిరామము
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి