||ప్రేమలో పడేసిన వాక్యాలు కొన్ని ||

 ||ప్రేమలో పడేసిన వాక్యాలు కొన్ని || @Katta Srinivas


నాకు తగినంత నమ్మకం కలగగానే, వేదిక మాయమైపోతుంది.
పోతేపోయిందని సిద్ధపడ్డాక, విజయం వరిస్తుంటుంది.
మనుషులు కావాలని తహతహలాడితే, నన్నొదిలి పోతారు వాళ్ళు.
కన్నీళ్ళింకి పోయిన తర్వాత, భరోసానివ్వగల భుజం దొరికుతుంది.
ద్వేషించేకళలో పట్టభద్రుడినైపోయాక,
హృదయాంతరాళంలోంచి ఇష్టపడటం మొదలేసారెవరో.
చిన్నవెలుతురుకోసం గంటలకొద్దీ వేచివేచి అలసటతో కునుకుతీయగానే పొద్దుపొడువు నెమ్మదిగా విచ్చుకుంటుంది.
అదేకదా జీవితం
మన ప్రణాళికలేమిటన్నదే ముఖ్యంకాదు, జీవితం మనకేమి సిధ్దం చేసిందో తెలుసుకోలేము.
విజయం నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుందేమో
పరాజయం ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తుంది.
పాత్రలో ప్రతిక్షణం ఆనందం నింపుతుండు
చాలాసార్లు ఆశల దారులన్నీ ముగిసాయి అంటుంటాం
ఎక్కడో విధాత ఎవరో నవ్వుతూ మలుపేకదా అంటాడు.
Original : william shakespeare Quote tweeted by Sophia Loren_1950 (Actress)
తెలుగుసేత : కట్టా శ్రీనివాస్

కామెంట్‌లు